Just In
- 2 min ago
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఖాయం అంటున్న పెట్రోలియం మంత్రి.. ఎప్పటినుంచో తెలుసా !
- 57 min ago
మార్చి 3వ తేదీ నుండి రెనో కైగర్ కాంపాక్ట్ ఎస్యూవీ డెలివరీలు ప్రారంభం
- 1 hr ago
కొత్త 2021 స్విఫ్ట్ కోసం అఫీషియల్ యాక్ససరీస్‌ను వెల్లడించిన మారుతి సుజుకి
- 2 hrs ago
హీరో బైకులు కొనే వారికీ గుడ్ న్యూస్.. ఇప్పుడు అందుబాటులో ఉన్న అదిరిపోయే ఆఫర్లు & డిస్కౌంట్లు
Don't Miss
- News
Sunny Leone: మేడమ్ మొగుడికే స్పాట్ పెట్టాడు, కారు నెంబర్ తో త్రీడి సినిమా, పీయూష్ !
- Sports
ముంబైలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఐపీఎల్ 2021పై బీసీసీఐ పునరాలోచన! తెరపైకి ప్లాన్-బి!
- Movies
టాలీవుడ్‌పై జగపతిబాబు సంచలన వ్యాఖ్యలు: నిజాలే మాట్లాడతానంటూ అన్నీ బయట పెట్టిన స్టార్!
- Lifestyle
మీకు చిట్లిన లేదా విరిగిన జుట్టు ఉందా? దీన్ని నివారించడానికి సాధారణ మార్గాలు ఇక్కడ ఉన్నాయి!
- Finance
ఆర్థిక మాంద్యం నుండి బయటకు భారత్, తలసరి ఎంత అంటే
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఇదేం సిత్రం.. ట్రక్కులో కట్టేసి తీసుకెళ్తున్న జావా 42 బైక్‌కి ఓవర్‌స్పీడింగ్ ఛలాన్!?
ఒక్కోసారి మితిమీరిన టెక్నాలజీ కూడా మనల్ని అనవసరంగా చిక్కుల్లో పడేస్తుంటుంది. అలాంటి ఓ సంఘటనే ఇది. రోడ్లపై ట్రాఫిక్ పోలీసులను తగ్గించేందుకు ప్రభుత్వాలు సిసిటివి కెమెరాలను మరియు, ఓవర్ స్పీడింగ్ చేసే వారిని కంట్రోల్ చేసేందుకు ఆటోమేటిక్ స్పీడ్ డిటెక్షన్ కెమెరాలను ఏర్పాటు చేసిన సంగతి మనందరికీ తెలిసినదే.

మోషన్ డిటెక్షన్ సామర్థ్యంతో కూడిన ఈ కెమెరాలు, రోడ్డుపై ఏదైనా వాహనం నిర్ధేశిత వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు గుర్తించి, ఫొటోలను తీస్తాయి. ఇలా తీసిన ఫొటోలను కంట్రోల్ రూమ్ వారు పరిశీలించి, సంబంధిత వాహనానికి దాని రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా ట్రాఫిక్ ఛలాన్ విధిస్తారు.

అయితే, ఢిల్లీలో ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. మనోజ్ కుమార్ అనే వ్యక్తి, బ్రేక్‌డౌన్ అయిన తన జావా 42 మోటార్‌సైకిల్‌ను షోరూమ్‌కి తరలించేందుకు టోయింగ్ సేవలను ఆశ్రయించారు. ఇలా టోయింగ్ కోసం వచ్చిన ఓ మినీ ట్రక్‌లో తన మోటార్‌సైకిల్‌ను ఎక్కించి షోరూమ్‌కి తరలించారు.

ఇదంతా బాగానే ఉన్నప్పటికీ, ఆ ట్రక్ షోరూమ్‌కి చేరుకునే లోపే, సదరు మోటార్‌సైకిల్ రిజిస్ట్రేషన్ నెంబర్‌పై రెండు ఓవర్‌స్పీడింగ్ ఛలాన్లు వచ్చిపడ్డాయి. అసలు, తాను ఆ రూట్లో మోటార్‌సైకిల్‌ను నడపకుండానే ఛలాన్లు ఎలా వచ్చాయా అని మనోజ్ కుమార్ షాక్ అయ్యాడు. ఛలాన్ కోసం అప్‌లోడ్ చేసిన ఫొటోలను చూసి ఆశ్చర్యపోయాడు.

నిజానికి అక్కడ ఓవర్‌స్పీడింగ్ చేసింది, మనోజ్ కుమార్ జావా 42 మోటార్‌సైకిల్‌ను తీసుకెళ్తున్న మినీ ట్రక్. కానీ ఆటోమేటిక్ కెమెరాలు మాత్రం ట్రక్ బెడ్‌పై ఉన్న మోటార్‌సైకిల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్‌ను క్యాప్చూర్ చేశాయి. ఈ విషయాన్ని మనోజ్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో, అది కాస్తా వైరల్ అయ్యింది.

ఆటోమేటిక్ కెమెరాలు తప్పు చేశాయి సరే, కానీ ఆ ఫొటోలను పరిశీలించిన అధికారులు ఏం చేస్తున్నట్లు అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజెన్లు. ఏదేమైనప్పటికీ, మితిమీరిన వేగం ప్రమాదానికి కారణం అనే విషయాన్ని మీరు కూడా మరోసారి గుర్తుంచుకోండి.

ఇక జావా మోటార్‌సైకిల్స్‌కి సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తమ ఫోర్టీ టూ (42) మోడల్‌లో ఓ కొత్త 2021 వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ సరికొత్త 2021 జావా ఫోర్టీ టూ క్రూయిజర్ మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ.1.84 లక్షలు (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

పాత వెర్షన్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్ ఇప్పుడు సీరియస్ వైట్, ఆల్-స్టార్ బ్లాక్ మరియు ఓరియన్ రెడ్ అనే మూడు కొత్త రంగులో లభిస్తుంది. ఈ మూడు పెయింట్ స్కీమ్స్‌లో కూడా ఫ్యూయెల్ ట్యాంక్‌పై రేసింగ్ స్ట్రైప్స్‌తో కూడిన ‘42' నెంబర్ మరియు ‘క్లాసిక్ లెజెండ్స్' అనే బాడీ గ్రాఫిక్స్ కనిపిస్తాయి.

పాత వెర్షన్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త 2021 జావా ఫోర్టీ టూ మోడల్ ఇప్పుడు సీరియస్ వైట్, ఆల్-స్టార్ బ్లాక్ మరియు ఓరియన్ రెడ్ అనే మూడు కొత్త రంగులో లభిస్తుంది. ఈ మూడు పెయింట్ స్కీమ్స్‌లో కూడా ఫ్యూయెల్ ట్యాంక్‌పై రేసింగ్ స్ట్రైప్స్‌తో కూడిన ‘42' నెంబర్ మరియు ‘క్లాసిక్ లెజెండ్స్' అనే బాడీ గ్రాఫిక్స్ కనిపిస్తాయి.

మునుపటి జావా ఫోర్టీ టూ మోడల్‌లో ఉపయోగించిన 293సిసి లిక్విడ్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌నే ఈ కొత్త 2021 మోడల్‌లోనూ ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 27 బిహెచ్‌పి పవర్‌ను మరియు 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.