దేవుడు చెప్పాడని జాతీయ రహదారి మీద పెద్ద గొయ్యి తవ్వేసారు!

Written By:

మతాన్ని అడ్డుపెట్టుకొని కొంత మంది చెప్పే మాయమాటలను నమ్మి చాలా మంది మూర్ఖంగా మోసపోతున్న కథనాలను రోజుకొక్కటి చూస్తుంటాం. శివ లింగం ఉందనే అప నమ్మకంతో తెలంగాణలో జాతీయ రహదారి మీద పెద్ద గొయ్యిని తవ్విన ఘటనను ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
దేవుడు చెప్పాడని జాతీయ రహదానిరి తవ్వేసిన గ్రామస్తులు

ఇండియాతో పాటు ప్రపంచ దేశాల్లో మూఢ నమ్మకాలను నమ్ముతూ ఎలాంటి పనులకైనా ఒడిగడుతున్నారనేది అక్షరాలా సత్యం. సినిమా నటులు నుండి పొలిటీషియన్స్‌తో పాటు సాధార ప్రజల వరకు అందరూ ఈ ఆధునిక కాలంలో కొందరు వ్యక్తులు చెప్పే మాయమాటలను నమ్ముతున్నారు.

దేవుడు చెప్పాడని జాతీయ రహదానిరి తవ్వేసిన గ్రామస్తులు

వ్యక్తులకు మాత్రమే పరిమితమైన ఇలాంటివి ఇప్పుడు మతాలు మరియు దేవుళ్ల వరకు పాకిపోయాయి. అందుకు నిదర్శనం తెలంగాణలో జరిగిన సంఘటన. శివ లింగం రోడ్డు క్రింది భాగంలో ఉందని ఓ వ్యక్తి చెప్పిన మాటలను నమ్మి ఏకంగా జాతీయ రహదారిని తవ్వేశారు.

దేవుడు చెప్పాడని జాతీయ రహదానిరి తవ్వేసిన గ్రామస్తులు

తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలోని పెంబర్తి గ్రామ పరిధిలో ఉన్న జాతీయ రహదారిని జెసిబిలతో తవ్వించారు గ్రామ ప్రజలు. లఖన్ మనోజ్ స్వామీజీగా చెప్పుకునే వ్యక్తి తెలిపిన మేరకు గ్రామ సర్పంచ్ మరియు ఊరి ప్రజలంతా ఈ ఘటనకు ఒడిగట్టారు.

దేవుడు చెప్పాడని జాతీయ రహదానిరి తవ్వేసిన గ్రామస్తులు

విరాల్లోకి వెలితే పెంబర్తి గ్రామంలో స్వామీజీగా చెలామణి లఖన్ మనోజ్ కలలోకి శివుడు పలుమార్లు దర్శనమిచ్చి, రోడ్డు క్రింద ఉన్న శివ లింగాన్ని సేకరించి పెద్ద గుడిని నిర్మించాలని ఆజ్ఞాపించాడని గ్రామస్థులకు వివరించాడు.

దేవుడు చెప్పాడని జాతీయ రహదానిరి తవ్వేసిన గ్రామస్తులు

మరికొంత మంది వ్యక్తులతో కలిసి, వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి తొలుత కొన్ని పూజలు చేసి జెసిబి మరియు ప్రొక్లెయిన్ల సహాయంతో పెద్ద గొయ్యిని తీయించాడు. అయితే అక్కడ శివ లింగం లేదా శివునికి సంభందించిన ఏవీ కూడా లభ్యం కాలేదు.

దేవుడు చెప్పాడని జాతీయ రహదానిరి తవ్వేసిన గ్రామస్తులు

దీని గురించి ఆ గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, "లఖన్ మనోజ్ శివ భక్తుడు. మరియు గత మూడేళ్లుగా శివుని ప్రతి రూపమైన శివ లింగం రోడ్డు క్రింది భాగంలో ఉన్నట్లు కల వస్తోందని చెప్పేవాడు. అంతే కాకుండా ప్రతి సోమవారం కూడా శివ లింగం ఉందని భావిస్తున్న ప్రదేశం వద్దకు వెళ్లి పూజలు చేస్తుంటే నిజమే అనుకున్నామని" చెప్పుకొచ్చాడు.

దేవుడు చెప్పాడని జాతీయ రహదానిరి తవ్వేసిన గ్రామస్తులు

ఈ విషయం తెలుసుకున్న చుట్టు ప్రక్కల వారంతా అక్కడి చేరుకోవడంతో జాతీయ రహదారి మీద ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. పోలీసులు అక్కడి చేరుకుని పరిస్థితిని సమీక్షించి ట్రాఫిక్‌ను క్లియర్ చేసి, లఖన్ మనోజ్ మరియు సర్పంచ్ లతో పాటు ఐదు మందిని అదుపులోకి తీసుకున్నారు.

దేవుడు చెప్పాడని జాతీయ రహదానిరి తవ్వేసిన గ్రామస్తులు

గ్రామస్తులు మరియు స్వామీజీ సూచనలతో తవ్వకం చేపట్టి ఏకంగా 20 అడుగులు గొయ్యిని తవ్వారు. చివరికి అందులో ఏమీ దొరకలేదు. ప్రభుత్వం ఆస్తులను ధ్వంసపరిచినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

English summary
Read In Telugu To Know More About Man Digs Up National Highway Claims Lord Shiva Asked Him To
Story first published: Wednesday, June 7, 2017, 14:53 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark