తల్లికి తగ్గ తనయ 'జాన్వి కపూర్' ఖరీదైన లగ్జరీ కారు.. ఇక్కడ చూడండి

'జాన్వీ కపూర్' గురించి దాదాపు అందరికి తెలుసు. ఎందుకంటే అతిలోక సుందరి 'శ్రీదేవి' కూతురు కాబట్టి, అయితే జాన్వీ కపూర్ వినియోగించే కార్లను గురించి తక్కువమందికే తెలుసు.

ధడక్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన 'జాన్వీ కపూర్' అత్యంత ఖరీదైన కార్లను కలిగి ఉంది. కాగా ఇటీవల ఒక లగ్జరీ కారులో కనిపించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

తల్లికి తగ్గ తనయ జాన్వి కపూర్ ఖరీదైన లగ్జరీ కారు

'శ్రీదేవి మరియు బోనీ కపూర్'ల గారాల పట్టి సినీ రంగంలో తనదైన శైలిలో రాణిస్తోంది. అంతే కాకూండా ఎప్పటికప్పుడు ఖరీదైన కార్లలో కనిపిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే ఇటీవల 'లెక్సస్ ఎల్ఎక్స్ 570' కారులో కనిపించింది. జిమ్ నుండి బయటకు వచ్చే సమయంలో ఈ కారు కనిపించింది. ఈ లెక్సస్ ఎల్ఎక్స్ 570 చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.

సోషల్ మీడియాలో విడుదలైన ఈ వీడియోలో 'జాన్వీ కపూర్' జిమ్ నుంచి బయటకు వచ్చి అక్కడే పార్కింగ్ లో ఉన్న తన 'లెక్సస్ ఎల్ఎక్స్ 570' కారులో వెళుతుంది. ఇక్కడ కనిపించే కారు బ్లాక్ కలర్ లో ఉంది. కాగా ఇది 2019 లో జాన్వీ కపూర్ పేరు మీదుగా సిజిస్టర్ చేయబడినట్లు తెలుస్తోంది. అయితే ఈ SUV లో ఈమె చాలా అరుదుగా అప్పుడప్పుడు కనిపిస్తుంది.

లెక్సస్ ఎల్ఎక్స్ 570 విషయానికి వస్తే, ఇది 5.7 లీటర్ వి8 పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుంది. ఇది 362 బిహెచ్‌పి పవర్ మరియు 530 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది కేవలం 7.7 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఎల్ఎక్స్ 450డి వేరియంట్ 4.5 లీటర్ వి8 డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ పొందుతుంది.

లెక్సస్ ఎల్ఎక్స్ 570 అద్భుతమైన డిజైన్ పొందుతుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్ లైట్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్, ఎల్ ఈడీ డిఆర్ఎల్ మొదలైనవి ఉన్నాయి. అదే సమయంలో ఈ లగ్జరీ SUV యొక్క ఇంటీరియర్ డిజైన్ మరియు ఫీచర్స్ కూడా చాలా ఆధునికంగా ఉంటాయి. అంతే కాకుండా.. సేఫ్టీలో కూడా వాహన వినియోగదారులకు పటిష్టమైన భద్రతను కల్పించడంలో ఏ మాత్రం కొదువ ఉండే అవకాశం లేదు.

సేఫ్టీ పరంగా 'లెక్సస్ ఎల్ఎక్స్ 570' మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, సీట్ బెల్ట్ వార్ణింగ్ మరియు చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్స్ వంటి మరెన్నో కలిగి ఉంటుంది. మొత్తం మీద లెక్సస్ ఎల్ఎక్స్ 570 మంచి డిజైన్, ఆధునిక ఫీచర్స్ కలిగి అద్భుతమైన పనితీరుని అందిస్తుంది. ఈ లగ్జరీ కారు సెలబ్రటీలకు ఇష్టమైన కార్లలో ఒకటి కావడం గమనార్హం.

ఇదిలా ఉండగా ఈ ఏడాది ప్రారంభంలో 'జాన్వీ కపూర్' జర్మన్ లగ్జరీ బ్రాండ్ అయిన 'మెర్సిడెస్ బెంజ్ జి క్లాస్ 350డి' లో కనిపించింది. ఈ లగ్జరీ కారు ధర రూ. 2 కోట్లు (ముంబై). ఇది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇంజిన్ స్టార్ట్ స్టాప్ బటన్, మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు పవర్ విండోస్ వంటి ఫీచర్లను పొందుతుంది.

లెక్సస్ ఎల్ఎక్స్ 570 మరియు బెంజ్ జి క్లాస్ 350డి వంటి వాటితోపాటు, రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ, మెర్సిడెస్ మేబాచ్ ఎస్ క్లాస్, రేంజ్ రోవర్ ఎవోక్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ మరియు మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ వంటివి కూడా జాన్వీ కపూర్ గ్యారేజిలో ఉన్నాయి. అయితే జాన్వీ కపూర్ తనకు ఇష్టమైన 'మెర్సిడెస్ బెంజ్ జి క్లాస్' లో ఎక్కువగా కనిపిస్తుంది.

ఇక్కడ తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జాన్వీ కపూర్ ఉపయోగించే మెర్సిడెస్ మేబాచ్, చనిపోయిన తన తల్లి శ్రీదేవి యొక్క 'మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్' కారు యొక్క అదే నెంబర్ '7666' కలిగి ఉంది. శ్రీదేవి అప్పట్లో మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ ఎస్ 350 డి ఉపయోగించగా, తల్లికి తగ్గ తనయగా జాన్వీ కపూర్ ఇదే మోడల్ యొక్క హై ఎండ్ వెర్షన్ సెడాన్ ఉపయోగిస్తోంది.

Most Read Articles

English summary
Jahnvi kapoor lexus lx 570 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X