హైవే మీద ఆల్టో కార్ల రేసింగ్: నుజ్జునుజ్జయిన కార్లు

Written By:
Recommended Video - Watch Now!
Minor Motorcycle Rider Caught For Not Having A License - The Climax Of The Video Will Surprise You - DriveSpark

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరుగుతున్నాయి. వాటిలో అత్యంత ఘోరంగా జరిగిన ప్రమాదాలను మరియు అలాంటి ప్రమాదాల నుండి ఎలా తప్పించుకోవచ్చు అనే అంశాలతో డ్రైవ్స్‌స్పార్క్ తెలుగు ఎన్నో కథనాలను ప్రచురించింది. అయితే, తమిళనాడులో జరిగిన ఈ రోడ్డు ప్రమాదం చాలా భిన్నం.

మారుతి ఆల్టో ప్రమాదం

రెండు ఆల్టో కార్లతో హైవే మీద రేసింగ్ చేస్తూ ఒకేసారి ప్రమాదానికి గురయ్యాయి, ఈ ప్రమాదంలో క్రికెట్ లీగ్ కోసం వెళుతున్న బృందం తీవ్రంగా గాయపడగా, ఓ యువ క్రికెటర్ మృతి చెందాడు. ఈ సంఘటన జరిగిన తీరు మరియు ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో ఇవాళ్టి కథనంలో చూద్దాం రండి...

మారుతి ఆల్టో ప్రమాదం

వివరాల్లోకి వెళితే, రెండు మారుతి ఆల్టో కార్లు ఒకే వైపు ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యాయి. ప్రమాదం జరిగినపుడు ఈ కార్లలో తమిళనాడు లీగ్ క్రికెటర్లు ఉన్నట్లు తెలిసింది.

మారుతి ఆల్టో ప్రమాదం

ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు, తమిళనాడులోని నమక్కల్ పరిధిలోని పరమతి వేలూర్ వద్ద జాతీయ రహదారి మీద రెండు కార్లు ఒకదానినొకటి ఢీకొని వంతెన మీద నుండి క్రింద పడినట్లు తెలిసింది.

మారుతి ఆల్టో ప్రమాదం

పోలీసుల తెలిపిన వివరాలు ప్రకారం, రెండు ఆల్టో కార్లు అత్యధిక వేగంతో సేలం-మదురై జాతీయ రహదారి మీద వెళుతున్నపుడు కండంపాళ్యం సమీపంలో ఓ మహిళ అడ్డు రావడంతో ముందు వెళుతున్న కార్లు సడెన్ బ్రేకులు వేయడంతో వెనక నుండి వచ్చిన మరో ఆల్టో కారు అత్యదిక వేగంతో ఢీకొట్టింది.

మారుతి ఆల్టో ప్రమాదం

మహిళను తప్పించడం కోసం బ్రేకులు వేయడం, వెనక వస్తున్న డ్రైవర్ దీనిని గమనించకుండా బలంగా ఢీకొట్టడంతో రెండు కార్లు వంతెన మీద నుండి క్రింద పడిపోయాయి. ఈ ఘటనలో రెండు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

మారుతి ఆల్టో ప్రమాదం

ఈ ఘోర ప్రమాదంలో 26 ఏళ్ల వయస్సున్న తమిళనాడు యువ క్రికెటర్ డి ప్రభాకర్ ప్రాణాలు కోల్పోయాడు. పొంగల్ సందర్భంగా నమక్కల్‌లో జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌ ఆడిన తరువాత తిరుగు ప్రయాణంలో మితిమీరిన వేగానికి బలయ్యాడు.

Trending On DriveSpark Telugu:

రెండు లారీల మధ్య నలిగిపోయిన కారులో అందరూ సేఫ్!!

రోడ్డు మీద నుండి సెకండ్ ఫ్లోర్‌లోకి దూసుకెళ్లిన కారు: వీడియో

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం గురించి ఆసక్తికరమైన నిజాలు

మారుతి ఆల్టో ప్రమాదం

నమక్కల్‌లో జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో పాల్గొన్న బృందం హోటల్‌కు వెళుతున్న సందర్భంలో ఈ ప్రమాదం జరిగింది. ఫోటోలను గమనిస్తే, ఒక కారు మీద మరొకటి పడినట్లు స్పష్టంగా తెలుస్తోంది. రెండు కార్లు కూడా తీవ్రంగా నుజ్జునుజ్జయ్యాయి.

మారుతి ఆల్టో ప్రమాదం

పబ్లిక్ రోడ్ల మీద అతి వేగం అత్యంత ప్రమాదకరమైనదని చెప్పడానికి ఈ సంఘటనను మరో ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకించి మారుతి ఆల్టో వంటి కార్లలో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ మరియు తప్పనిసరి ఎయిర్‌బ్యాగ్ ఉండవు.

మారుతి ఆల్టో ప్రమాదం

ఒక వేళ కారులో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఫీచర్ ఉండి ఉంటే ఈ ప్రమాదాన్ని ఖచ్చితంగా అధిగమించే వారు. కానీ ఏబిఎస్ లేకపోవడంతో పరిమితికి మించిన వేగంతో ప్రయాణించడం ద్వారా ఇలా ఘోర ప్రమాదానికి గురయ్యారు.

మారుతి ఆల్టో ప్రమాదం

ఎలాంటి కారునైనా డ్రైవ్ చేయండి, ఓవర్ స్పీడింగ్ మరియు రేసింగ్ చేస్తే ఖచ్చితంగా ప్రమాదాల పాలవుతారు. ప్రత్యేకించి, జాతీయ రహదారుల మీద ప్రయాణిస్తున్నపుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. హైవేల మీద బైకులు మరియు పాదచారులు రోడ్డు దాటడాన్ని గమనిస్తూ ఉండాలి.

మారుతి ఆల్టో ప్రమాదం

దీనికి తోడు పరిమిత వేగంతో ప్రయాణిస్తే, అడ్డొచ్చిన వారిని ఢీకొట్టకుండా వెంటనే స్పందించి ప్రమాదాలను అధిగమించే అవకాశం ఉంటుంది. మితి మీరిన వేగంతో ప్రయాణించడం ద్వారా అవరోధాలను గుర్తించి స్పందించేలోపే ప్రమాదం జరిగిపోతుంది.

మారుతి ఆల్టో ప్రమాదం

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

మారుతి ఆల్టో ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ కారు, మరియు కేవలం టాప్ ఎండ్ వేరియంట్లో మాత్రమే ఆప్షనల్ డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ లభిస్తోంది. ఈ కారు యొక్క నిర్మాణ నాణ్యత అంత మెరుగ్గా ఉండదు, అందులో కూడా ఇలాంటి ప్రమాదాలను ఏ మాత్రం తట్టుకోలేదు. మితిమీరిన వేగంతో ప్రయాణించారు కాబట్టి, ఇక్కడ కారును మాత్రమే తప్పుబట్టలేము. ఎంత సురక్షితమైన కారును డ్రైవ్ చేసినా, ఇండియన్ రోడ్ల మీద పరిమిత వేగంతో మాత్రమే ప్రయాణించడం ముఖ్యం.

Trending DriveSpark Telugu YouTube Videos

Subscribe To DriveSpark Telugu YouTube Channel - Click Here

Image courtesy: Kavin Raj

English summary
Read In Telugu:Speeding Maruti Alto Falls Off Bridge In Tamil Nadu — Young Cricketer Dies

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark