అలెర్ట్.. అలెర్ట్: ఓలా ఎలక్ట్రిక్ పేరుతో కొత్త రకమైన మోసం.. ఆద మరిస్తే అంతే సంగతి: అసలు నిజాలు ఇవే

గతంలో మనం చాలా స్కామ్లను గురించి చదువుకున్నాం. అయితే ఇప్పుడు ఒక కొత్త రకమైన స్కామ్ వెలుగులోకి వచ్చింది. కొంతమంది ఓలా ఎలక్ట్రిక్‌ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ సృష్టించి వినియోగదారులను భారీగా మోసం చేశారు.

ఈ కొత్త స్కామ్ గుర్తించిన పోలీసులు గాలింపులు జరిపి, దీనికి కారకులైన దాదాపు 20 మందిని దేశవ్యాప్తంగా అరెస్ట్ చేశారు. ఈ స్కామ్ కి పాల్పడిన వారు ఏ రాష్ట్రాలకు చెందినవారు మొదలైన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

ఓలా ఎలక్ట్రిక్ పేరుతో కొత్త రకమైన మోసం

నివేదికల ప్రకారం కొంత మంది ఓలా ఎలక్ట్రిక్ పేరుతో ఆన్లైన్ మోసాలు చేస్తోంది. దీనిని గుర్తించిన ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి ఈ ముఠాను ఎట్టకేలకు పట్టుకున్నారు. ఇందులో 11 మంది బీహార్‌, నలుగురు తెలంగాణ, ముగ్గురు జార్ఖండ్‌, ఇద్దరు కర్ణాటకలోని బెంగళూరుకు చెందినవారిగా గుర్తించారు.

నిజానికి ఈ స్కామ్ చేస్తున్న ముఠా సభ్యులు, ముందుగా ఎవరు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం సర్చ్ చేస్తున్నారో తెలుసుకుంటారు. అంతే కాకూండా కంపెనీ పేరుతో క్రియేట్ చేసిన నకిలీ వెబ్‍సైట్ ని కొంతమంది కస్టమర్లు నిజమైనదే అని నమ్మి కావలసిన వివరాలు ఇస్తారు. అలాంటి వారిని ఈ ముఠా సభ్యులు ఉపయోగించుకోవడం ప్రారంభించారు.

ఒక సారి ఆ నకిలీ వెబ్‍సైట్ లో వివరాలను పొందుపరిచిన తరువాత ఈ ముఠాలోని కొంతమంది సభ్యులు రిజిస్టర్ కోసం రూ. 499 చెల్లించాలంటూ తరచుగా ఫోన్లు చేస్తూ ఉంటారు. రూ. 499 చెల్లించి బుక్ చేసుకున్న తరువాత మీ స్కూటర్ బుక్ చేయబడిందని, మిగిలిన మొత్తం రూ. 60,000 నుంచి రూ. 70,000 పంపితే స్కూటర్ హోమ్ డెలివరీ చేస్తామంటూ నమ్మిస్తారు. ఇది నిజమే అని నమ్మిన చాలామంది కస్టమర్లు మిగిలిన మొత్తం డబ్బును చెల్లిస్తున్నారు. చివరికి వారు తమ స్కూటర్ డెలివరీ పొందలేకపోతున్నారు.

ఈ స్కామ్‍పైన ఒక వ్యక్తి ఢిల్లీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. తాను ఎలా మోసపోయాడో క్లుప్తంగా వివరించాడు. ఇందులో ఆ వ్యక్తి మొదటి ఓలా నకిలీ యాప్ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేశాడు. ఫైనాన్స్ ఆప్షన్ కోసం వెతకటంతో ఆ ప్రాసెస్ కంప్లీట్ కాలేదు. అయితే ఆ రోజు ఆ వ్యక్తికి ఒక కాల్ వచ్చింది.

ఆ ఫోన్ చేసిన వ్యక్తి బుకింగ్ ప్రాసెస్ కోసం ముందుగా రూ. 499 చెల్లించాలని చెప్పాడు. దీని కోసం అతడు 'పేయూ యాప్' (PayU App) లింక్ కూడా పంపించాడు. ఓలా స్కూటర్ కొనుగోలు చేయాలనుకున్న వ్యక్తి ఆ యాప్ ద్వారా రూ. 499 చెల్లించాడు. ఆ మరుసటి రోజు కూడా కాల్ వచ్చింది. అందులో స్కామర్ మీకు నచ్చిన ఫైనాన్స్ ఆప్షన్లు ఉన్నాయని దీని కోసం ముందుగా మీరు రూ. 30,000 చెల్లించాలని చెప్పాడు. ఆ మొత్తం కూడా కస్టమర్ చెలించాడు. మిగిలిన మొతం EMI రూపంలో చెల్లించడానికి ఒప్పుకున్నాడు.

ఆ వ్యక్తి మొదట్లో కట్టిన రో. 30,000 కాకుండా మరో రూ. 72,000 కట్టాలని మెయిల్ ద్వారా సందేశం పొందాడు. ఇది చూసిన కస్టమర్ ఏమిటిదని ప్రశ్నించగా, ఆ మొత్తమ్ కూడా తప్పకుండా కట్టాలని చెప్పాడు. అయితే కస్టమర్ ముందు ప్రాసెస్ మొదలుపెట్టండి, మొత్తం చెల్లిస్తానని చెప్పాడు. స్కూటర్ డిస్పాచ్ చేసేందుకు మరో రూ.13,000 చెల్లించాలని స్కామర్ డిమాండ్ చేశారు. దీనిపైనా అనుమానం రావడంతో పోలీసులకు పిర్యాదు చేసాడు.

ఈ కొత్త రకమైన స్కామ్ మీద పిర్యాదు అందుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి దీనికి కారణమైన దాదాపు 20 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, 38 స్మార్ట్‌ఫోన్లు, 25 ఫీచర్ ఫోన్లు, రెండు హార్డ్ డిస్క్‌లు, రెండు స్మార్ట్ వాచీలు, 114 సిమ్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఈ స్కామ్ లో ఆ ముఠా సభ్యులు రూ. 5 కోట్ల రూపాయల వరకు స్కామ్ చేసినట్లు తెలిసింది. ఈ ముఠా దెబ్బకు దాదాపు 1000 వ్యక్తులు మోసపోయినట్లు పోలీసులు చెబుతున్నారు.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

ఓలా ఎలక్ట్రిక్ తన ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్స్ మరియు విక్రయాలు అన్నీ కూడా మొదటి నుంచి ఆన్‍లైన్ లోనే చేస్తోంది. కంపెనీ మొత్తం ప్రక్రియను ఆన్‍లైన్ లో జరగటం వల్ల ఈ రకమైన ముఠా పుట్టుకొచ్చింది. అలా కాకుండా కంపెనీ ఒక నిర్దిష్టమైన డీలర్షిప్ కలిగి ఉండి డెలివరీ ప్రక్రియను డీలర్షిప్ ద్వారా చేసి ఉన్నట్లయితే ఈ మోసం జరగటానికి అవకాశం ఉండేది కాదు. అయితే కంపెనీ ఇప్పుడు తన ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయాలకు డీలర్షిప్లను మరియు ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభిస్తోంది. కావున ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు మీకు సమీపంలో ఉన్న కంపెనీ డీలర్షిప్ సందర్శించి కొనుగోలు చేసుకోవచ్చు.

Most Read Articles

English summary
Just check out ola electric scooter fake website scam details
Story first published: Wednesday, November 16, 2022, 9:33 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X