మారుతి డీలర్ వద్ద ధోని ల్యాండ్ రోవర్ ఎందుకు ఉంది? వివరంగా...

Written By:

కూల్ కెప్టెన్‌గా పేరు గడించిన ఎమ్‌ఎస్ ధోనికి వెహికల్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. టూ వీలర్ గానీ, ఫోర్ వీలర్ గానీ క్రికెట్ తర్వాత అత్యంత ఇష్టమైనది వెహికల్(కార్లు, బైకులు). ధోనీ వద్ద ఉన్న వాహనాల్లో కొన్ని అత్యంత ఖరీదైన ఇంపోర్టెడ్ వెహికల్స్ ఉన్నాయి.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
మారుతి డీలర్ వద్ద ధోని ల్యాండ్ రోవర్‌కు పనేంటి

నిజానికి ధోనికి తన వద్ద ఉన్న వాహనాలకు ఎదురయ్యే చిన్న రిపేర్లు మరియు సర్వీసింగ్ తనంతట తానుగా నిర్వహిస్తుంటాడు. అన్ని వాహనాలను మంచి కండీషన్‌లో ఉంచుకోవడానికి ఖాలీగా సమయం దొరికినప్పుడల్లా హాబీలా రిపేరీ చేసుకుంటూ ఉంటాడు.

మారుతి డీలర్ వద్ద ధోని ల్యాండ్ రోవర్‌కు పనేంటి

తన సొంతూరు రాంచీలో ఖరీదైన కార్లకు సర్వీసింగ్ మరియు రిపేరీ సౌకర్యం లేదు. మరి అలాంటి వాటికి సర్వీసింగ్ ఎలా చేయిస్తాడనేది ప్రశ్న? కార్లలో ప్రధాన సమస్యలు తలెత్తితే ధోని ఏం చేస్తాడు అనే విషయం గురించి ఆరా తీస్తే, మారుతి డీలర్ వద్ద ధోనికి చెందిన ల్యాండో రోవర్ ఫ్రీ ల్యాండర్ కారు దర్శనమిచ్చింది.

మారుతి డీలర్ వద్ద ధోని ల్యాండ్ రోవర్‌కు పనేంటి

ధోని వద్ద ఉన్న అత్యంత ఖరీదైన కార్ల నుండి సాధారణ వెహికల్స్ వరకూ అన్నింటికీ రాంచీలో ఉన్న మారుతి సుజుకి షోరూమ్‌లో సర్వీసింగ్ చేస్తాడని తెలిసింది. ఇతర తయారీ దారులకు చెందిన వాహనాలకు సర్వీసింగ్ నిర్వహించడానికి డీలర్లు వెనుకాడుతారు, మరి రాంచీలో ఎలా సాధ్యం?

మారుతి డీలర్ వద్ద ధోని ల్యాండ్ రోవర్‌కు పనేంటి

మారుతి డీలర్ మరియు ధోని మధ్య సంత్సంభందాలు ఉండటం చేత కేవలం ధోని కార్లకు మాత్రమే ఈ అవకాశాన్ని ఇచ్చాడు మారుతి డీలర్. తద్వారా ధోనికి చెందిన దాదాపు అన్ని వాహనాలకు పూర్తి స్థాయి సర్వీసింగ్ మరియు రిపేరీ పనులు ఇక్కడే జరుగుతాయి. మరియు ఈ డీలర్ వద్ద నైపుణ్యం ఉన్న టెక్నీషియన్లకు కొదవేలేదు.

మారుతి డీలర్ వద్ద ధోని ల్యాండ్ రోవర్‌కు పనేంటి

ల్యాండ్ రోవర్‌ ఫ్రీల్యాండర్ ఎస్‌యూవీ రాంచీలోని మారుతి సుజుకి సర్వీసింగ్ సెంటర్ గడపతొక్కి మీడియా కంటపడింది. ఆ ఫోటోలలో ఫ్రీల్యాండర్ ఎస్‌యూవీతో పాటు మారుతి 800 మరియు సియాజ్ లను గుర్తించడం జరిగింది.

మారుతి డీలర్ వద్ద ధోని ల్యాండ్ రోవర్‌కు పనేంటి

ఇది తొలిసారి కాదు, గతంలో కూడా ఎమ్‌ఎస్ ధోని తన వాహనాలకు రాంచీ మారుతి డీలర్ వద్ద పలుమార్లు సర్వీసింగ్ నిర్వహించాడు. అందులో ఒకటి, మహీంద్రా స్కార్పియోతో మారుతి డీలర్ వద్ద కంటబడింది.

మారుతి డీలర్ వద్ద ధోని ల్యాండ్ రోవర్‌కు పనేంటి

మోడిఫికేషన్ చేసిన ఓపెన్ రూఫ్ టాప్‌ డిజైన్ శైలిలో ఉన్న స్కార్పియో ఎస్‌యూవీని రాంచీ మారుతి సుజుకి సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి, ఇందులో తలెత్తిన స్వల్ప రిపేరీలను సరిచేయించారు. క్యాబిన్ క్లీనింగ్ మరియు పనిచేయని టుర్బో ఛార్జర్‌కు రిపేరీ చేయించినట్లు తెలిసింది.

English summary
Read In Telugu To Know About What’s MS Dhoni’s Land Rover doing at a Maruti service center: We explain
Story first published: Tuesday, June 6, 2017, 17:47 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark