Just In
Don't Miss
- Movies
దీప్తి సునయన అలాంటిది కాదు.. నోయల్ సెన్సేషనల్ కామెంట్స్
- News
అమానవీయం : దళిత జంటకు ఆలయ ప్రవేశం నిరాకరణ.. రూ.2.5లక్షలు జరిమానా...
- Finance
Budget 2021: 10 ఏళ్లలో బడ్జెట్‌కు ముందు సూచీలు ఇలా, ఇన్వెస్టర్లకు హెచ్చరిక!
- Sports
చరిత్ర సృష్టించిన భారత్.. బ్రిస్బేన్ టెస్టులో ఘన విజయం!! టెస్ట్ సిరీస్ టీమిండియాదే!
- Lifestyle
మీరు వాడే షాంపూ మంచిది కాకపోతే మీ జుట్టు ఏమి సూచిస్తుంది, తప్పకుండా తెలుసుకోండి..
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మీకు తెలుసా.. పిల్లల్ని బైక్ పెట్రోల్ ట్యాంకుపై తీసుకెళ్లటాన్ని నిషేధం
బాగా అభివృద్ధి చెందిన దేశాలలో ట్రాఫిక్ సమస్య సర్వసాధారణం. ఈ ట్రాఫిక్ సమస్య భారతదేశంలో మరీ ఎక్కువగా ఉంది. వాహనదారులు నిత్యం ట్రాఫిక్ సమస్యను ఎదుర్కోవలసి వస్తుంది. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటం వల్ల వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం సర్వసాధారణం. ఈ విధంగా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు ఎదురవుతున్నాయి.

ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల జరిగే ప్రమాదాలు కొత్త గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఈ కారణంగా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రమాదాలను నివారించడానికి కొత్త నియమాలను రూపొందిస్తోంది. ఇప్పుడు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన వాహనదారులను తగ్గించే నోటిఫికేషన్ విడుదల చేసింది.

పిల్లలను ప్రమాదాల నుండి రక్షించడానికి హోం శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వ్యుల ప్రకారం, పిల్లలు బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్ మీద మరియు స్కూటర్ల ముందు కూర్చోవడం లేదా నిలబడటం శిక్షార్హమైన నేరం.

పిల్లలను ఈ విధంగా బైక్‌లపై తీసుకురావడం సురక్షితం కాదు. పిల్లలు ద్విచక్ర వాహనం ముందు కూర్చోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

పిల్లలను బైక్ పెట్రోల్ ట్యాంకులపై ఉంచడం వారిని మరింత ప్రమాదంలో పడేస్తుంది. స్కూటర్ ముందు భాగం కూడా ప్రమాదకరం. అంతే కాకుండా పిల్లలను పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చోబెట్టి వాహనాన్ని నియంత్రించడం కూడా కష్టతరమైన పని.

వాహనాలు సరైన అదుపులో లేకుంటే అది పిల్లల యొక్క మరణానికి కారణం అవుతుంది. ఇది మరొకరికి బాధ కలిగిస్తుంది. దీనిని నివారించడానికి కేరళ ప్రభుత్వం ఈ రకమైన ఉత్తర్వులు జారీ చేసింది.

పిల్లలు పెట్రోల్ ట్యాంక్ మీద కూర్చున్నప్పుడు లేదా నిలబడి ఉన్నప్పుడు చాలా ప్రమాదాలు సంభవిస్తాయి. కొన్నేళ్ల క్రితం చెన్నైలో జరిగిన సంఘటన దీనికి నిదర్శనం. ఈ సంఘటనలో 5 సంవత్సరాల బాలుడు తన తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయడానికి ద్విచక్ర వాహనంలో అదే ప్రాంతంలోని ఒక హోటల్‌కు వెళ్లాడు.

రాత్రి భోజనం తరువాత, అతను తన తండ్రి మరియు తల్లితో కలిసి అదే ద్విచక్ర వాహనంలో ఇంటికి తిరిగి వచ్చాడు. బాలుడు బైక్ యొక్క పెట్రోల్ ట్యాంక్ మీద నిలబడి ఉన్నాడు. బైక్ పెరంబర్ వంతెన వద్దకు చేరుకోగానే అకస్మాత్తుగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆ బాలుడు చనిపోయాడు. పిల్లలు ద్విచక్ర వాహనాల ముందు కూర్చున్నప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి.

అంతే కాకుండా కొన్ని సందర్భాలలో పిల్లలను ముందు కోర్చోబెట్టుకోవడం వల్ల వాహనాన్ని సమతుల్యత చేయలేము. ఆ సమయంలో ప్రమాదాలు జరుగుతాయి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కేరళ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది.
గమనిక: ఈ చిత్రాలు కేవలం సూచన కోసం మాత్రమే