ఎర్ర బుగ్గను తొలగించకుండా కేంద్రానికి సవాల్ విసురుతున్న కర్ణాటక మంత్రి

Written By:

వీఐపీ సంస్కృతికి స్వస్తి పలుకుతూ కార్ల మీద హోదాను సూచించే ఎర్ర బుగ్గల వాడకాన్ని మోడీ ప్రభుత్వం నిషేధించింది. మనమంతా సాధారణ ప్రజలతో సమానం అనే భావనను తెలియజేసే ఈ నిర్ణయాన్ని దాదాపు అన్ని రాష్ట్రాల వీఐపీలు స్వాగతించారు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
కారు మీద ఎర్రబుగ్గను తొలగించడాన్ని తిరస్కరిస్తున్న మంత్రి

అత్యవసర వాహనాలకు వాహనాలకు వాడుతున్న నీలం రంగు బుగ్గలను యథావిధిగా ఉంచి, అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ప్రధాన అధికారులు మరియు రాజకీయ నాయకుల కార్లపై ఉండే ఎర్ర బుగ్గలను తొలగించాలని కేంద్ర ఆదేశించింది.

కారు మీద ఎర్రబుగ్గను తొలగించడాన్ని తిరస్కరిస్తున్న మంత్రి

అయితే కొంత మంది ఎర్ర బుగ్గలను తొలగించడానికి అయిష్టతను చూపగా, మరికొంత మంది వీటిని తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నారు.

కారు మీద ఎర్రబుగ్గను తొలగించడాన్ని తిరస్కరిస్తున్న మంత్రి

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రారంభంలో తన కారు మీద ఉన్న ఎర్ర బుగ్గను తొలగించడానికి అయిష్టత చూపారు, ఇప్పుడు కర్ణాటకకు చెందిన ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి యుటి ఖాదర్ ఎర్ర బుగ్గను తొలగించడానికి ఆసక్తి చూపడం లేదు.

కారు మీద ఎర్రబుగ్గను తొలగించడాన్ని తిరస్కరిస్తున్న మంత్రి

ఈ విషయం గురించి యుటి ఖాదర్ మాట్లాడుతూ, ముఖ్య మంత్రి కోరితే తన కారు మీద ఉన్న ఎర్ర బుగ్గను తొలగిస్తాను, అంత వరకు తొలగించనని పేర్కొన్నాడు.

కారు మీద ఎర్రబుగ్గను తొలగించడాన్ని తిరస్కరిస్తున్న మంత్రి

ముఖ్య మంత్రి గారు స్వయంగా నా కారు మీద ఉన్న ఎర్ర బుగ్గను తొలగించమని కోరితే అతని ఆదేశాలకు విధేయతగా దానిని తీసేస్తానని చెప్పుకొచ్చాడు. ఈ కారును నాకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది, కాబట్టి ఇందులో ఎలాంటి మార్పులు చేసే హక్కు నాకు లేదని తెలిపాడు.

కారు మీద ఎర్రబుగ్గను తొలగించడాన్ని తిరస్కరిస్తున్న మంత్రి

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి స్పందిస్తూ, సాధారణ ప్రజలను వీఐపి స్థాయికి తీసుకొచ్చేందుకు వీఐపీ సంస్కృతిని రూపుమాపుతోందని తెలిపాడు.

కారు మీద ఎర్రబుగ్గను తొలగించడాన్ని తిరస్కరిస్తున్న మంత్రి

ఎర్ర బుగ్గ మా కారు మీద ఉందని నేను ఎక్కడికీ ప్రయాణం చేయలేదు, నేను ఎక్కడికైనా వెళ్లడానికి ప్రభుత్వం కారు ఇచ్చింది కాబట్టి అదే కారులో ప్రయాణిస్తున్నాని వివరణ కూడా ఇచ్చాడు ఈ కర్ణాటక మంత్రి.

కారు మీద ఎర్రబుగ్గను తొలగించడాన్ని తిరస్కరిస్తున్న మంత్రి

ఎర్ర బుగ్గలను తొలగించడానికి నేను అడ్డు చెప్పడం లేదు, అయితే ఇలాంటి నిర్ణయం తీసుకునే బదులు ప్రజల ఆకలి తీర్చే మరియు ఉచిత విద్యను అందించే పథకాల మీద దృష్టిసారిస్తే బాగుండేదని హితవు పలికాడు.

కారు మీద ఎర్రబుగ్గను తొలగించడాన్ని తిరస్కరిస్తున్న మంత్రి

డ్రైవ్‌స్పార్క్ తెలుగు ఆలోచన! వీఐపీ సాంప్రదాయానికి ముగింపు పలికే నిర్ణయం తీసుకోవడం చాలా మంచిదే. దీని వలన ప్రజల మద్య అసమానతలు తగ్గుముఖం పడతాయి. అయితే ఇలాంటి నిర్ణయాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాల్సి ఉంటుంది. దేశీయంగా రాజకీయ నాయకులు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటున్నంత వరకు భారత్ కోరుకేనే విజయం సాధించడం కాస్త కష్టమే.

English summary
Read In Telugu Food and Civil Supplies Minister UT Khader Refuses To Remove Red Beacon From His Car
Story first published: Friday, May 5, 2017, 15:45 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark