80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక అనూహ్యంగా ఒడ్డుకు చేరిన వైనం

By Anil

అమెరికాలోని కాలిఫోర్నియాలో అది సుమారుగా 1921 కాలమానం. అప్పట్లో ఎస్ఎస్ మ్యాకిట్రిక్ అనే సంస్థ ఎస్ఎస్ మోంటే కార్లో అనే అతి పెద్ద అయిల్ ట్యాంకర్ నౌకను ప్రారంభించింది.

అయితే ఊహించని విధంగా ఈ నౌక 1936 లో కాలిఫోర్నియాలోని కొరాండో సముద్ర తీర ప్రాంతాల్లో గ్యాబ్లింగ్ మరియు వ్యభిచార కార్యకలాపాలకు నిలయంగా మారిపోయింది. ఆ తరువాత సుమారుగా 80 సంవత్సరాల వరకు దీని జాడలేకుండా పోయింది. తాజాగ ఇది అక్కడకు సమీపంలోనే బయల్పడింది, ఇందులో బంగారు మరియు సిల్వర్‌ డాలర్ల రూపంలో ఉన్న నిధిని కూడా గుర్తించారు. దీని గురించి మరిన్ని వివరాలు క్రింది కథనంలో తెలుసుకుందాం రండి.

ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక

1936 సంవత్సరం తరువాత ఈ నౌకలో చట్టవిరుద్దమైన కార్యకాలపాలు చోటుచేసుకునేవి. ఇందులో డబ్బుతో ఆటలు మరియు అమ్మాయిలతో పడుపు పనులు చేయించే వారు. అప్పట్లో దీని గురించి పెద్ద దుమారమే రేగింది.

Picture credit: ibtimes.co.uk

ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక

కొరాండో బీచ్‌‌కు సుమారుగా మూడు మైళ్ల దూరంలో సముద్రంలో దీనికి లంగరు (నౌకలు మరియు ఓడలను నీటి ప్రవాహంలో కదలకుండా ఉంచే సాధనం) వేసి బీచ్ సరిహద్దుల్లోకి రాకుండా చేసి వినియోగించుకునే వారు.

Picture credit: Jamie Lantzy/Wiki Commons

ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక

ఆ తరువాత 1937 లో వచ్చిన పెను తుఫాను కారణంగా లంగరు వేసిన నౌక దాని నుండి తప్పించుకుని సముద్రంలోనికి కొట్టుకుపోయింది.

Picture credit: Jamie Lantzy/Wiki Commons

ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక

ఇది సరిగ్గా నేడు కొరాండో సముద్రం తీర సముదాయంలోని ఇఐ క్యామినో టవర్ ఎదురుగా జరిగింది.

Picture credit: Jamie Lantzy/Wiki Commons

ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక

గ్యాంబ్లింగ్ మరియు వ్యభిచారం నిర్వహించినటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు జరిగిన ఈ నౌక మునక గురించి దీని యాజమాని ఫిర్యాదు చేయలేదు.

Picture credit: Jamie Lantzy/Wiki Commons

ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక

అయితే సముద్రంలో వచ్చిన విపరీతమైన ఆటుపోట్లకు ఇది సముద్ర తీరానికి కొట్టుకువచ్చింది. తక్కువ ఆటుపోట్లు మధ్య ఇది చూడటానికి ఎంతో అందంగా దర్శనమిచ్చింది.

ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక

దీని చూట్టూ పర్యాటకులు మూగడటంతో దీని శిథిలాల క్రింద సుమారుగా 100,000 బంగారు మరియు సిల్వర్ డాలర్ కాయిన్లను గుర్తించారు. బెర్న్‌హార్డ్‌తో పాటు కొంత మంది బాలల కూడా దీనిని గమనించినట్లు తెలిపారు.

Picture credit: YouTube

ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక

తాజాగ కొరాండో సముద్ర తీరంలో ఎల్ నినో కారణంగా వస్తున్న భయంకరమైన అలల కారణంగా ఈ నౌక మీదున్న రాళ్లు, మట్టి మరియు ఇసుక వంటివి తొలగిపోయాయి. తద్వారా ఇది చూడటానికి చాలా స్పష్టంగా ఉంది.

Picture credit: YouTube

ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక

అయితే అప్పట్లో దీని సందర్శించిన వారు ప్రస్తుతం దీని చూసి అప్పట్లో ఎంతో అనుభవించిన నౌక మళ్లీ ఇలా ఒడ్డుకు వచ్చి, తిరిగి మేము చూస్తామని ఊహించలేదు అని దీని గురించి చెప్పుకొచ్చారు.

Picture credit: Jamie Lantzy/Wiki Commons

ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక

1930 ల కాలంలో గ్యాంబ్లింగ్ మరియు వ్యభిచారం అనేవి చట్టవ్యతిరేకమైనవి కావడం వలన కొరాండో బీచ్‌కు దూరంగా సముద్రంలో లంగరు వేసి దీనిని మీద వ్యాపారాన్ని నిర్వహించేవారు.

Picture credit: ibtimes.co.uk

ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక

జనసంచారంలో ఇలాంటి ఉండకూడదు అనే నియమం ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీని గురింతి హాలీవుడ్‌లో గ్యాంబ్లింగ్ షిప్ అనే పేరుతో సినిమా కూడా నిర్మించారు. ఆ కాలంలో ఆ నౌక యొక్క పాపులారిటీని ఈ సినిమా ద్వారా ఎంతో పేరుగాంచింది.

Picture credit: YouTube

ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక

దీని గురించి విభిన్నమైన కథనాలు వస్తున్న నేపథ్యంలో ఎస్ఎస్ మోంటే కార్లో సంస్థ ముందుకు వచ్చి ఈ నౌకను 1933 లో సముద్రంలో దూరంగా లంగరు వేసి నిలిపామని తెలిపింది. అయితే కొరాండో చారిత్రాత్మక అసోషియేషన్‌లో సభ్యునిగా ఉన్న క్రాఫోర్డ్ అనే వ్యక్తి మాట్లాడుతూ, ఇది చట్ట వ్యతిరేకము అని అక్కడ ఉన్న పోలిసు చేసిన ఒత్తిడి వలన బీచ్‌కు దూరంగా ఈ నౌక వెళ్లిపోయినట్లు తెలిపారు.

Picture credit: Jamie Lantzy/Wiki Commons

ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక

ఎస్ఎస్ మోంటే కార్లో సంస్థ వారి కథనం మేరకు, 1937 లో ఒక రోజు ఉదయం 3 గంట ప్రాంతంలో వచ్చిన పెద్ద తుఫాన్ కారణంగా లంగరుకు ఉపయోగించిన చైన్ తెగిపోవడం వలన ఈ నౌక మునిగిపోయి సముద్రం అడుగుకి చేరుకుంది. అప్పట్లో ఇందులో ఉన్న వారు కూడా ప్రమాదంలో చనిపోయినట్లు తెలిపారు.

Picture credit: Jamie Lantzy/Wiki Commons

ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక

ఏదేమైనప్పటికీ అప్పట్లో గ్యాంబ్లిగ్ మరియు వ్యభిచార కార్యకలాపాలకు నిలయంగా మారిన నౌక ఒడ్డుకు చేరుకోవడం అక్కడి వారికి ఆనందంగానే ఉంది.

Picture credit: YouTube

ఒడ్డుకు చేరిన 80 ఏళ్ల క్రితం అదృశ్యమైన వ్యభిచారపు నౌక

102 ఏళ్ల తరువాత విస్తరించబడిన పనామా కెనాల్ చరిత్ర

సముద్రంలో ఉన్న భయంకరమైన దెయ్యం నౌకలు !! వాటి వెనకున్న చరిత్రలు...!!

Most Read Articles

Read more on: #నౌకలు #ships
English summary
Lost Sunken Gambling Ships Monte Carlo Emerges Sand
Story first published: Tuesday, July 26, 2016, 12:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X