ముఖేష్ అంబానీ డ్రైవర్ నెలసరి వేతనం ఎంతో తెలుసా...?

Written By:

ముఖేష్ అంబానీ దిగ్గజ పారిశ్రామిక వేత్తగా ఎందో మందికి తెలుసు. అయితే, జియో ప్రారంభంతో ప్రతి రోజూ ఏదోరకంగా వార్తల్లో నిలుస్తున్నాడు. ముఖేష్ అంబానీ కారణంగా ఇప్పుడు ఆయన డ్రైవర్ కూడా వార్తల్లోకెక్కాడు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
ముఖేష్ అంబానీ డ్రైవర్ నెలసరి వేతనం

సాధారణంగా ఓ డ్రైవర్ నెలసరి వేతనం ఎంత వరకు ఉంటుంది, మహా అయితే గరిష్టంగా 15 నుండి 20 వేల వరకు ఉండవచ్చు. అయితే, సెలబ్రిటీలు మరియు వ్యాపార వేత్తల కార్ల డ్రైవర్ల వేతనం ఎంత ఉంటుందో ఎప్పుడైనా ఊహించారా....? ఇవాళ్టి కథనంలో భారతదేశపు అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ వ్యక్తిగత కారు డ్రైవర్ నెలసరి వేతనం ఎంతో చూద్దాం రండి....

ముఖేష్ అంబానీ డ్రైవర్ నెలసరి వేతనం

భారతదేశపు అత్యంత సంపన్నుడిగా మరియు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతగా ముఖేష్ ధీరూబాయ్ అంబానీ తెలియని వారుండరు. ప్రపంచ మరియు దేశ ఆర్థిక, వాణిజ్య మరియు పారిశ్రామిక రంగాలలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి ముఖేష్ అంబానీ.

ముఖేష్ అంబానీ డ్రైవర్ నెలసరి వేతనం

ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ పేరుగాంచిన మహిళా వ్యాపారవేత్తగా రాణిస్తున్నారు. ఇండియాలో క్రీడలను ప్రోత్సహించడంలో నీతా అంబానీ ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు మరియు స్వయంగా పాల్గొంటారు కూడా. అంతే కాకుండా నీతా అంబానీ పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తోంది.

ముఖేష్ అంబానీ డ్రైవర్ నెలసరి వేతనం

ముఖేష్ అంబానీ విలాసవంతమైన జీవితం

కొన్ని లక్షల కోట్ల రుపాయలకు అధిపతి అయినప్పటికీ నలుగుర్లోకి వచ్చినపుడు ముఖేష్ అంబానీ చూడటానికి చాలా సింపుల్‌గా ఉంటాడు. అయితే, ఇళ్లు, కార్లు మరియు విలాసవంతమైన లైఫ్ స్టైల్ విషయానికి వస్తే ప్రపంచంలో ఇలాంటి జీవితం గడిపేవారు చాలా అరుదుగా ఉంటారు.

ముఖేష్ అంబానీ డ్రైవర్ నెలసరి వేతనం

దేశ ఆర్థిక రాజధాని ముంబాయ్‌లో ముఖేష్ అంబానీకి ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన, అందమైన, సురక్షితమైన మరియు ఖరీదైన ఇళ్లు కలదు. ముంబాయ్ నగర నడిబొడ్డున ఉన్న ఈ ఇంటిని చూడటానికి టూరిస్టుల తాకిడి అధికంగా ఉంటుంది.

Trending On DriveSpark Telugu:

విమాన ప్రయాణంలో పైలట్లు మరియు ఎయిర్ హోస్టెస్ చేసే 20 ఆసక్తికరమైన పనులు

దెయ్యాలు తిరిగే ఈ రోడ్ల మీదకు వెళితే తిరిగి రావడం కష్టమే

ఇండియాలో అత్యంత దూరం ప్రయాణించే బస్సు సర్వీసు

క్షణకాలంలో పాకిస్తాన్‌ను బూడిద చేయగల భారతదేశపు శక్తివంతమైన 10 యుద్ద విమానాలు

ముఖేష్ అంబానీ డ్రైవర్ నెలసరి వేతనం

ముఖేష్ అంబానీ కార్లు

ముఖేష్ అంబానీ ఇళ్లు మొత్తం 27 ఫ్లోర్లు కలిగి ఉంది. ఈ 27 లో ఆరు ఫ్లోర్లను అంబానీ కార్లు కోసం కేటాయించాడు. ఈ కార్లన్నీ కూడా ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లు. ముఖేష్ అంబానీకి ఎంతో ఇష్టమైన బిఎమ్‌డబ్ల్యూ 760ఎల్ఐ ఆర్మ్డ్ లగ్జరీ కారుతో పాటు సుమారుగా 168 లగ్జరీ కార్లు ఉన్నాయి.

ముఖేష్ అంబానీ డ్రైవర్ నెలసరి వేతనం

ఒక్క కుటుంబం వాడే కార్లు ఆరు ఫ్లోర్లలో ఉన్నాయంటే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ ఇది అక్షరాలా నిజం. ముఖేష్ అంబానీ కార్లు, విమానాలు మరియు లగ్జరీ షిప్పులు గురించి మరిన్ని వివరాల కోసం....

ముఖేష్ అంబానీ డ్రైవర్ నెలసరి వేతనం

ముఖేష్ అంబానీ కారు డ్రైవర్ నెలసరి వేతనం

ముఖేష్ అంబానీ తన డ్రైవర్‌కు జీతం ఇచ్చినపుడు తీసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఆ వీడియో ప్రకారం, ముఖేష్ అంబానీ డ్రైవర్‌ నెలకు అక్షరాలా రెండు లక్షల రుపాయల వేతనం అందుకొంటున్నాడు.

ముఖేష్ అంబానీ డ్రైవర్ నెలసరి వేతనం

ఇది కూడా నమ్మశక్యంగా ఉండదు. ఒక డ్రైవర్‌కు రెండు లక్షలేంటని చాలా మంది అనుకోవచ్చు. కానీ ఇది నిజం. ముఖేష్ అంబానీ కారు డ్రైవర్ నెలకు రెండు లక్షల చెప్పున ఏడాదికి 24,00,000 రుపాయల ప్యాకేజ్ అందుకొంటున్నాడు. ఈ ప్యాకేజి ఇండియాలో మేనేజర్ స్థాయి సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల ప్యాకేజ్‌కు సమానం కావడం గమనార్హం.

English summary
Read In Telugu: Mukesh Ambani Driver Salary
Please Wait while comments are loading...

Latest Photos