దేశరక్షణ కోసం ఇండియన్ మిలిటరీలో ఉన్న శక్తవంతమైన యుద్ద వాహనాలు

ఇండియా, ఈ దేశం వివిధ మతాలకు, భాషలకు, సాంప్రదాయాలకు నెలవు. ప్రపంచంలో మరే దేశానికి సాధ్యం కాని విధంగా జాతి,కుల,మత మరియు ప్రాంతాలకు అతీతంగా ప్రజలంతా సమైక్యంగా కలిసి జీవించే స్వేచ్ఛను కలిగి ఉన్న ఏకైక దేశం. అయితే ఈ దేశాన్ని అంతం చేయాలని, దీని పతనం ఎప్పుడెప్పుడా అని పొరుగు దేశాలు పొంచి ఉన్నాయి.

కాని ఇండియన్ ఆర్మీ కొన్ని తరాల నుండి శత్రుదేశ దాడులను తిప్పి కొడుతూ దేశ సమైక్యతను కాపాడుతూ వచ్చింది. దేశ ప్రజల రక్షణ కోసం సరిహద్దుల్లో తుపాకీ గుళ్ల చప్పుళ్ల మధ్య అమర జవానుల త్యాగాలు ప్రతి రోజు వార్తల్లో ప్రతిభింబిస్తూనే ఉన్నాయి. అయితే ఇండియన్ ఆర్మీలో అన్ని విధాలుగా సైన్యానికి ఉపయోగపడే దాదాపుగా 45 సాయుధ వాహనాలు ఆర్మీ జవానుల జీవితంలో నిత్యమైపోయాయి. ఇండియన్ ఆర్మీకి వెన్నెముకగా నిలిచిన 45 సాయుధ వాహనాల గురించి ప్రత్యేక కథనం క్రింది స్లైడర్ల ద్వారా....

1. అర్జున్ ఎమ్‌బిటి

1. అర్జున్ ఎమ్‌బిటి

ఇది భారత దేశం సైన్యంలో ఉన్న అతి ముఖ్యమైన ఏకైక యుద్ద ట్యాంకు, దీనిని కాంబాట్ వెహికల్ రీసెర్చ్ మరియు డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ (CRVDE) వారు అభివృద్ది చేశారు. ఇందులో 120 ఎమ్ఎమ్ మెయిన్ రీఫిల్డ్ గన్ కలదు, మరియు ఇందులో నలుగురు సైనికులు ప్రయాణించవచ్చు.

picture credit:moddb

2. టి-90 ఎమ్ భీష్మ మరియు టి-90 ఎమ్

2. టి-90 ఎమ్ భీష్మ మరియు టి-90 ఎమ్

ఈ రెండు యుద్ద ట్యాంకులు ట్యాంకులు కూడా 125 ఎమ్ఎమ్ చుట్టు కొలత గల 2ఎ46 స్మూత్ బోర్ గల ట్యాంక్ గన్‌ను కలిగి ఉంది. మరియు టి-90 ట్యాంకును 700 కిలోమీటర్ల పాటు నిరంతరాయంగా నడపవచ్చు.

picture credit: wikimedia

3.టి-72 అజేయ

3.టి-72 అజేయ

దీనిని పశ్చిమ చెన్నైకి 23 కిలోమీటర్లు దూరంలో ఉన్న అవాడిలోని సాయుధ వాహనాల తయారీ కేంద్రంలో తయారు చేశారు. ఇక్కడ డిఆర్‌డిఓ వారి పరిజ్ఞానంతో యుద్ద ట్యాంకులను గరిష్ట స్థాయిలో పేళుల్లను సృష్టించే విధంగా మరియు ఇతర ఫీచర్లను ఇందులో కల్పిస్తారు.

picture credit: defenceforumindia

4. బిఎమ్‌పి-2 సారథ్

4. బిఎమ్‌పి-2 సారథ్

ఈ బిఎమ్‌పి-2 యుద్ద ట్యాంకులను మెదక్ లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. ప్రస్తుతం 900 కన్నా ఎక్కువ సంఖ్యలో ఈ బిఎమ్‌పి-2 సారథ్ యుద్ద ట్యాంకులు సైన్యంలో సేవలు అందిస్తున్నాయి.

picture credit: defenceforumindia

5. బిటిఆర్-50

5. బిటిఆర్-50

ఇది ఆంపిబియస్ వ్యక్తిగత ప్రయాణ యుద్ద సాధనం. ఇది యుద్దంలో సైన్యానికి కావాల్సిన ఆయుధాలను సరఫరా చేయడానికి ఉపయోగపడుతుంది.

picture credit: wikipedia

6. NAMCIA

6. NAMCIA

NAMCIA లేదా నాగ్ మిస్సైల్ క్యారీరర్ అంటారు. ఇది యుద్దలో శత్రు సైన్యం యొక్క యుద్ద ట్యాంకులను నాశనం చేయగలదు, అందకోసం ఇందులో 12 మిస్సైల్స్ కలవు. అయితే వీటిలో 8 మిస్సైల్స్ ఏ సమయంలోనైనా వినియోగించేందుకు సిద్దంగా ఉంటాయి.

picture credit: defencyclopedia

7. CMAT (క్యారీయర్ మోర్టార్ ట్రాక్డ్)

7. CMAT (క్యారీయర్ మోర్టార్ ట్రాక్డ్)

ఇందులో స్వయం చోధకంగా ఫిరంగులను ప్రయోగించే శక్తి గల వ్యవస్థను కలగి ఉంది. దీనిని కాంబాట్ వెహికల్స్ రీసెర్చ్ మరియు డెలవప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ వారు అభివృద్ది చేశారు. ఈ వాహనం 108 రౌండ్ల కాల్పులకు ఉపయోగపడే ఫిరంగులను కలిగి ఉంటుంది. మరియు దీనిని ఆంపిబియస్ వాహనం కలిగి ఉండే ప్రత్యేకలతో తయారు చేసారు.

picture credit: photodivision

8. టోపాస్ 2-ఎ (TOPAS 2-A)

8. టోపాస్ 2-ఎ (TOPAS 2-A)

ఇది ప్రారంభంలో వ్యక్తిగత ఆంపిబియస్ యుద్ద వాహనంగా తయారు చేయబడింది. అయితే ప్రస్తుతం దీనిని టెక్నికల్ సపోర్ట్ వెహికల్‌గా వినియోగిస్తున్నారు.

picture credit: wikipedia

9. డిఆర్‌డిఓ సాయుధ అంబులెన్స్

9. డిఆర్‌డిఓ సాయుధ అంబులెన్స్

ఈ సాయుధ అంబులెన్స్‌ను డిఆర్‌డిఓ అభివృద్ది చేసింది. దీనిని రకాల వైద్య సదుపాయాలతో తయారు చేసారు

picture credit: drdo

10. ఎన్‌బిసి పర్యవేక్షణ వాహనం

10. ఎన్‌బిసి పర్యవేక్షణ వాహనం

ఈ పర్యవేక్షణా వాహనాన్ని డిఆర్‌డిఓ మరియు విఆర్‌డిఇ సంయుక్తంగా అభివృద్ది చేశారు. దీనిని అణు, జీవన మరియు రసాయన ప్రమద కారకాలను గుర్తించడానికి ఉపయోగిస్తారు.

picture credit: wikimedia

11. పిఆర్‌పి-2

11. పిఆర్‌పి-2

ఆ పిఆర్‌పి-2 శతాగ్ని దళ వాహనాలను గుర్తించడానికి వినియోగిస్తారు. దీనిని ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ ఫిరంగులను కలిగిన వాహనలను గుర్తించడానికి వినియోగిస్తోంది.

picture credit: armyrecognition

12.కాస్పిర్

12.కాస్పిర్

దీనిని మందుపాతరలను గుర్తించడానికి వినియోగిస్తారు అధేవిదంగా అధిక స్థాయిలో సైన్యాన్ని ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి తరలించడానికి ఈ వాహనాన్ని వినియోగిస్తారు. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో 90 వాహనాల వరకు వినియోగంలో ఉన్నాయి.

