స్పైడర్ బర్త్ డే స్పెషల్: మహేష్ బాబు కార్ కలెక్షన్

Written By:

క్లాస్, మాస్, యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాల్లో స్మార్ట్ లుకింగ్ స్టైల్‌తో నటనను పండించగలడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. మహేష్ బాబుకు మేల్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో... ఫీమేల్ ఫ్యాన్స్ కూడా అంతే మంది ఉన్నారు. ఆరంబడ సన్నివేశాలకు దూరంగా ఉండే మహేష్ యువతను మాత్రమే కాకుండా పెద్దలను కూడా ఆకట్టుకుంటున్నాడు.

మహేష్ బాబు కార్ కలెక్షన్

నటన మరియు అభినయం పరంగా హాలీవుడ్‌కు ఏ మాత్రం తీసిపోని సూపర్ స్టార్ మహేష్ బాబు ఆగష్టు 09 2017 తో 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. డ్రైవ్‌స్పార్క్ తెలుగు మహేష్ బాబుకు 41 వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతోంది. ఈ సందర్భంగా సూపర్ స్టార్ స్పైడర్ మరియు ఆయన కార్ కలెక్షన్ గురించి ప్రత్యేక కథనం....

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
మహేష్ బాబు కార్ కలెక్షన్

చిత్ర పరిశ్రమలో మహేష్ అనగానే ప్రతిధ్వనిస్తున్న శబ్దం స్పైడర్. నిజమే, టాలీవుడ్ హీరో, కోలీవుడ్ డైరక్టర్ కలయికలో వస్తున్న స్పైడర్ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. స్పైడర్ యూనిట్ ఇప్పటి వరకు రెండు టీజర్లను విడుదల చేసింది. వీటికి అభిమానుల నుండి పాజిటివ్ టాక్ వస్తోంది.

మహేష్ బాబు కార్ కలెక్షన్

శ్రీమంతుడు చిత్రం తర్వాత మహేష్ ఖాతాలో పడనున్న మరో అతి పెద్ద సక్సెస్ స్పైడర్ అని చెప్పవచ్చు. తమిళ డైరక్టర్ ఏఆర్ మురుగదాస్, మ్యూజిక్ డైరక్టర్ హ్యారిస్ జయరాజ్ వంటి వ్యక్తుల కలయికలో వస్తున్న మహేష్ స్పైడర్ చిత్రం తెలుగు మరియు తమిళ భాషలలో ఒకే సారి తెరకెక్కుతోంది.

మహేష్ బాబు కార్ కలెక్షన్

ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్‌ప్రీత్ సింగ్ మరియు ప్రతినాయకుడి పాత్రలో ఎస్‌జె సూర్య నటించారు. స్పైడర్ చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. చివరి దశ పనుల్లో ఉన్న చిత్ర యూనిట్ దసరా కానుగా వచ్చే సెప్టెంబర్ 23 న తెలుగు మరియు తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనుంది. తర్వాత స్లైడర్లలో మహేష్ బాబు కార్ కలెక్షన్ చూద్దాం రండి....

మహేష్ బాబు కార్ కలెక్షన్

లాంబోర్గిని గల్లార్డో ఎల్‌పి560-4

హాలీవుడ్ రేంజ్‌కు తీసిపోని మహేష్ బాబు కార్ల గ్యారేజీలో సుమారుగా 3 కోట్ల రుపాయల ఖరీదైన లాంబోర్గిని గల్లార్డో LP560-4 కారు ఉంది. ఇందులో 5,204సీసీ సామర్థ్యం గల పది సిలిండర్ల శక్తివంతమైన ఇంజన్ కలదు.

మహేష్ బాబు కార్ కలెక్షన్

రేంజ్ రోవర్ వోగ్

మహేష్‌బాబుకు డీసెంట్ లుక్‌లో ఉన్న రేంజ్ రోవర్ కార్ల చాలా ఇష్టం. మహేష్ బాబుకు తన 36 వ పుట్టిన రోజు కానుకగా భార్య నమ్రత రేంజ్ రోవర్ వోగ్‌ లగ్జరీ ఎస్‌యూవీని ఇచ్చింది. దీని మార్కెట్ విలువ సుమారుగా రూ. 2 కోట్లుగా ఉంది.

మహేష్ బాబు కార్ కలెక్షన్

రేంజ్ రోవర్ వోగ్ లగ్జరీ ఎస్‌యూవీ 3.0-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ మరియు 3.0-లీటర్ కెపాసిటి గల సూపర్ ఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్ వేరియంట్లో అందుబాటులో ఉంది. ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో లభించే రెండు ఇంజన్‌లకు 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

మహేష్ బాబు కార్ కలెక్షన్

టయోటా ల్యాండ్ క్రూయిజర్

టయోటా లైనప్‌లో అత్యంత సురక్షితమైన మరియు శక్తివంతమైన వాహనం టయోటా ల్యాండ్ క్రూయిజర్. ఇండియన్ మార్కెట్లో టయోటా ల్యాండ్ క్రూయిజర్ ధర సుమారుగా రూ. 1.3 కోట్లుగా ఉంది.

మహేష్ బాబు కార్ కలెక్షన్

టయోటా ల్యాండ్ క్రూయిజర్ అల్టిమేట్ ఎస్‌యూవీలో అత్యంత శక్తివంతమైన 4,461సీసీ సామర్థ్యం ఉన్న వి8 డీజల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 261బిహెచ్‌పి పవర్ మరియు 650ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

మహేష్ బాబు కార్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్

మహేష్ బాబు కార్ గ్యారేజ్‌లో మెర్సిడెస్ ఇ-క్లాస్ లగ్జరీ సెడాన్ కలదు. దీని సుమారుగా రూ. 49 లక్షలుగా ఉంది.

మహేష్ బాబు కార్ కలెక్షన్

మహేష్ బాబు తన మొత్తం సంపాదనలో 25 శాతం వరకు ఛారిటబుల్ ట్రస్టులకు విరాళంగా ఇస్తున్నాడు. మరియు గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ సదుపాయాల కల్పన మరియు గ్రామ అభివృద్దిలో భాగస్వామ్యం అవుతున్నాడు.

English summary
Read In Telugu: Super Star Mahesh Babu Car Collection

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark