మీ కెటిఎమ్ డ్యూక్‌ని కూడా ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాలనుకుంటున్నారా..? అయితే ఎలానో చూడండి!

కెటిఎమ్ (KTM) బైక్ లంటే ఇష్టపడని యువత ఉండకపోవచ్చేమో. ఆస్ట్రియన్ స్పోర్ట్స్ బైక్ కంపెనీ కెటిఎమ్ భారతదేశంలో అతికొద్ది సమయంలోనే మంచి పాపులరాటీని దక్కించుకుంది. విభిన్న విభాగాలలో మరియు వివిధ ధరల రేంజ్ లో స్పోర్టీ లుకింగ్ మోటార్‌సైకిళ్లను అందిస్తోంది కెటిఎమ్. కానీ, ఈ పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిళ్లు మైలేజ్ విషయంలో అంత మెరుగ్గా ఉండవు. ప్రస్తుతం, పెరుగుతున్న పెట్రోల్ ధరల నేపథ్యంలో, ఇలాంటి తక్కువ మైలేజీనిచ్చే మోటార్‌సైకిళ్లను మెయింటైన్ చేయడం చాలా కష్టం.

మీ కెటిఎమ్ డ్యూక్‌ని కూడా ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాలనుకుంటున్నారా..? అయితే ఎలానో చూడండి!

అందుకే, ఓ ఔత్సాహికుడు తన కెటిఎమ్ డ్యూక్ 200 మోటార్‌సైకిల్ లో పెట్రోల్ ఇంజన్ ను తొలగించి, దాని స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్ కిట్ ను అమర్చుకున్నాడు. బైక్‌లో చిన్నపాటి మార్పులు చేర్పులు చేసి, ఆఫ్టర్ మార్కెట్ ఎలక్ట్రిక్ కిట్ సాయంతో డ్యూక్ బైక్ ని పూర్తిగా ఎలక్ట్రిక్ గా మార్చేశాడు. ఆ వివరాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మీ కెటిఎమ్ డ్యూక్‌ని కూడా ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాలనుకుంటున్నారా..? అయితే ఎలానో చూడండి!

ఇటీవలి కాలంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు చాలా వేగంగా మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో, అనేక కొత్త ఈవీ (ఎలక్ట్రిక్ వాహన) కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను (మరీ ముఖ్యంగా ద్విచక్ర వాహన విభాగంలో) మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. అయితే, ఎలక్ట్రిక్ టూవీలర్ల విషయంలో ప్రస్తుతం అధిక పనితీరు గల ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్లు ఇంకా పూర్తిగా అందుబాటులోకి రాలేదు. కొన్ని రకాల ఎలక్ట్రిక్ బైకులు మార్కెట్లో ఉన్నప్పటికీ, ఇవి స్పోర్ట్స్ బైక్ ప్రియులను ఆకర్షించలేకపోతున్నాయి.

మీ కెటిఎమ్ డ్యూక్‌ని కూడా ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాలనుకుంటున్నారా..? అయితే ఎలానో చూడండి!

కాబట్టి, యూపీకి చెందిన ఓ బైక్ లవర్ తన కెటిఎమ్ డ్యూక్ ను హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ బైక్‌ గా మార్చుకున్నాడు. ఈ వీడియోలో తెలిపిన సమాచారం ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ కెటిఎమ్ డ్యూక్ 200 బైక్ గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అయితే, ఇందులో రైడర్ గరిష్టంగా గంటకు 121 కిలోమీటర్ల వేగాన్ని అందుకోవడాన్ని చూడొచ్చు. ఈ బైక్‌లోని కెటిఎమ్ డ్యూక్ పెట్రోల్ ఇంజన్‌ను తొలగించి దాని స్థానంలో శక్తివంతమైన 4,000 వాట్ల ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు.

మీ కెటిఎమ్ డ్యూక్‌ని కూడా ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాలనుకుంటున్నారా..? అయితే ఎలానో చూడండి!

ఎలక్ట్రిఫైడ్ కెటిఎమ్ డ్యూక్ 200 బ్యాటరీ ప్యాక్ ను అమర్చడం కోసం దీని ఫ్రేమ్ లో ఇంజన్ భాగం వద్ద చిన్నపాటి మార్పులు చేశారు. బ్యాటరీ ప్యాక్ కోసం ఇంజన్ స్థానంలో ఇనుప బాక్సును ఇన్‌స్టాల్ చేశారు. అలాగే ఫ్యూయెల్ ట్యాంక్ ను క్రింది భాగాన్ని కట్ చేసి, అందులో కీలకమైన ఎలక్ట్రికల్ పరికరాలను అమర్చారు. అంతేకాకుండా, సీట్ క్రింది భాగం మరియు ఫ్రేమ్ మధ్య భాగంలో కూడా ఎలక్ట్రిక్ పరికరాల అమరిక కోసం చిన్న చిన్న మార్పులు చేశారు.

ఈ మోడిఫికేషన్ ప్రక్రియలో హై-స్పీడ్ మోటార్, హెవీ గేజ్ వైర్లు, బ్రేకర్ సర్క్యూట్లు, ఎగ్జాస్ట్ సౌండ్ కోసం స్పీకర్లు, కన్వర్షెన్ కిట్లు, కస్టమ్ మేడ్ బ్యాటరీ ప్యాక్ లు, మొబైల్ అప్లికేషన్ కోసం హార్డ్‌వేర్ సెటప్ వంటివి ఇందులో చాలానే ఇన్‌స్టాల్ చేశారు. స్టాండర్డ్ పెట్రోల్ వెర్షన్ కెటిఎమ్ డ్యూక్ 200 బైక్ ను పూర్తిగా ఎలక్ట్రిక్ డ్యూక్ గా మార్చిన తర్వాత, రైడర్ తన స్మార్ట్ ఫోన్ లో జిపిఎస్ యాప్ ద్వారా ఈ మోటార్‌సైకిల్ యొక్క పనితీరును చెక్ చేసి, చూపిస్తాడు.

మీ కెటిఎమ్ డ్యూక్‌ని కూడా ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాలనుకుంటున్నారా..? అయితే ఎలానో చూడండి!

ఫోన్ స్క్రీన్‌పై కనిపించిన రీడింగ్‌ల ప్రకారం, ఈ మోటార్‌సైకిల్ గరిష్టంగా గంటకు 121 కి.మీ వేగంతో ప్రయాణించినట్లుగా తెలుస్తుంది. స్పీడోమీటర్‌లో ఈ మోటార్‌సైకిల్ గరిష్టంగా గంటకు 140 కిమీ వేగంతో దూసుకుపోగలదని కూడా చూపబడుతుంది. ఇందులో వివిధ రైడ్ మోడ్‌లు కూడా ఉన్నాయి, ఇవి ఎలక్ట్రిక్ మోటార్ యొక్క పవర్ డెలివరీని మార్చడానికి అమర్చబడ్డాయి. ఇక బ్యాటరీ ప్యాక్ రేంజ్ విషయానికి వస్తే, ఇది ఎకో మోడ్‌లో, పూర్తి ఛార్జ్‌పై గరిష్టంగా 130 కి.మీల రేంజ్ అందిస్తుందని చెప్పబడింది.

మీ కెటిఎమ్ డ్యూక్‌ని కూడా ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాలనుకుంటున్నారా..? అయితే ఎలానో చూడండి!

అయితే, దీనిని స్పోర్ట్స్ మోడ్ లో రైడ్ చేసినట్లయితే, మోటార్‌సైకిల్ పవర్ అవుట్‌పుట్‌ పెరగడం కారణంగా రేంజ్ భారీగా తగ్గిపోతుంది. ఈ ఎలక్ట్రిక్ డ్యూక్ మోటార్‌సైకిల్ స్పోర్ట్స్ మోడ్‌లో కేవలం 80 కిలోమీటర్ల రేంజ్ ను మాత్రమే అందిస్తుంది. కాగా, స్టాండర్డ్ డ్యూక్ ని ఎలక్ట్రిక్ డ్యూక్ గా మార్చడానికి అయిన కన్వెర్షన్ కిట్ ఖర్చు మరియు దాని లభ్యత వంటి వివరాలను ఈ వీడియోలో తెలియజేయలేదు.

మీ కెటిఎమ్ డ్యూక్‌ని కూడా ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాలనుకుంటున్నారా..? అయితే ఎలానో చూడండి!

భారతదేశంలో EV కన్వర్షన్ కిట్‌లకు పెరుగుతున్న ప్రజాదరణ

నేరుగా ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయలేని వారి కోసం మరియు తమ పాత పెట్రోల్ వాహనాన్ని పూర్తి ఎలక్ట్రిక్ వాహనంగా మార్చుకోవాలనుకునే వారి కోసం ప్రస్తుతం వివిధ రకాల ఈవీ కన్వర్షన్ కిట్‌లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో వస్తున్నాయి. నిజానికి భారత ప్రభుత్వం పాత నాలుగు చక్రాల వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే కిట్‌కు ఆమోదం కూడా తెలిపింది. అయితే, ద్విచక్ర వాహన మార్కెట్‌ కోసం ఇంకా ARAI సర్టిఫైడ్ కిట్ ఏదీ లేదు.

మీ కెటిఎమ్ డ్యూక్‌ని కూడా ఎలక్ట్రిక్ బైక్‌గా మార్చాలనుకుంటున్నారా..? అయితే ఎలానో చూడండి!

గతంలో కూడా హోండా యాక్టివా వంటి పాపులర్ స్కూటర్‌లను ఎలక్ట్రిక్ స్కూటర్లుగా మార్చిన సందర్భాలను మనం చూశాం. ఇలా పాత వాహనాలను ఈవీలుగా మార్చుకోవడం పాకెట్ ఫ్రెండ్లీగా ఉన్నప్పటికీ, ఇలా మోడిఫై చేసిన ఎలక్ట్రిక్ వాహనాలను రోడ్లపై నడపడం చట్ట ప్రకారం నేరంగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా, అనుమతి లేని ఎలక్ట్రిక్ వాహన కిట్ లను ఉపయోగించడం వలన కొన్ని అనుకోని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది.

Most Read Articles

English summary
Ktm duke 200 motorcycle turned into high performance electric bike with ev conversion kit details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X