పాక్‌కు షాకిచ్చిన లాక్‌హీడ్-టాటా డీల్: ఇండియాలో లాక్‌హీడ్ యుద్ద విమానాల తయారీ

Written By:

అమెరికాకు చెందిన దిగ్గజ యుద్ద విమానాల తయారీ సంస్థ లాక్‌హీడ్ టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్(TASL) తో చేతులు కలిపింది. ఇరు సంస్థల పరస్పర ఒప్పందంతో లాక్ హీడ్ తమ అన్ని యుద్ద విమానాలను టాటా సహాయంతో ఇండియాలోనే తయారు చేయనుంది.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ఇండియాలో లాక్‌హీడ్ యుద్ద విమానాల తయారీ

అనేక ప్రపంచ దేశాలకు లాక్‌హీడ్ ఎఫ్-16 ఫైటర్ జెట్లను ఇండియాలో ఉత్పత్తి చేసి, ఎగుమతి చేయనుంది, ఇదే జరిగితే భారత్ శత్రు దేశాలకు లాక్‌హీడ్ యుద్ద విమానాలను సరఫరా చేయడంలో మార్పులు చేసుకోనున్నాయి. ప్రధానంగా పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది.

Recommended Video
2017 Mercedes-Benz GLC AMG 43 Coupe Launched In India | In Telugu - DriveSpark తెలుగు
ఇండియాలో లాక్‌హీడ్ యుద్ద విమానాల తయారీ

ప్రపంచపు అతి పెద్ద డిఫెన్స్ విమానాల తయారీ సంస్థ లాక్‌హీడ్‌కు ఆర్డర్లు లేనందున టెక్సాలోని ప్రొడక్షన్ ప్లాంటును పూర్తిగా మూసివేసి, టాటా సహాయంతో ఇండియాలో అసెంబ్లీ ప్లాంటు ఏర్పాటు చేసి, భారత్ సమీప దేశాలకు గల డిమాండ్ దృష్ట్యా మార్కెట్‌ను చేజిక్కించుకునే పనిలో ఉంది లాక్‌హీడ్.

ఇండియాలో లాక్‌హీడ్ యుద్ద విమానాల తయారీ

యుద్ద విమానాల తయారీ మరియు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో లాక్‌హీడ్ సంస్థకు సుదీర్ఘ అనుభవం కలదు, అదే విధంగా ఇండియన్ కంపెనీ టాటా అనేక తయారీ రంగాలలో అపార అనుభవం కలదు. ఈ రెండు సంస్థల ఉమ్మడి భాగస్వామ్యం ఇండియాలో యుద్ద విమానాల హబ్‌గా మార్చుతూ, దేశీయంగా అనేక ఉద్యోగ అవకాశాలను కల్పించనుంది.

ఇండియాలో లాక్‌హీడ్ యుద్ద విమానాల తయారీ

ప్రస్తుతం ఇండియా వద్ద ఉన్న అనేక సోవియట్ యుద్ద విమానాలను పూర్తిగా మార్చేయాల్సి ఉంది. వీటి స్థానంలోకి అత్యాధునిక ఎఫ్-16 ఫైటర్ జెట్‌లను తీసుకోవాలని భావిస్తోంది. సుమారుగా 100 కు పైగా ఎఫ్-16 యుద్ద విమానాల అవసరం భారత్‌కు ఉన్నట్లు తెలిసింది.

ఇండియాలో లాక్‌హీడ్ యుద్ద విమానాల తయారీ

ఈ విశయమై ప్రధాని మోడీ మాట్లాడుతూ, "ఫారిన్ కంపెనీలు దేశీయంగా ఉన్న ప్రాంతీయ తయారీ సంస్థలతో కలిసి యుద్ద విమానాలను దేశీయంగానే తయారు చేస్తే, దిగుమతి సుంకం లేకుండా తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చని తెలిపాడు."

ఇండియాలో లాక్‌హీడ్ యుద్ద విమానాల తయారీ

దేశీయంగా తయారైన యుద్ద విమానాలను తయారు చేయడం పట్ల భారత్ ఆసక్తికనబరుస్తుండటం మరియు మేకినే ఇండియా కు అధిక ప్రాధాన్యతనివ్వడంతో అటు అమెరికా సంస్థ లాక్‌హీడ్ మరియు స్వీడన్‌కు చెందిన స్వాబ్ సంస్థ దేశీయ కంపెనీలతో ఉమ్మడి భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి.

ఇండియాలో లాక్‌హీడ్ యుద్ద విమానాల తయారీ

లాక్‌హీడ్ ఎఫ్-16 యుద్ద విమానాలను అభివృద్ది చేయగా, స్వాబ్ కంపెనీ గ్రిపెన్ యుద్ద విమానాలను అభివృద్ది చేసింది. అయితే భారత రక్షణ విభాగానికి యుద్ద విమానాలను సప్లే చేసే అవకాశం వేటికి ఇస్తుందో చూడాలి మరి.

ఇండియాలో లాక్‌హీడ్ యుద్ద విమానాల తయారీ

లాక్‌హీడ్ ఇండియాలో తయారీ యూనిట్ నెలకొల్పి ప్రపంచ దేశాలకు తమ యుద్ద విమానాలను ఎగుమతి చేయడం ద్వారా భారత ఖజానాకు ఆదాయం చేకూరే అవకాశం ఉంది. అంతే కాకుండా పాకిస్తాన్ వంటి భారత్ శత్రు దేశాలకు లాక్‌హీడ్ ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం కూడా ఉంది.

ఇండియాలో లాక్‌హీడ్ యుద్ద విమానాల తయారీ

పాకిస్తాన్ వద్ద కూడా లాక్‌హీడ్ ఎఫ్-16 యుద్ద విమానాలు ఉన్నాయి. వాటి నిర్వహణ మరియు కావాల్సిన విడి భాగాలు ఇండియా నుండి సరఫరా జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇండియాలో లాక్‌హీడ్ యుద్ద విమానాల తయారీ

ప్రపంచ దిగ్గజ యుద్ద విమానాల తయారీ సంస్థలు ఇండియాలో తమ కార్యకలాపాలను పూర్తి స్థాయిలో ప్రారంభిస్తే, భారత్ మరింత శక్తివంతమైన దేశముగా అవతరించి, అనేక దేశాలతో సంభందాలు మెరుగుపడే అవకాశం ఉంది.

English summary
Read In Telugu F-16 Fighter Planes To Be Made In India; Tata Signs Pact With Lockheed
Story first published: Thursday, June 22, 2017, 12:55 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark