స్విఫ్ట్ మీద బోల్తా పడిన 46 టన్నుల బరువున్న లారీ: ఐదుగురితో సహా రోడ్డుకు అతుక్కుపోయిన కారు

Written By:

పరిమితికి మించిన లోడ్‌తో ప్రయాణించే లారీలు మరియు ట్రక్కుల ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల కారణంతో ఇండియన్ రోడ్స్ మీద కొన్ని వేల మంది మరణిస్తున్నారు. ఈ ఘటనల్లో ఎలాంటి ప్రమేయం లేకుండా అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి.

మారుతి స్విఫ్ట్ మీద పడిపోయిన ఓవర్‌లోడ్ లారీ

మంగళవారం నాడు రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో ఛోము సర్కిల్ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో భారీ బరువున్న లారీ గరిష్ట వేగంలో ఉన్నపుడు స్విఫ్ట్ కారు మీదకు ఒరిగిపోవడంతో కారులో ఉన్న ఐదు మంది ప్రయాణికులతో సహా రోడ్డుకు అతుక్కుపోయింది.

ఎలా జరిగింది?

ఎలా జరిగింది?

స్విఫ్ట్ కారు మరియు లారీ ఒకదాని ప్రక్కన ఒకటి రోడ్డు మీద ప్రయాణిస్తున్నాయి. ఒక్కసారిగా లారీ ఎడమవైపు వాలిపోయి కారు మీదకు ఒరిగిపోయింది. ఈ లారీ ఉప్పు లోడ్‌తో మొత్తం 46 టన్నులు బరువు కలిగి ఉంది. ప్రమాదానంతరం కారు ఏ మాత్రం కనబడకుండా లారీ మరియు ఉప్పుతో కప్పబడిపోయింది.

మారుతి స్విఫ్ట్ మీద పడిపోయిన ఓవర్‌లోడ్ లారీ

పోలీసుల కథనం మేరకు కారు లారీ క్రింద సుమారుగా మూడు గంటల పాటు అలాగే ఉంది. క్రేన్ వచ్చిన లారీని తొలగించినపుడు మాత్రమే లారీ క్రింద కారు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు.

మారుతి స్విఫ్ట్ మీద పడిపోయిన ఓవర్‌లోడ్ లారీ

ఈ ప్రమాదం మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో సంభవించింది. బరువుకు రోడ్డుకు అతుక్కుపోయిన కారును ఉదయం ఆరు గంటలకు గుర్తించడం జరిగింది. అయితే అప్పటికే కారులో ఉన్న వారంతా మరణించారు.

మారుతి స్విఫ్ట్ మీద పడిపోయిన ఓవర్‌లోడ్ లారీ

ఈ ప్రమాదం గురించి పోలీసు అధికారి మీడియాతో మాట్లాడుతూ, "తొలుత ఇది సాధారణ ప్రమాదంగా పరిగణించాము. అధిక లోడ్ మరియు ప్రమాదకరమైన మలుపు కారణంగా బోల్తాపడిందని ఊహించాము. అయితే, క్రేన్ సాయంతో లారీని తొలగించిన తరువాత రోడ్డుకు అతుక్కుపోయిన స్విఫ్ట్ కారును గుర్తించినట్లు వివరించాడు". ఈ ప్రమాదంలో కారులో ఉన్న వారంతా మరణించారని ఆయన మీడియాకు వివరించారు.

మారుతి స్విఫ్ట్ మీద పడిపోయిన ఓవర్‌లోడ్ లారీ

ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఐదు ప్రయాణిస్తున్నారు. అందరూ ఒకే కుటుంబ సభ్యులు. వీరిలో నిశ్చితార్థం జరిగిన ఓ జంట మరియు మిగతా ముగ్గురు ఉన్నారు. పర్వతం మీద ఉన్న నాహర్‌ఘర్ కోట మీద నుండి సూర్యోదయాన్ని వీక్షించేందుకు వెళుతున్నట్లు తెలిసింది.

మారుతి స్విఫ్ట్ మీద పడిపోయిన ఓవర్‌లోడ్ లారీ

లారీ రూపంలో వచ్చిన మృత్యువు అందరినీ కబళించి సూర్యోదయానికి ముందే కానరానిలోకాలకు తీసుకెళ్లింది. అధిక బరువున్న లారీ కావడంతో కారు మొత్తం ఒక షీట్ మెటల్ రేకులా రోడ్డుకు అతుక్కుపోయింది. అందులో ప్రయాణికులందరూ నుజ్జునజ్జుయిపోయి అత్తుకుపోయారు.

మారుతి స్విఫ్ట్ మీద పడిపోయిన ఓవర్‌లోడ్ లారీ

ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ మరియు లారీ క్లీనర్ ఘటనా స్థలి నుండి పరారయ్యారు. పోలీసుల తెలిపిన కథనం మేరకు, లారీ ఓవర్ లోడ్‌తో అధిక వేగంతో ప్రయాణిస్తున్నపుడు డ్రైవర్ షడన్ బ్రేకులు వేయడంతో అదుపు తప్పి కారు మీదకు పడిపోయిందని పోలీసులు తెలిపారు.

ఓవర్ లోడెడ్ వెహికల్స్

ఓవర్ లోడెడ్ వెహికల్స్

దేశంలో ఏ మూలకెళ్లినా పరిమితి మించిన లోడ్‌తో లారీలు మరియు ట్రక్కులకు కొదవేలేదు. ఇండియాలో అన్ని రోడ్ల మీద అన్ని వాహనాలకు పరిమితి ఉండటంతో ఇలాంటి ఓవర్ లోడెడ్ వెహికల్స్ ద్వారా ప్రమాదాలు రోజు రోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో సురక్షితమైన ప్రయాణం కోసం కొన్ని చిట్కాలు...

మారుతి స్విఫ్ట్ మీద పడిపోయిన ఓవర్‌లోడ్ లారీ

అత్యధిక బరువుతో ఉన్న ఓవర్ లోడెడ్ వాహనాలకు సమీపంగా డ్రైవ్ చేయకండి. ఆ వాహనాలు నెమ్మదిగా ప్రయాణిస్తున్నప్పుటికీ చాలా భయంకరమైనవి. అవి మీద పడితే ప్రమాదం తీవ్రత అధికంగా ఉంటుంది.

మారుతి స్విఫ్ట్ మీద పడిపోయిన ఓవర్‌లోడ్ లారీ

ఓవర్ లోడ్‌తో ఉన్న వాహనాలను దాటవేయడానికి (ఓవర్ టేక్) ఎక్కువ సమయం తీసుకోకండి. అలాంటి వాహనాల ప్రక్కన ఎక్కువ సేపు ప్రయాణించడాన్ని ఆపి వేగంగా ఓవర్ టేక్ చేయడం ఉత్తమం.

మారుతి స్విఫ్ట్ మీద పడిపోయిన ఓవర్‌లోడ్ లారీ

ఒక వేళ మీరు ప్రయాణిస్తున్న వాహనానికి అలాంటి ఓవర్‌ లోడెడ్ వాహనాలు దగ్గరగా వచ్చినపుడు, వాటికి దారివ్వడం లేదా వాటికి దూరంగా నడపడం మంచిది. ఎందుకంటే లారీలకు బ్రేకింగ్ పవర్ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో వెనుక నుండి మీ వాహనాలను ఢీకొట్టే అవకాశం ఉంటుంది.

మారుతి స్విఫ్ట్ మీద పడిపోయిన ఓవర్‌లోడ్ లారీ

ఇది అతి ముఖ్యమైనది, మలుపుల్లో భారీ బరువున్న, పెద్ద పరిమాణంలో ఉన్న మరియు ఓవర్ లోడెడ్ వాహనాలను ఓవర్‌టేక్ చేయకండి. మలుపుల్లో ఒకే వేగం వద్ద వారు టర్నింగ్ తీసుకుంటారు తద్వారా లారీలు బోల్తా పడే అవకాశాలు ఎక్కువ. స్విఫ్ట్ మీద బోల్తా పడిన లారీ ఘటనకు కూడా ఇదే కారణం. కాబట్టి ఓవర్ లోడ్ ఉన్న వాహనాలను గమనిస్తూ సురక్షితంగా ప్రయాణించండి.

English summary
Read In Telugu Maruti Swift Crushed In An Accident

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark