ప్రపంచ రికార్డు సృష్టించిన ముంబాయ్ ఎయిర్‌పోర్ట్: 24 గంటల్లో 969 విమానాలు

Written By:

దేశ ఆర్థిక రాజధాని ముంబాయ్ మహానగరంలో ఉన్న ఛత్రపతి శివాజీ టెర్మినస్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచ రికార్డును నెలకొల్పింది. సరిగ్గా 24 గంటల్లోపే 969 విమానాలు ఈ ఎయిర్‌పోర్ట్ నుండి రాకపోకలు సాగించాయి.

ముంబాయ్ ఎయిర్‌పోర్ట్ ప్రపంచ రికార్డ్

ఒక్కరోజులో ఈ తరహా రాకపోకలు సాగించిన విమానాశ్రయం ఇదొక్కటే. అత్యధిక విమానాలతో రాకపోకలకు నిలయమైన ముంబాయ్ విమానాశ్రయం గతంలో నెలకొల్పిన రికార్డును, ఇప్పుడు తాజా రికార్డుతో బద్దలుకొట్టింది.

ముంబాయ్ ఎయిర్‌పోర్ట్ ప్రపంచ రికార్డ్

నవంబర్ 24, 2017న ఉదయం 5.30 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 5.30 గంటల మధ్య(24 గంటలు) 969 విమానాలకు ల్యాండింగ్ మరియు టేకాఫ్ ఇచ్చి రికార్డు సృష్టించింది. గతంలో ఇదే విమానాశ్రయం మే 2017 లో 935 విమానాలతో నెలకొల్పిన రికార్డును తాజాగా రికార్డ్‌తో బ్రేక్ చేసింది.

ముంబాయ్ ఎయిర్‌పోర్ట్ ప్రపంచ రికార్డ్

రికార్డు స్థాయిలో విమానాలు ల్యాండింగ్ మరియు టేకాఫ్ తీసుకోవడానికి ప్రధాన కారణం షెడ్యూల్ చేసుకోని ప్రయివేట్ విమానాలు మధ్యాహ్న సమయంలో అధికంగా వచ్చిపోతున్నాయని ముంబాయ్ విమానాశ్రయ నిర్వాహకులు మరియు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది.

ముంబాయ్ ఎయిర్‌పోర్ట్ ప్రపంచ రికార్డ్

ముంబాయ్ విమానాశ్రయంలో సింగల్ రన్‌వే మీద విమానాల ల్యాండింగ్ మరియు టేకాఫ్ విషయంలో ప్రపంచ రికార్డును సాధించడం గొప్ప విజయమనే చెప్పాలి.

ముంబాయ్ ఎయిర్‌పోర్ట్ ప్రపంచ రికార్డ్

నిజానికి రెండు రన్‌వేలు వివియోగంలో ఉన్నాయి. అయితే, అత్యంత అనువుగా ఉన్న ఒక రన్‌వేను మాత్రమే ఎక్కువగా వినియోగిస్తున్నారు.

ముంబాయ్ ఎయిర్‌పోర్ట్ ప్రపంచ రికార్డ్

ముంబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ ఆపరేటర్‌ ఈ ప్రపంచ రికార్డును ఖాయం చేశారు మరియు భవిష్యత్తులో 24 గంటల్లో 1000 విమానాల రికార్డును సాధించే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపాడు.

ముంబాయ్ ఎయిర్‌పోర్ట్ ప్రపంచ రికార్డ్

ముంబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సంవత్సరానికి 450 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. మరియు 2018 మార్చి నాటికి ఈ సంఖ్య 480 లక్షలకు చేరుకోనుంది.

ముంబాయ్ ఎయిర్‌పోర్ట్ ప్రపంచ రికార్డ్

ముంబాయ్ విమానాశ్రయం ఇంగ్లాడులోని గ్యాట్‌విక్ విమానాశ్రయం కంటే అత్యంత రద్దీతో కూడుకున్నద్ది. గ్యాట్‌విక్ విమానాశ్రయం ఏడాదికి 440 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. మరియు దీని రోజూవారీ టేకాఫ్‌లు 46 మాత్రమే.

ముంబాయ్ ఎయిర్‌పోర్ట్ ప్రపంచ రికార్డ్

ముంబాయ్ ఎయిర్‌పోర్ట్‌లోని ప్రధాన రన్‌వే మీదనే అన్ని విమానాలు టేకాఫ్ మరియు ల్యాండ్ అవుతున్నాయి. రెండవ రన్‌వేను అత్యవసర పరిస్థితుల్లో వాడుతున్నారు మరియు మెయిన్ రన్‌వే మీద విమానాలు రిపేరికి వచ్చినపుడు రెండవ రన్‌వేను వినియోగిస్తున్నారు.

English summary
Read In Telugu: Mumbai Airport Sets World Record with 969 take offs and landings in 24 hours

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark