ఎకో ఫ్రెండ్లీ కార్లను మాత్రమే కలిగి ఉన్న టైటానిక్ హీరో లియోనార్డో డికాప్రియో

By Anil

టైటానిక్ సినిమాలో ఏకైక ఆకర్షణగా నిలిచింది హీరో, హీరోయిన్‌ల ప్రేమ కథ. ఈ కథకు ఇందులోని హీరో పాత్రకు సరైన న్యాయం చేశాడు లియోనార్డో డికాప్రియో. ఆద్యంతం అత్బుతమైన మలుపులు తిప్పే కథతో ప్రేక్షలకు ఎంతో దగ్గరయ్యాడు లియో. ఇతని నటన మరియు ముఖ పోలికలు ఎంతో అచ్చంగా కుదిరాయి అని చెప్పవచ్చు. మొత్తం మీద లియో ఒక గొప్ప కథానాయకుడు అని చెప్పవచ్చు. అందుకే మరి లియో 20 ఏళ్ల తరువాత ఆస్కార్ అవార్డుకు ఎంపిక అయ్యాడు.

తెర ముందు మాత్రమే కాదు నిజ జీవితంలో కూడా ఇతను రియల్ హీరో అని చెప్పవచ్చు. డబ్బుందనే గర్వానికి, ప్రపంచ వ్యాప్తంగా మంచి పేరున్న కథాయకుడు అనే వాటికి లియో చాలా దూరం. ఎందుకంటే ఏ ప్రముఖ వ్యక్తి కూడా చేయని సాధారణ పనులు ఇతను చేస్తుంటాడు. అందులో పర్యావరణాన్ని కాపాడటానికి కేవలం హైబ్రిడ్ మరియు పర్యావరణ హితమైన కార్లను మాత్రమే వినియోగిస్తున్నాడు. ఈ ఆధునిక ప్రపంచంలో ఇలాంటి వారు ఉంటారా...? పర్యావరణాన్ని కాపాడటంలో తన వంతు ప్రయత్నం అంటాడు ఈ నాయకుడు.

ఇలాంటి కథానాయకుడు గురించి ఆసక్తికరమైన విషయాలు, ఇతని పర్యావరణహితమైన హైబ్రిడ్ కార్లు, ఇతని లక్ష్యం గురించి క్రింది శీర్షిక ద్వారా తెలుసుకుందాం రండి.

టెస్లా రోడ్‌స్టర్

టెస్లా రోడ్‌స్టర్

టెస్లా మోటార్స్ గ్రీన్ కార్ల తయారీకి ప్రసిద్దిగాంచిందని చెప్పవచ్చు. 2003 ప్రారంభమై ఈ ఏడాదితో 13 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. టెస్లా విడుదల చేసిన మొదటి రెండు సీట్ల రోడ్‌స్టర్ కారును లిమిటెడ్ ఎడిషన్‌గా ఉత్పత్తి చేసినపుడు 2,500 యూనిట్ల అమ్మకాలు చేపట్టారు.

ఎలక్ట్రిక్ మోటార్లు మాత్రమే

ఎలక్ట్రిక్ మోటార్లు మాత్రమే

టెస్లా మెటార్స్ వారు అందుబాటులో ఉంచిన రోడ్‌స్టర్ కార్లు అన్ని కూడా ఎలక్ట్రిక్ మోటార్ల ద్వారానే నడుస్తాయి.

లియోనార్డో రోడ్‌స్టర్ కారు

లియోనార్డో రోడ్‌స్టర్ కారు

ప్రస్తుతం లియో దగ్గర గల రోడ్‌స్టర్‌లో 53 కిలోవాట్అవర్ గల లిథియమ్-అయాన్ బ్యాటరీని అందించారు. ఇది కేవలం 5.7 సెకండ్ల సమయంలో గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు అత్యధికంగా 97 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు కేవలం రెండు డోర్లను మాత్రమే కలిగి ఉంటుంది.

లియోనార్డో ప్రియస్

లియోనార్డో ప్రియస్

టైటానిక్ హీరోకు హైబ్రిడ్ కార్లు అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే ఇవి తక్కువ కాలుష్య కారకాలను వెదజల్లుతాయి. అందుకోసం ఇతను కేవలం హైబ్రిడ్ కార్లను మాత్రమే కొనుగోలు చేశాడు అందులో ప్రియస్ కారు ఒకటి. ప్రస్తుతం లియో దగ్గర ఉన్న ప్రియస్ కారు 4.7లీటర్లకు 100 కిలోమీటర్ల మైలేజ్‌ని ఇస్తుంది. ఇందులో 1.8-లీటర్ గ్యాసోలీన్ ఇంజన్ కలదు.

టయోటా ప్రియస్

టయోటా ప్రియస్

ప్రపంచ వ్యాప్తంగా గ్యాసోలీన్‌తో వచ్చిన మొదటి కారు ప్రియస్ 1997 లో దీనిని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేశారు. ఆ తరువాత ఇదే పేరు మీద 2003, 2009 మరియు 2015 ఇలా తమ శ్రేణి కార్లను విడుదల చేస్తూ వచ్చింది టయోటా. అయితే ప్రస్తుతం అమెరికాలో అత్యధికంగా అమ్ముడు పోతున్న మైలేజ్ కార్లలో ఇది మొదటి స్థానంలో ఉంది. దాదాపుగా 70 పైచిలుకు దేశాలలో ఈ టయోటా ప్రియస్ కారు అందుబాటులో కలదు.

 టయోటా ప్రియస్ సాంకేతిక వివరాలు

టయోటా ప్రియస్ సాంకేతిక వివరాలు

  • మొదటితరం ప్రియస్(XW10) కారులో 1.5-లీటర్ గ్యాసోలిన్ ఇంజన్ మరియు 288 వోల్ట్స్ గల మోటార్ కలదు.
  • రెండవతరం ప్రియస్ (XW20) కారులో 1.5-లీటర్ గ్యాసోలీన్ ఇంజన్‌కు 500 వోల్ట్స్ గల ఎలక్ట్రిక్ మోటార్‌ను అనుసంధానించారు.
  • మూడవతరం(WX30)ప్రియస్ కారులో 1.8-లీటర్ గ్యాసోలీన్ ఇంజన్‌తో రెండు ఎలక్ట్రిక్ మోటార్ ఆఫ్షన్లలో అందించారు.
  • ఫిస్కర్ కర్మా హైబ్రిడ్

    ఫిస్కర్ కర్మా హైబ్రిడ్

    ఫిస్కర్ కర్మా మొదటి సారిగా 2008 డెట్రాయిట్ లో నార్త్ అమెరికా అంతర్జాతీయ ఆటో షో లో దీని మొదటి ఉత్పత్తిని ప్రదర్శించారు అప్పట్లో ఫిస్కర్ వారి కర్మా కారును 220,000 అమెరికా డాలర్లకు విక్రయించారు.

    ఫిస్కర్ కర్మా

    ఫిస్కర్ కర్మా

    ఫిస్కర్ కర్మా హైబ్రిడ్ కారులో 120 కిలోవాట్అవర్ గల ఎలక్ట్రిక్ మోటార్ కలదు. ఇది 20.1కెడబ్ల్యూ‌హెచ్ లిథియం-అయాన్‌ బ్యాటరీతో అనుసంధానమై ఉంటుంది.

    లియోకు చెందిన ఫిస్కర్ కర్మా హైబ్రిడ్

    లియోకు చెందిన ఫిస్కర్ కర్మా హైబ్రిడ్

    లియోకు చెందిన ఫిస్కర్ కర్మా హైబ్రిడ్ కారు కేవలం ఆరు సెకండ్లలో 0 నుండి 60 మైళ్ల వేగంతో మరియు అత్యంధికంగా గంటకు 125 మైళ్ల వేగంతో పరుగులు పెడుతుంది. ఈ స్పోర్ట్స్ హైబ్రిడ్ కారుకు వీల్ బేస్ భారీ స్థాయిలో ఉంటుంది. అందుకే కాబోలు ఇంత వేగాన్ని చేరుకుంటోంది.

    బిఎమ్‌డబ్ల్యూ హైడ్రోజన్7

    బిఎమ్‌డబ్ల్యూ హైడ్రోజన్7

    లియోనార్డో డికాప్రియా వద్ద గల బిఎమ్‌డబ్ల్యూ హైడ్రోజన్ కారుకు కూడా కొంచెం చరిత్ర ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మొదటి ప్రొడక్షన్ రెడి హైడ్రోజన్ కారు ఇదే. బిఎమ్‌డబ్ల్యూ వీటిని కేవలం 100 సంఖ్యలో మాత్రమే తయారు చేశారు అందులో ఒకటి లియో జాబితాలో ఉంది.

    బిఎమ్‌డబ్ల్యూ హైడ్రోజన్7 సాంకేతిక వివరాలు

    బిఎమ్‌డబ్ల్యూ హైడ్రోజన్7 సాంకేతిక వివరాలు

    బిఎమ్‌డబ్ల్యూ హైడ్రోజన్ కారులో 6.0-లీటర్ గల వి12 ఇంజన్ కలదు ఇది గ్యాసోలీన్ మరియు హైడ్రోజన్‌ రెండింటిని కూడా ఇంధనంగా వినియోగించుకుంటుంది.

    బిఎమ్‌డబ్ల్యూ హైడ్రోజన్7 వేగం

    బిఎమ్‌డబ్ల్యూ హైడ్రోజన్7 వేగం

    ఈ బిఎమ్‌డబ్ల్యూ హైడ్రోజన్7 కారు కేవలం 9.5 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. మరియు 8 కిలోల సామర్థ్యం గల ఇంధన ట్యాంకుని పూర్తిగా నింపితే 201 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు.

    వోక్స్‌వ్యాగన్ ఎమి‌షన్ ‌కుంభ కోణం

    వోక్స్‌వ్యాగన్ ఎమి‌షన్ ‌కుంభ కోణం

    ప్రకృతి ప్రేమికుడైన్ లియోనార్డో డికాప్రియో వోక్స్‌వ్యాగన్ వారి కాలుష్య కుంభకోణం గురించి తెలిసినప్పుడు దానికి వ్యతిరేకంగా సినిమా తీస్తానని డికాప్రియో తెలిపాడు. వోక్స్‌వ్యాగన్ ఎమిషన్ కుంభకోణం ద్వారా ఎన్నో కార్లు విపరీతమైన కాలుష్యాన్ని కలిగించే వాయువులను గాలిలోకి విడుదల అవుతోంది కుంభకోణం ద్వారా బయటపడింది.

    లియోనార్డో ఫౌండేషన్

    లియోనార్డో ఫౌండేషన్

    ప్రకృతిని ప్రేమించే వారికి సహాయన్ని అందిస్తు కాలుష్య నివారణకు టైటానిక్ హీరో తన పేరు మీద ఫౌండేషన్‌ను స్థాపించాడు. అంతే కాకుండా న్యాచురల్ రిసోర్సెస్ డిఫెన్స్ కౌన్సిల్ అండ్ గ్లోబల్ గ్రీన్ యుఎస్‌ఎ లో బోర్డ్ మెంబర్‌గా ఉన్నాడు.

    ఆస్కార్ విజేత

    ఆస్కార్ విజేత

    ఇతను మన రాజకీయ మరియు సినీ వ్యక్తులాంటి వాడు కాదు. ప్రపంచ పర్యాపరణ పరిక్షణలో పాటుపటుతున్న నెం.1 హీరో ఇతను. ఇతనిని ఈ ఏడాది ఆస్కార్ వరించింది.

     మరిన్ని ఆసక్తికరమైన విషయాలకు....
    • టైటానిక్ షిప్ మరియు టైటానిక్ సినిమా మధ్య గల ఆసక్తికరమైన విషయాలు...!!
    • పైలట్ మరియు విమాన సిబ్బంది చేసే 20 చీకటి పనులు
    • 170 సంవత్సరాల ఇండియన్ రైల్వే చరిత్రలో :49 ఆసక్తికరమైన నిజాలు

Most Read Articles

English summary
Actor Leonardo Dicaprio's Environment Friendly Car Collection
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X