picture credit: wikipedia

13. టార్మర్ ఏఎఫ్‌వి

13. టార్మర్ ఏఎఫ్‌వి

ఈ టార్మర్ ఏఎఫ్‌వి వాహనాన్ని పాత కాలం నాటి టి55 ఆధారంతో రూపొందించారు. దీని కూడా మందు పాతర గుర్తించి వాటిని పేళ కుండా నాశనం చేయడం మరియు వెలికి తీయడానికి వినియోగిస్తారు.

picture credit: defenceforumindia

 14. హైడ్రిమా

14. హైడ్రిమా

దీనిని ముఖ్యంగా మందు పాతరలను క్లియర్ చేయడానికి వినియోగిస్తారు. ఇది సుమరుగా 3.5 మీటర్ల వెడల్పు ఉన్న మందుపాతరలను తొలగించివేస్తుంది.

picture credit: team-bhp

15. ఆధిత్య ఎమ్‌విపి

15. ఆధిత్య ఎమ్‌విపి

ఈ ఆధిత్య ఎమ్‌విపి వాహనాన్ని డిఆర్‌డిఓ అభివృద్ది చేసింది. దీని ముఖ్యంగా అధికంగా టెర్రరిసమ్ గల ప్రాంతాలకు మరియు భద్రత ఎక్కుల అవసరమున్న ప్రదేశాలకు సైన్యాన్ని త్వరితగతిన చేరవేయడానకి వినియోగిస్తారు.

picture credit: wikipedia

16. డిఆర్‌డిఓ దక్ష్

16. డిఆర్‌డిఓ దక్ష్

ఇది రిమోట్ ద్వారా పనిచేసే బ్యాటరీ రోబో. దీని ప్రాథమిక కర్తవ్యం యుద్ద క్షేత్రంలో ఉన్న బాంబులను సేకరించడం. దీనిని డిఆర్‌డిఓ అభివృద్ది చేసింది.

picture credit: wikipedia

17. కార్తీక్ ఎబిఎల్

17. కార్తీక్ ఎబిఎల్

దీనిని సివిఆర్‌డిఇ మరియు డెవలెప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ వారు సంయక్తంగా అభివృద్ది చేశారు. దీనిని విజయంతా ఛాసిస్ అధారంతో భారీ వాహనాల తయారీ పరిశ్రమలో తయారు చేశారు. దీనిని బ్రిడ్జి లేయర్ ట్యాంకు అంటారు. 1989 లో సైన్యంలో దీనిని మొదటిసారిగా వినియోగించారు.

picture credit: vatsrohit

18. బ్రిడ్జి లేయర్ ట్యాంక్ ఎమ్‌టి-55

18. బ్రిడ్జి లేయర్ ట్యాంక్ ఎమ్‌టి-55

ఎమ్‌టి-55 వాహనాన్ని సాయుధ దళంలో బ్రిడ్జి లేయర్ ట్యాంక్‌గా వినియోగిస్తారు.

19. సర్వత్రా

19. సర్వత్రా

ఈ సర్వత్రా వంతెన వ్యవస్థను డిఆర్‌డిఓ అభివృద్ది చేసింది. ఆ సర్వత్రా వాహనం ద్వారా 75 మీటర్ల పొడవు వరకు నీటి మీద వంతనెను నిర్మించగల గల వ్యవస్థను కలిగి ఉంది.

picture credit: defenceforumindia

20. టి-72 బిఎల్‌టి

20. టి-72 బిఎల్‌టి

ఈ టి-72 బిఎల్‌టి వాహనాన్ని సివిఆర్‌డి వారు మరియు భారీ వాహనాల తయారీ పరిశ్రమలో తయారు చేశారు. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ వద్ద ఈ టి-72 బిఎల్‌టి బ్రిడ్జి లేయర్ వాహనాలు దాదాపుగా 12 వరకు ఉన్నాయి.

picture credit: drdo

21. CEASE

21. CEASE

కాలువ గట్లును దాటి దాడులకు తెగబడే వాహనాలను సిఇఎఎస్ఇ వాహనాలు అంటారు. ఈ అధునాతనమైన బ్రిడ్జింగ్ వ్యవస్థను కలిగి ఉండే వాహనాలను రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ వారు తయారు చేశారు. ప్రస్తుతం భారతీయ సైన్యం వద్ద ఇలాంటివి ఆరు ఉన్నాయి.

