చిల్లరతో నాణేలతో బిఎమ్‌డబ్ల్యూ కారునే కొనుగోలు చేశాడు

Written By:

భారత్ తరహాలో చైనాలో కూడా బిఎమ్‌డబ్ల్యూ కార్లకు భలే క్రేజ్. ఎంత అంటే కొన్ని సంవత్సరాల పాటు సంపాదించి పోగుచేసుకున్న చిల్లర డబ్బులతో బిఎమ్‌డబ్ల్యూ కారును కొనేసే అంత. ఆశ్చర్యంగా ఉంది కదూ... మీరే కాదు చిల్లర డబ్బుతో బిఎమ్‌డబ్ల్యూ కారు కొంటానని షోరూమ్ సిబ్బందిని కోరినప్పుడు, వారు కూడా ఆశ్చర్యపోయారు.

చిల్లరతో బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన వ్యక్తి

వివరాల్లోకి వెళితే చిన్న చిన్న పనులు చేసుకుంటూ సంపాదించిన సొమ్మును నాణెల రూపంలో దాచుకున్న చైనాలోని పుజియన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ వ్యక్తి బిఎమ్‌డబ్ల్యూ షోరూమ్‌కి వెళ్లి కొన్ని కార్లను పరిశీలించాడు.

Recommended Video - Watch Now!
Hollywood Cars Seen In India - DriveSpark
చిల్లరతో బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన వ్యక్తి

తనకు నచ్చిన 40 లక్షల రుపాయల ఖరీదైన కారును ఎంచుకున్నాడు. డబ్బు చెల్లించే క్రమంలో తొలి విడతగా రూ. 6.80 లక్షలను చిల్లర రూపంలో చెల్లిస్తానని షోరూమ్ సిబ్బందికి తెలపడంతో అక్కడ ఉన్న వారంతా అవాక్కయ్యారు.

చిల్లరతో బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన వ్యక్తి

చిల్లర తీసుకోవడానికి షోరూమ్ నిర్వాహకులు తొలుత ససేమిరా అన్నప్పటికీ, కస్టమర్‌ను వదులుకోవడం ఇష్టం లేక కస్టమర్ అభ్యర్తనను అంగీకరించి చిల్లర నాణేల చెల్లింపుకు ఒప్పుకున్నారు.

చిల్లరతో బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన వ్యక్తి

దీంతో మొత్తం 6.80 లక్షల రుపాయల విలువైన యువాన్(చైనా కరెన్సీ నాణేలు)లను సుమారుగా 10 డబ్బాల్లో డీలర్‌కు చెల్లించాడు. కస్టమర్ చెల్లించిన చిల్లర మొత్తాన్ని షోరూమ్‌లో నేలపై పోసి సిబ్బంది మొత్తం లెక్కించి కాలక్షేపం చేసుకున్నారు.

Trending On DriveSpark Telugu:

2018 మారుతి స్విఫ్ట్ వచ్చేస్తోంది ఎదురు చూపులకు ముగింపు పలకండి

మొన్న థండర్‌బర్డ్ 500X నేడు 350Xతో పట్టుబడిన రాయల్ ఎన్ఫీల్డ్

మద్యం మత్తులో ఆడి కారు బదులు అంబులెన్స్‌ను తీసుకెళ్లిన ఘనుడు

చిల్లరతో బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన వ్యక్తి

చిల్లర చెల్లించి బిఎమ్‌డబ్ల్యూ కారు కొనడమేంటి? మిగతా డబ్బును ఎలా చెల్లిస్తాడో తెలియకుండా వచ్చిన చిల్లరకు కారును విక్రయించడమేంటని ఆలోచిస్తున్నారా...? బిఎమ్‌డబ్ల్యూ ఆ కస్టమర్ గురించి ఆరా తీసిన తరువాతే కారును విక్రయించారు.

చిల్లరతో బిఎమ్‌డబ్ల్యూ కారును కొనుగోలు చేసిన వ్యక్తి

పుజియన్ ప్రావిన్స్ ప్రాంతంలో నివాసముంటున్న ఆ వ్యక్తి హోల్ సేల్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాల నుండి యువాన్ నాణేలను పోగు చేయడంతో అదిప్పుడు, ఇంత పెద్ద మొత్తమయ్యింది.

చిన్న మొత్తంలో రోజు చేసే కొంత పొదుపు రేపు పెద్ద పెద్ద అవసరాలకు ఉపయోగపడుతుందనడానికి ఇదొక చక్కటి ఉదాహరణ!!

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

English summary
Read In Telugu: Man buys bmw car with coins he has been saving for years
Story first published: Thursday, December 28, 2017, 15:43 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark