ప్రపంచపు అత్యంత ఆధునిక విమానం ఎయిర్‌బస్ ఏ350-900 గురించి ఆసక్తికర నిజాలు

Written By:

ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగంలో పురుడు పోసుకుంటున్న అనేక సాంకేతికతలు విమానాలను ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగానే అత్యాధునిక విమానంగా ఇప్పుడు ఎయిర్‌బస్ ఎ350-900 మొదటి స్థానంలో నిలిచింది.

దేశీయంగా అనేక అంతర్జాతీయ విమానాలు రాకపోకలు సాగిస్తూనే ఉన్నాయి. అయితే మొదటి సారిగా ఈ అత్యాధునిక విమానం భారత భూబాగంపై ల్యాండ్ అయ్యింది. దీని గురించి పూర్తి వివరాలు నేటి విమానాలు అనే శీర్షిక ద్వారా తెలుసుకుందాం రండి...

లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్‌కు చెందిన ఎయిర్ ఏ350-900 విమానం మొదటి సారిగా గత శనివారం (11/02/2017) ఢిల్లీలో ల్యాండ్ అయ్యింది. విమానయాన ఉత్పత్తుల తయారీలో విప్లవాత్మకమైన విమానం ఎయిర్‌బస్ ఏ350-900.దీనికి ఉన్న విభిన్న విలక్షణమైన లక్షణాలకు గాను ఇది ప్రపంచపు అత్యంత ఆధునిక విమానంగా పేరుగాంచింది.

మొత్తం 325 మంది ప్రయాణించే వీలున్న ఈ విమాం నాన్ స్టాప్‌గా 15,000 కిలోమీటర్ల పాటు ప్రయాణిస్తుంది. బిజినెస్, ప్రీమియమ్ మరియు ఎకానమి క్లాస్ ట్రావెల్ సదుపాయం ఉన్న ఈ విమానం మొత్తం బరువు 280 టన్నులుగా ఉంది.

లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ దీనిని కొనుగోలు చేసిన అనంతరం ప్రత్యేకంగా మోడిఫికేషన్స్ నిర్వహించింది. ప్రతి ప్యాసింజర్ కోసం పెద్ద పరిమాణంలో ఉండే టీవీ స్క్రీన్లు, ఇంటీరియర్ ఇన్నోవేటివ్ మూడ్ లైట్లను మరియు వ్యక్తిగత మ్యూజిక్ ప్లే లిస్ట్ లతో పాటు ఇతర ఫీచర్లను కల్పించింది.

ఎయిర్‌బస్ విమానయాన ఉత్పత్తుల తయారీ సంస్థ నిర్మించిన ఈ ఏ350-900 విమానం 25 శాతం తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుంది. మరియు టేకాఫ్ సమయంలో తక్కువ శబ్దాన్నిస్తుంది.

లుఫ్తాన్సా ఎయిర్ లైన్స్ ఏ350-900 విమానాన్ని డిసెంబర్ 2016 లో కొనుగోలు చేసింది. మొదటి సారిగా గత శనివారం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చింది. ఢిల్లీ విమానాశ్రయ అధికారులు నీటితో సాదర స్వాగతం పలికారు.

యూరోపియన్‌కు చెందిన ప్రముఖ విమానయాన ఉత్పత్తుల తయారీ సంస్థ ఎయిర్‌బస్ ఏ350-900 విమానానికి ముందు ఏ340-300 మరియు -500 విమానాలను అందుబాటులోకి తెచ్చింది. వీటికి కొనసాగింపుగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ నిర్వహణ ఖర్చు ఉండే విధంగా అభివృద్ది చేయబడింది.

ప్రస్తుతం విపణిలో ఉన్న బోయింగ్ 777 మరియు బోయింగ్ 787 విమానాలకు ప్రత్యక్ష పోటీనిస్తున్న ఈ విమానం, బోయింగ్ 777 తో పోల్చుకుంటే 30 శాతం తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటుంది. మరియు పరిమాణం పరంగా 16 శాతం పెద్దదిగా ఉంటుంది.

ఎయిర్‌బస్ ఏ350 శ్రేణిలో ఇప్పుడు -800, -900 మరియు -1000 వేరియంట్లు ఉన్నాయి. వీటి పొడవు వరుసగా 60.5, 66.8, 73.8 మీటర్లుగా ఉంది.

ఎయిర్‌బస్ ఏ350-900 విమానంలో ల్యాండింగ్ మరియు టేకాఫ్‌కు అతి ముఖ్యమైన అండర్ క్యారేజీలో నాలుగు భోగీలను అందించింది. అయితే బ్రిటీష్ ఎయిర్ వేస్ ప్రారంభించిన లండన్-సిడ్నీ నాన్ స్టాప్ విమానంలో నాలుగు భోగీల స్థానంలో ఆరు భోగీలను అందివ్వడం జరిగింది.

కొలతల పరంగా ఈ విమానం ఎత్తు 17.05 మీటర్లు, పొడవు 66.8 మీటర్లు, రెక్కల పొడవు 64.75 మీటర్లు మరియు వీల్ బేస్ 28.67 మీటర్లుగా ఉంది. ఈ విమానం యొక్క గరిష్ట ఇంధన స్టోరేజ్ సామర్థ్యం 1,41,000 లీటర్లుగా ఉంది.

ఎయిర్‌బస్ తమ ఏ350-900 విమానంల రోల్స్ రాయిస్ కు చెందిన రెండు ట్రెంట్ ఎక్స్‌డబ్ల్యూబి అనే ఇంజన్‌లను అందించింది. ఇవి గరిష్టంగా 340కిలోనాట్ థ్రస్ట్‌ను ఉత్పత్తి చేస్తుంది.

 

English summary
Interesting Facts About Airbus A350-900 Aircraft
Story first published: Tuesday, February 14, 2017, 13:18 [IST]
Please Wait while comments are loading...

Latest Photos