picture credit: imageshack

22. AERV

22. AERV

దీనిని నేల మరియు నీటి మీద యుద్ద వాహనాలు ప్రయాణించడానికి సమతలాన్ని ఏర్పాటు చేసే వాహనం. ఎత్తు పల్లాలు మరియు నీటి కమతాలు ఉన్న ప్రదేశాలలో దీనిని ద్వారా యుద్ద వాహనాలు ఒక భూ భాగం నుండి మరొక భూభాగానికి చేరుకుంటాయి.

picture credit: armyrecognition

23. బిఎమ్‌‌పి-2 ఏఏడి

23. బిఎమ్‌‌పి-2 ఏఏడి

ఏఏడి అనగా ఆర్మర్డ్ ఆంపిబియస్ డోజర్ ఇది బిఎమ్‌పి-2 లో ఒకల వేరియంట్. దీనికి ముందు మరియు వెనుక వైపున ఫోల్డింగ్ డోజర్ బ్లేడ్ కలదు. సుమారుగా 800 కిలోల వరకు బరువున్న పదర్థాలను తరలించగలదు.

picture credit: imageshack

24. ఎఫ్‌వి180 కాంబాట్ ఇంజనీర్ ట్రాక్టర్

24. ఎఫ్‌వి180 కాంబాట్ ఇంజనీర్ ట్రాక్టర్

ఇది ఆంపిబియస్ మరియు మధ్య స్థాయి సాయుధ వాహనం. దీని ద్వారా యుద్ద సమయంలో కావాల్సిన చిన్న గుంతలను తవ్వుకోవచ్చు.

picture credit: military-today

25. డబ్ల్యూ‌జడ్‌టి-2

25. డబ్ల్యూ‌జడ్‌టి-2

రిపేరికి వచ్చిన సాయుధ యుద్ద వాహనాలాను మరియు యుద్ద ట్యాంకులను తరలించడానికి వినియోగిస్తారు.

picture credit: wikipedia

26. డబ్ల్యూ‌జడ్‌టి-3ఎమ్

26. డబ్ల్యూ‌జడ్‌టి-3ఎమ్

డబ్ల్యూ‌జడ్‌టి-2 యొక్క అప్‌గ్రేడ్ మోడల్ ఈ డబ్ల్యూ‌జడ్‌టి-3ఎమ్ వాహనం. ముందు దానితో పోల్చితే ఇందులో ఉత్తమ ఇంజన్ కలదు. దాదాపుగా 300 వరకు ఇలాంటి వాహనాలను ఇండియన్ ఆర్మీ కలిగి ఉన్నట్లు సమాచారం.

picture credit: military-today

27. విటి-72బి ఏఆర్‌వి

27. విటి-72బి ఏఆర్‌వి

యుద్ద క్షేత్రంలో పాడైపోయిన, ధ్వంసం అయిన, పేలిపోయిన మరియు రిపేరికి వచ్చిన వాహనాలను సేకరించడానికి దీనిని వినియోగిస్తారు.

picture credit: aame

28. సమరంలో సరిచేయడానికి

28. సమరంలో సరిచేయడానికి

దీనిని బిఎమ్‌పి-2 ఆధారంతో మెదక్‌లోని ఆర్డినెన్స్ పరిశ్రమలో తయారు చేశారు. యుద్ద క్షేత్రంలో ఉన్న వాహనాలు రిపేరికి గురయితే తక్షణమే వాటిని సరిచేయడానికి దీనిని వినియోగిస్తారు.

picture credit: armyrecognition

29. మ్యాట్ గ్రౌండ్ సర్‌ఫేసింగ్ సిఎల్-70

29. మ్యాట్ గ్రౌండ్ సర్‌ఫేసింగ్ సిఎల్-70

చిత్తడి భూ భాగం మరియు ఇసుక నేలల్లో యుద్ద వాహనాలకు చలనాన్ని అందించడానికి దీనిని వినియోగిస్తారు.

