స్వయంగా విమానాన్ని నిర్మించి ప్రభుత్వం నుండి ఫ్లయింగ్ లైసెన్స్ పొందాడు: నమ్మశక్యంగా లేదా...?

Written By:

ఫ్లయింగ్ లైసెన్స్ పొందడం డ్రైవింగ్ లైసెన్స్ పొందినంత తేలికేం కాదు. అత్యంత కఠినమైన శిక్షణ మరియు ఫ్లయింగ్ టెస్ట్ పూర్తయితే గానీ విమానం నడపడానికి అర్హత లభించదు.

అయికే, ఇవాళ్టి స్టోరీలో మీకు పరిచయం చేస్తున్న ముంబాయ్‌కు చెందిన అమోల్ యాదవ్ పైలట్ లైసెన్స్ కోసం విన్నూత్నంగా ఆలోచించి, ప్రభుత్వమే స్వయంగా పైలెట్ లైసెన్స్ ఇచ్చేలా మార్చుకున్నాడు. అవును, ఈ వ్యక్తి తన ఇంటిపైన స్వయంగా ఓ విమానాన్ని నిర్మించి పైలెట్ లైసెన్స్ సంపాదించాడు.

ఫ్లయింగ్ లైసెన్స్ కోసం ఏకంగా విమానాన్నే తయారు చేశాడు

అమోల్ యాదవ్ సుమారుగా 4 కోట్ల రుపాయలు వెచ్చించి స్వయంగా, సొంత పరిజ్ఞానంతో విమానాన్ని నిర్మించాడు. తాను నిర్మించిన విమానం గురించి మోడీ గారికి తెలియజేయాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను కోరగా, ఆయన ఈ విషయాన్ని మోడీ దృష్టికి తీసుకెళ్లి సహాయం చేశారు.

Recommended Video - Watch Now!
[Telugu] Jeep Compass Launched In India - DriveSpark
ఫ్లయింగ్ లైసెన్స్ కోసం ఏకంగా విమానాన్నే తయారు చేశాడు

దీంతో, ఆ విమానానికి VT-NMD అనే పేరు పెట్టారు. దీని అర్థం ఏంటో తెలుసా....? విక్టర్ టాంగో నరేంద్ర మోడీ దేవేంద్ర వరుసగా ప్రధాన మంత్రి మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి పేర్లు వచ్చేలా VT-NMD పేరుతో నామకరణం చేశాడు.

ఫ్లయింగ్ లైసెన్స్ కోసం ఏకంగా విమానాన్నే తయారు చేశాడు

తన అధ్బుతమైన మేధస్సుకు మరియు విజయవంతమైన ప్రయోగానికి గుర్తుగా అమోల్ యాదవ్ ఎంతో కాలంగా కోరుకుంటున్న పైలట్ లైసెన్స్ సర్టిఫికేట్‌ను డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సర్టిఫికేట్‌ను సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ యాదవ్‌కు స్వయంగా అందించాడు.

ఫ్లయింగ్ లైసెన్స్ కోసం ఏకంగా విమానాన్నే తయారు చేశాడు

అమోల్ యాదవ్ నిర్మించిన విమానం విషయానికి వస్తే, ఆరు మంది కూర్చునే విమానం గరిష్టంగా 13,000 అడుగుల ఎత్తును చేరుకుంటుంది. గంటకు 185 నాట్స్(గంటకు 342కిమీలు) వేగంతో ప్రయాణించే దీని గరిష్ట పరిధి 2,000 కిలోమీటర్లుగా ఉంది.

ఫ్లయింగ్ లైసెన్స్ కోసం ఏకంగా విమానాన్నే తయారు చేశాడు

ఇంటి పై కప్పు మీద అమోకల్ యాదవ్ ఇలాంటి విమానాన్ని తయారు చేయడం నిజంగా అద్బుతమైన ప్రయోగం అని చెప్పవచ్చు. దేశ ఆర్థిక రాజధాని ముంబాయ్‌లోని కండివాలిలో ఉన్న తన నివాసంలో రూపొందించాడు. ఇప్పుడు ఒకేసారి 20 మంది ప్రయాణించే వీలున్న విమానాన్ని తయారు చేయడానికి సిద్దమవుతున్నట్లు యాదవ్ తెలిపాడు.

ఫ్లయింగ్ లైసెన్స్ కోసం ఏకంగా విమానాన్నే తయారు చేశాడు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా అమోల్ యాదవ్ తన మేధస్సుతో స్వతహాగా విమానాన్ని నిర్మించి భారత ప్రభుత్వం నుండి పైలట్ లైసెన్స్ పొందాడు. నిజానికి డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినంత సులభంగా పైలట్ లైసెన్స్ రాదు. అలాంటిది, మహారాష్ట సీఎం మరియు ప్రధాన మంత్రి నరేంద్ర మేడీని తన ఆవిష్కరణతో విస్తుపోయేలా చేసి, వారి అనుమతులతో అధికారికంగా పైలెట్ లైసెన్స్ పొందాడు.

English summary
Read In Telugu: This Man Built His Own Airplane To Earn Flying Licence
Story first published: Friday, November 24, 2017, 16:47 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark