వేగంగా వస్తున్న ట్రైన్‌కి అడ్డంగా వెళ్లి చిన్నారి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో [వీడియో]

సాధారణంగా ప్రతి మనిషిలోనూ దయ, కరుణ మరియు మానవత్వం అనేవి ఉంటాయి. ఈ మానవత్వం అనేది ప్రతి మనిషికి అవసరమైన సమయంలో బయటకు వస్తుంది. ఒక మనిషి ఇంకో మనిషిని కాపాడిన సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. ఇదే తరహాలో ఇప్పుడు ఇటీవల ఒక మనిషి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఎదురుగా వస్తున్న ట్రైన్ కి అడ్డంగా పరుగెత్తి ఒక పాప ప్రాణాన్ని కాపాడాడు.

వేగంగా వస్తున్న ట్రైన్‌కి అడ్డంగా వెళ్లి చిన్నారి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో [వీడియో]

ట్రైన్ కి అడ్డంగా పరుగెత్తుకెళ్లి పాపను కాపాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అత్యంత వేగంగా వస్తున్న ట్రైన్ నుంచి కాపాడిన ఆ వ్యక్తి, రైల్వే పాయింట్‌మన్ 'మయూర్ షెల్కే'గా గుర్తించారు.

వేగంగా వస్తున్న ట్రైన్‌కి అడ్డంగా వెళ్లి చిన్నారి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో [వీడియో]

నివేదికల ప్రకారం రైల్వే ప్లాట్‌ ఫాంపై ఇద్దరు నడుచుకుంటూ వెళుతున్నారు. అంతలోనే సడెన్‌గా చిన్నారి ప్లాట్‌ఫాం చివరికి వెళ్లి కాలుజారి అమాంతం ట్రాక్‌పై పడిపోయింది. అదే సమయంలో వెనక నుంచి ట్రైన్‌ చాలా వేగంగా దూసుకొస్తోంది. ట్రాక్‌పై నుంచి లేచి ప్లాట్‌ఫైంకి ఎక్కేందుకు చిన్నారి ప్రయత్నించినా ఆ ఎత్తుకి ఎక్కలేకపోయింది.

MOST READ:లంబోర్ఘిని ఉరుస్ కారు కొన్న మరో బాలీవుడ్ సెలబ్రెటీ.. ఎవరంటే?

వేగంగా వస్తున్న ట్రైన్‌కి అడ్డంగా వెళ్లి చిన్నారి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో [వీడియో]

ట్రైన్ దగ్గరికి వచ్చేస్తూ ఉంది, కానీ ఇంతలో ఎటునుంచి వచ్చాడో కానీ అతడు, ట్రాక్‌పై ట్రైన్‌కి ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చి చిన్నారిని అమాంతం ప్లాట్‌ఫాం పైకి వేగంగా ఎక్కించి ఆమె ప్రాణాలు రక్షించాడు. వెంటనే తను కూడా ప్లాట్‌ఫాం ఎక్కేసి తన ప్రాణాలు కాపాడుకున్నాడు.

వేగంగా వస్తున్న ట్రైన్‌కి అడ్డంగా వెళ్లి చిన్నారి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో [వీడియో]

ఈ సంఘటన యొక్క వీడియో గత కొన్ని రోజులుగా వైరల్ అవుతోంది. వైరల్ అయిన ఈ వీడియో జావా మోటార్ సైకిల్ కంపెనీ డైరెక్టర్ అనుపమ్ తరేజా దృష్టికి వచ్చింది. మయూర్ షెల్కే చేసిన ఈ పని అనుపమ్ తరేజాను ఎంతగానో ఆకట్టుకుంది. షెల్కే యొక్క నిస్వార్థ వైఖరిని మరియు ధైర్యాన్ని అభినందిస్తూ, కొత్త జావా బైక్‌ను గిఫ్ట్ గా ఇచ్చాడు.

MOST READ:వరల్డ్ కార్ ఆఫ్ ది ఇయర్ 2021 అవార్డును దక్కించుకున్న ఫోక్స్‌వ్యాగన్ ఐడి 4

వేగంగా వస్తున్న ట్రైన్‌కి అడ్డంగా వెళ్లి చిన్నారి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో [వీడియో]

ఈ సంఘటన తర్వాత మయూర్ షెల్కే ధైర్యాన్ని సెంట్రల్ రైల్వే అధికారులు ప్రశంసించారు. అంతే కాకుండా ఈ సాహసోపేతమైన ఈ రైల్వే ఉద్యోగికి 50,000 రూపాయల నగదు బహుమతి కూడా లభించింది.

వేగంగా వస్తున్న ట్రైన్‌కి అడ్డంగా వెళ్లి చిన్నారి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో [వీడియో]

షెల్కే యొక్క ఈ వీడియోను ట్విట్టర్‌లో చాలామంది వీక్షించారు, పాయింట్ మ్యాన్ మయూర్ షెల్కేకు జావా మోటార్ సైకిల్ కంపెనీ మొత్తం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు.

MOST READ:ఫ్యాన్సీ నెంబర్ కల్చర్‌కి బ్రేక్ వేసిన గవర్నమెంట్; ఎక్కడో తెలుసా?

ఇప్పుడు నడుస్తున్న మన జావా హీరోస్ ఇనిషియేటివ్ భారతదేశంలోని అన్ని మూలల నుండి నిజమైన హీరోలను గుర్తించి, జావా కంపెనీ వారిని కొత్త బైకులతో గౌరవిస్తుందని ఆయన అన్నారు. అనుపమ్ తరేజా మాదిరిగానే మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా కూడా తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

వేగంగా వస్తున్న ట్రైన్‌కి అడ్డంగా వెళ్లి చిన్నారి ప్రాణాలు కాపాడిన రియల్ హీరో [వీడియో]

మయూర్ షెల్కే సినిమాల్లో కనిపించే సూపర్ హీరోల కంటే ఎక్కువ ధైర్యం చూపించారు. నిజంగానే ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఒక మనిషి తన ప్రాణాలను ఒడ్డి ఇంకో ప్రాణాన్ని కాపడం అనేది సాధారణమైన పని కాదు. ఏది ఏమైనా మయూర్ షెల్కే అభినందనీయుడు.

MOST READ:2021 A7 L కారుని ఆవిష్కరించిన ఆడి; వివరాలు

Most Read Articles

English summary
Jawa Motorcycles Honors Railways Hero Mayur Shelke By Giving New Jawa Bike. Read in Telugu.
Story first published: Wednesday, April 21, 2021, 20:03 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X