picture credit: drdo

30. యుక్తిరథ్

30. యుక్తిరథ్

దీనిని మెదక్ లోని ఆర్ఢినెన్స్ పరిశ్రమలో తయారు చేశారు. దీనిని ముఖ్యంగా తక్కుల బరువున్న వాహనాలను రికవరీ చేయడానికి సైన్యం వినియోగిస్తోంది.

picture credit: wikipedia

31. KrAZ-6322

31. KrAZ-6322

అది ఆఫ్ రోడ్ ట్రక్, దీనికి ఉన్న ఆరు చక్రాలకు కూడా ఇంజన్ విడుదల చేసే పవర్ అందుతుంది. దీనిని 1994 లో రక్షణ రంగం కోసం రూపొందించారు.

picture credit: photobucket

32. మిత్సుబిషి పజెరో

32. మిత్సుబిషి పజెరో

ఇది ఆన్ రోడ్ మరియు ఆఫ్ రోడ్ ఎస్‌యువి వాహనం, దీనిని సైన్యంలో అధికారులు యుద్ద క్షేత్రాలను చేరుకోవడానికి వినియోగిస్తారు. ఈ పజేరో వాహనాన్ని జపాన్‌కు చెందిన మిత్సుబిషి సంస్థ తయారు చేసింది.

picture credit: armyrecognition

33. సిసు నాసు

33. సిసు నాసు

దీనిని ఫిన్‌ల్యాండ్‌కు చెందిన సిసు ఆటో సంస్థ తయారు చేసింి. సుమారుగా 17 మంది ప్రయాణించే సామర్థ్యం ఉన్న ఇది అన్ని తలాల మీద ప్రయాణానికి అనువైనది.

picture credit: military-today

34. హినో సూపర్ డాల్ఫిన్ ఎఫ్‌జడ్9జె

34. హినో సూపర్ డాల్ఫిన్ ఎఫ్‌జడ్9జె

భారీ ఉపకరణాలను తరలించే సాధనంగా దీనిని వినియోగిస్తున్నారు.

picture credit: wikimedia

దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

35. మహీంద్రా 550 డిఎక్స్‌బి

picture credit: team-bhp

దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

36. స్వరాజ్ మజ్దా

picture credit: hollilla

దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

37. మారుతి జిప్సి

picture credit: indiandefence

దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

38. విండి 505

picture credit: team-bhp

దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

39. విఎఫ్‌జె ఎల్‌పిటిఎ టిసి ( VFJ LPTA 713 TC)

picture credit: apheritage

దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

40. అశోక్ లేలాండ్ టాప్చి డిఫెన్స్ వాహనం

picture credit: trucksplanet

దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

41. అశోక్ లేలాండ్‌కు చెందిన విఫ్‌జె స్టాల్లియన్ ఎమ్‌కె III మరియు IV

picture credit: wikipedia

 దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

42. అశోక్ లేలాండ్ డిఫెన్స్ అగ్ని మాపక వాహనం

picture credit: indiamart

 దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

43.టాటా ఎల్‌పిటిఎ 1615 టిసి ట్రక్కు

picture credit: offroadvehicle

 దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

44. టాట్రా 8X8 మొబైల్ క్లీనింగ్ వెహికల్

వాహనాలను శుభ్రపరిచే సిజెఖ్ యూనిట్‌ను టాట్రా వాహనం మీద అమర్చారు.

picture credit: drdo

 దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

దేశీయంగా తయారయి భారతీయ ఆర్మీ సైన్యంలో వినియోగంలో ఉన్న మరిన్ని వాహనాలు

45. బిఇఎమ్‌ఎల్ టాట్రా ట్రక్

picture credit: firangionindia

భారత సైన్యం యొక్క వెన్నెముక, ఈ 45 సాయుధ వాహనాలు

గనులలో వినియోగించే వాహనాల గురించి ఆసక్తికరమైన విషయాలు

నాగసాకి, హిరోషిమా నగరాల నాశనానికి కారణమైన విమానం గురించి ఆసక్తికరమైన విషయాలు

Most Read Articles

English summary
List 45 Vehicles Used Indian Army

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Drivespark sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Drivespark website. However, you can change your cookie settings at any time. Learn more