Just In
- 2 hrs ago
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- 3 hrs ago
దక్షిణ భారత్‌లో కొత్త డీలర్షిప్ ఓపెన్ చేసిన బెనెల్లీ; వివరాలు
- 5 hrs ago
భారత్‌లో మరే ఇతర కార్ కంపెనీ సాధించని ఘతను సాధించిన కియా మోటార్స్!
- 6 hrs ago
రిపబ్లిక్ డే పరేడ్‌లో టాటా నెక్సాన్ ఈవీ; ఏం మెసేజ్ ఇచ్చిందంటే..
Don't Miss
- News
హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు భారీ ఊరట: ట్రంప్ నిర్ణయాలకు చెక్ పెట్టిన జో బైడెన్
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Movies
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కేవలం 100 రూపాయలకే స్లీపర్ బస్సులో ఉండొచ్చు.. ఎక్కడో తెలుసా?
సాధారణంగా ఎసి స్లీపర్ బస్సుల్లో అన్ని సౌకర్యాలతో కూడిన వాటిలో వెళ్ళడానికి లేదా బస చేయడానికి ఎక్కువ డబ్బు చెల్లించాల్సి వస్తుంది. దీనికి బదులుగా చాలా తక్కువ రేటుకు తగిన సౌకర్యాలతో కేరళ రాష్ట్రం కొత్త తరహా బస్సులను ప్రవేశపెట్టింది.
పర్యాటక ప్రదేశాలలో ఉండే వసతి గృహాలలో ఉండాలంటే సాధారణ ప్రదేశాలలో తీసుకునే డబ్బుకంటే ఎక్కువ డబ్బు వసూలు చేస్తారు. కాబట్టి ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో కుటుంబంతో సహా విహార యాత్రలకు వెళ్లాలని అనుకునే వారు వసతి కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అటువంటి కేరళ రాష్ట్రము ప్రవేశపెట్టివున్న బస్ సర్వీస్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

భారతదేశంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటి కేరళ. కేరళలోని మున్నార్ పర్యాటక ప్రదేశానికి ఒక్క భారతదేశం నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా పర్యాటకులు ఇక్కడకు వస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పర్యాటకులు ఉండటానికి హాస్టళ్లలో ఎక్కువ ఫీజులు వసూలు చేయడం వల్ల, మధ్యతరగతి ప్రజలు తమ కుటుంబంతో కలిసి మున్నార్‌లో ఉండటానికి వివిధ సమస్యలు తలెత్తుతాయి.

ఈ సమస్యను పరిష్కరించడానికి మున్నార్‌లో 'లాడ్జ్ బస్' సౌకర్యం ప్రవేశపెట్టబడింది. ఈ పేరును బట్టి మనం దీనిని అర్థం చేసుకోవచ్చు. కేరళ రాష్ట్ర రహదారి రవాణా సంస్థ (కెఎస్‌ఆర్‌టిసి) దీనిని ఏర్పాటు చేయడం జరిగింది.
MOST READ:ఇండియన్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కార్లు ఎలా ఉన్నాయో చూసారా.. అయితే ఇప్పుడు చూడండి

హాస్టళ్లలో ఉండటానికి వీలులేని వారు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఈ లాడ్జ్ బాసులలో అతితక్కువ ఫీజులు వసూలు చేస్తారు. ప్రయాణీకుల వసతి కోసం ప్రస్తుతం ప్రవేశపెడుతున్న బస్సులు సాధారణ బస్సులు లాగా కాదు.

ఇది ఒక రకంగా స్లీపర్ బస్సు. కాబట్టి పర్యాటకులు ఇందులో పడుకుని హాయిగా నిద్రపోవచ్చు. అంతే కాకుండా బస్సులో సెల్ ఫోన్లు ఛార్జ్ చేసుకోవడానికి కూడా సౌకర్యం కలిగి ఉంది. బయట ఆహారం కొని ఈ బస్సులో కూర్చుని తినవచ్చు. దీనికి తగువిధంగా టేబుల్, డ్రింకింగ్ వాటర్, చేతులు కడుక్కోవడానికి కావలసిన సదుపాయాలు కల్పించబడ్డారు.
MOST READ:మీకు తెలుసా.. త్వరలో మన హైదరాబాద్‌కు రానున్న కొత్త రేస్ ట్రాక్

అన్నింటికంటే మించి ఈ బస్సులో ఎసి సౌకర్యం ఉంది. మున్నార్‌లోని చలికి ఎసి అవసరం లేనప్పటికీ, ఇందులో ఈ ఫీచర్ ఉంది. ఈ బస్సులో ఒకేసారి 16 మంది పడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం 2 ఎసి బస్సులు ఈ సేవలో ఉన్నాయి. ఈ రెండు బస్సులలో మొత్తం 32 పడకలు ఉన్నాయి.

ఈ సర్వీస్ కి పర్యాటకుల నుంచి మంచి ఆదరణ పొందుతోంది. ఈ బస్ సర్వీసులలో పడకలన్నీ రద్దీగా ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ కారణంగా, కెఎస్‌ఆర్‌టిసి ఈ సర్వీస్ లో మరిన్ని బస్సులను చేర్చే అవకాశం ఉంది.
MOST READ:కిడ్నీ తరలించడానికి లంబోర్ఘిని కారు ఉపయోగించిన పోలీసులు.. ఎక్కడో తెలుసా?

ప్రస్తుతం సర్వీసులో ఉన్న 2 లాడ్జ్ బస్సులను మున్నార్ వద్ద ఉన్న డిపోలో నిలిపి ఉంచనున్నారు. ప్రయాణీకులు అక్కడికి వెళ్లి బస చేయవచ్చు. తెల్లవారుజామున మీరు పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి వెళ్ళవచ్చు. కానీ ఈ బస్సుల్లో మరుగుదొడ్డి సౌకర్యాలు లేవు. అయితే డిపోలో వున్నా మరుగుదొడ్లు ఉపయోగించుకోవచ్చు.

ఈ బస్సుల్లో పర్యాటకుల వస్తువులను భద్రంగా ఉంచడానికి సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఈ బస్సులో ఛార్జీలు రోజుకు కేవలం 100 రూపాయలు మాత్రమే. ఉదాహరణకు ఒక కుటుంబంలో ఐదుమంది వ్యక్తులు యాత్రకు వెళితే వారు కేవలం 500 రూపాయలు చెల్లించాలి. ఇది బస్సులో కుటుంబంతో కలిసి ఉండటానికి మీకు ప్రత్యేకమైన అనుభవాన్ని కూడా ఇస్తుంది.
MOST READ:చేయని తప్పుకు అమాయక వ్యక్తిని నడిరోడ్డులో చితకబాదిన పోలీస్ [వీడియో]

ఈ బస్సులో బెడ్ లను బుక్ చేసుకోవాలనుకునే వారు 9447813851, 04865230201 నంబర్లకు కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో మున్నార్ వెళ్లిరావాలనుకునే వారికి ఈ ప్రాజెక్ట్ ఒక నిజంగా చాలా సహాయపడుతుంది. ఇటువంటి సర్వీ ఇతర రాష్ట్రాల్లోని రవాణా సంస్థలు కూడా అనుసరిస్తే చాలా బాగుంటుంది.