శత్రుదేశాల గుండెల్లో గుబులు పుట్టించే మరో ఒప్పందానికి తెరదించిన భారత్-రష్యా

Written By:

రష్యా మరియు భారత్ మధ్య తేలికపాటి మిలిటరీ హెలీకాఫ్టర్ల ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. ఇందుకు సిద్దంగా ఉన్న రష్యా భారత రక్షణ మంత్రిత్వ శాఖ సమాధానం కోసం ఎదురుచూస్తోంది..

రష్యా తేలికపాటి మిలిటరీ హెలికాప్టర్లు

భారత త్రివిధ దళాలకు ఉపయోగపడే కమోవ్ 226టి మిలిటరీ హెలీకాప్టర్లను రానున్న తొమ్మిదేళ్లలో సుమారుగా 200 వరకు సరఫరా చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు దేశీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో రష్యా ప్రతినిధి వెల్లడించారు.

Recommended Video - Watch Now!
Horrifying Footage Of A Cargo Truck Going In Reverse, Without A Driver - DriveSpark
రష్యా తేలికపాటి మిలిటరీ హెలికాప్టర్లు

రక్షణ మంత్రిత్వ శాఖతో జరగనున్న ఈ ఒప్పందం చివరి దశలో ఉంది. డిసెంబర్ మధ్య భాగానికి ఒప్పందం గురించిన నిర్ణయం వెలువడితే, 2018 ఏడాది తొలి త్రైమాసికంలో పూర్తి స్థాయి ఒప్పందానికి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలిపారు.

రష్యా తేలికపాటి మిలిటరీ హెలికాప్టర్లు

రష్యన్ హెలికాఫ్టర్స్‌లో భాగస్వామిగా ఉన్న రోస్టెక్ కార్పోరేషన్ మరియు హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ హెలీకాఫ్టర్లను మరింత అభివృద్ది చేసి, ఉత్పత్తి చేయనున్నాయి. అన్ని కుదిరితే, ఈ Ka-226T మల్టీ రోల్ మిలిటరీ హెలీకాఫ్టర్లను మేకిన్ ఇండియా చొరవతో దేశీయంగానే ఉత్పత్తి చేసి దళాలకు సరఫరా చేయనున్నారు.

రష్యా తేలికపాటి మిలిటరీ హెలికాప్టర్లు

భారత త్రివిధ దళాలలో ఈ తేలికపాటి మిలిటరీ హెలీకాఫ్టర్ల అవసరం ఎంతో ఉంది. ఒప్పందం కుదిరితే విడతల వారీగా హెలీకాఫ్టర్లు సైన్యంలోకి చేరనున్నాయి. ఒకరకంగా ఈ నిర్ణయం భారత్ శత్రు దేశాలకు హెచ్చరిక అని చెప్పువచ్చు. మరియు అత్యాధునిక వాహనాల చేరికతో సైన్యం కూడా బలపడుతుంది.

కమోవ్ 226టి(Ka-226T)గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీ కోసం...

రష్యా తేలికపాటి మిలిటరీ హెలికాప్టర్లు

కమోవ్ 226టి ట్విన్ ఇంజన్ గల తేలికపాటి మిలిటరీ హెలీకాఫ్టర్, కానీ ఇది ఎన్నో అవసరాలకు ఉపయోగపడుతుంది. అందుకే దీనిని మల్టీ రోల్ చాపర్ అంటారు. మిలిటరీ మరియు పౌర అవసరాలకు చక్కగా ఉంటుంది. భారత సైన్యంలో ఉన్న చీతా మరియు చేతక్ హెలీకాఫ్టర్ల స్థానాలను ఇది భర్తీ చేస్తుంది.

రష్యా తేలికపాటి మిలిటరీ హెలికాప్టర్లు

కమోవ్ చాపర్లను తయారు చేసే రష్యన్ హెలీకాఫ్టర్స్ మేరకు, మిలటరీ వెర్షన్ 226టి హెలీకాఫ్టర్ ప్రతికూలమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా పనచేస్తుందని తెలిపింది. ఇది వేడి వాతావరణం, సముద్ర ఉపరితలం మరియు అత్యంత ఎత్తైన పర్వత ప్రాంతాల్లో పనిచేస్తుంది.

రష్యా తేలికపాటి మిలిటరీ హెలికాప్టర్లు

కమోవ్ 226టి హెలీకాఫ్టర్ చాలా తేలికపాటి మల్టీపర్పస్ చాపర్ నిఘా, పర్యవేక్షణ, లక్ష్యాన్ని గుర్తించడం మరియు రవాణా వంటి ఎన్నో అవసరాలకు ఉపయోగపడుతుంది. ఇది ఒక్కోసారి 1,500కిలోల బరువును మోసుకెళ్లగలదు.

రష్యా తేలికపాటి మిలిటరీ హెలికాప్టర్లు

ఈ చాపర్‌లో ఒక్కసారిగా ఏడు మంది పారాట్రూప్ బలగాలను తీసుకెళుతుందని రష్యన్ హెలీకాఫ్టర్స్ పేర్కొంది. ఈ ఒప్పందం కుదిరితే రష్యా భారత్‌కు 200 కమోవ్ మిలిటరీ హెలీకాఫ్టర్లను సరఫరా చేయనుంది.

రష్యా తేలికపాటి మిలిటరీ హెలికాప్టర్లు

కమోవ్ 226టి హెలీకాఫ్టర్ గరిష్టంగా గంటకు 250కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది గరిష్టంగా 3,600కిలోల బరువు వరకు టేకాఫ్ తీసుకుంటుంది. 2హెచ్అరియస్ 2జి1 మరియు టుర్బోమెకా ఇంజన్‌ల మీద నడుస్తుంది.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Kamov 226T: 5 facts about the light multi-purpose Russian military helicopters for India
Story first published: Saturday, December 23, 2017, 18:45 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark