హురాకాన్ కారును డెలివరీ తీసుకున్న నిమిషాల్లోనే ఢీకొట్టింది; ఎంతైనా MLA పెళ్లాం కదా

Written By:

ముంబాయ్‌లో ఒక మహిళ లాంబోర్గిని హురాకాన్ కారును డెలివరీ తీసుకున్న కేవలం నిమిషాల వ్యవధిలోనే డ్యాష్ ఇచ్చింది. డ్రైవింగ్ చేసే సమయంలో అదుపు తప్పి ఒక ఆటోని ఢీకొట్టింది.

ముంబాయ్‌లోని ఒక ప్రాంతం యొక్క ఎమ్‌ఎల్ఎ భార్య అప్పుడే అత్యంత ఖరీదైన ఇటాలియన్‌కు చెందిన లాంబోర్గిని వారి హురాకాన్ సూపర్‌ కారును డెలివరీ తీసుకుని అలా రోడ్డెక్కింది. అయితే ఒక్క సారిగా కంట్రోల్ కోల్పోయి రోడ్డు మీద ఉన్న ఆటో మీదకు దూసుకెళ్లింది.

Also Read: ఫ్యూచర్ మొత్తం ఎస్‌యువిలదే !! వరుసగా విడుదలకు సిద్దమైన SUVలు

ఈ లాంబోర్గిని వారి హురాకాన్ సూపర్ కారులో 5.2-లీటర్ సామర్థ్యం ఉన్న న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ వి10 ఇంజన్ కలదు, ఇది సుమారుగా 610బిహెచ్‌పి పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 3.2 సెకండ్ల కాలంలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. అయితే హురాకాన్‌ను డెలివరీ ఇచ్చిన డీలర్ మాట్లాడుతూ ఆమె కంట్రోల్ కోల్పోవడం వల్లనే ఇలా జరిగినట్లు తెలిపాడు. అయితే ఏ విధమైన నష్టం వాటిల్లలేదు. క్రాష్‌కు సంభందించిన వీడియోను వీక్షించగలరు.

 

English summary
Video: Watch This MLA's Wife Crash Her Huracan Within Minutes After Delivery!
Please Wait while comments are loading...

Latest Photos