జీ20 సదస్సులో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ' ప్రత్యేకమైన కారు - దాని విశేషాలు

ఇటీవల ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 సమ్మిట్‌కి భారతదేశం తరపున దేశ ప్రధాని 'నరేంద్ర మోదీ' హాజరైన విషయం తెలిసిందే. ఈ సమావేశంలో మొత్తం 20 దేశాల నుంచి ఆ దేశాలకు చెందిన అగ్ర నేతలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి మోదీ హ్యుందాయ్ కంపెనీ యొక్క జెనెసిస్ ఎలెక్ట్రిఫైడ్ జి 80 కారులో వెళ్లారు. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.

జీ20 సదస్సులో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ'కి ప్రత్యేకమైన కారు - దాని విశేషాలు ఏమిటంటే?

జెనెసిస్ ఎలక్ట్రిఫైడ్ G80 అనేది హ్యుందాయ్ కంపెనీకి చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కారు. ఈ ఎలక్ట్రిక్ కారు పూర్తిగా బ్లాక్ కలర్ లో చాలా ఆకర్షణీయంగా ఉంది. అదే సమయంలో మోదీ యొక్క ఎస్కార్ట్ లో హ్యుందాయ్ కంపెనీ యొక్క ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి.

జీ20 సదస్సులో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ'కి ప్రత్యేకమైన కారు - దాని విశేషాలు ఏమిటంటే?

నిజానికి హ్యుందాయ్ కంపెనీ యొక్క లగ్జరీ కార్లను గురించి మనదేశంలో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ కంపెనీ అత్యంత ఖరీదైన లగ్జరీ కార్ల ఉత్పత్తిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈ జెనెసిస్ ఎలక్ట్రిఫైడ్ G80 తీసుకువచ్చింది. ఈ ఎలక్ట్రిక్ కారు ఉత్తమమైన పనితీరుని అందించడానికి కంపెనీ డ్యూయల్ మోటార్ సెటప్ ఉపయోగించబడింది. ఇందులోని మోటార్ కెపాసిటీ 136 కిలోవాట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

జీ20 సదస్సులో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ'కి ప్రత్యేకమైన కారు - దాని విశేషాలు ఏమిటంటే?

జెనెసిస్ ఎలక్ట్రిఫైడ్ G80 ఎలక్ట్రిక్ కారులోని మోటార్ 370 పిఎస్ పవర్ మరియు 700 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 87.2 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ అందుబాటులో ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 520 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని నిర్దారించబడింది.

జీ20 సదస్సులో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ'కి ప్రత్యేకమైన కారు - దాని విశేషాలు ఏమిటంటే?

ఈ ఎలక్ట్రిక్ కారు ఉత్తమైన రేంజ్ అందించడమే కాకుండా, అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో క్లోజ్డ్ ఫ్రంట్ గ్రిల్, ఆల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్ మరియు సోలార్ విండో ప్యానెల్స్ వంటివి ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్ లో 19 ఇంచెస్ మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద అద్భుతంగా ఉంటుంది.

జీ20 సదస్సులో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ'కి ప్రత్యేకమైన కారు - దాని విశేషాలు ఏమిటంటే?

ఇక ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 8 ఇంచెస్ TFT ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, యాంబియంట్ లైటింగ్, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ కోసం టచ్-కంట్రోల్డ్ ప్యానెల్, 14.5 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 17 స్పీకర్ లెక్సికాన్ ఆడియో సిస్టమ్, హీటింగ్ మరియు వెంటిలేషన్ ఫంక్షన్లతో 12 వే పవర్-అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు వంటి మరెన్నో ఆధునిక ఫీచర్స్ ఇందులో అందుబాటులో ఉంటాయి.

జీ20 సదస్సులో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ'కి ప్రత్యేకమైన కారు - దాని విశేషాలు ఏమిటంటే?

మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ వంటి వాటితో పాటు ఇందులో ఆధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కారణంగానే ప్రపంచంలోని చాలా దేశాధినేతలు ఈ కార్లను వినియోగించడానికి ఆసక్తి చూపుతారు.

కాగా ఈ లగ్జరీ సేఫ్టీ ఎలక్ట్రిక్ కారు ఇంకా భారతీయ మార్కెట్లో విడుదలకాలేదు. కాగా ఇది భారతీయ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే చాలా పుకార్లు వచ్చాయి. కానీ దీనిపైన కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కావున ఈ ఎలక్ట్రిక్ కారు దేశీయ మార్కెట్లో విడుదలవుతుందా లేదా అనే దానిపైన ఎలాంటి ఖచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు.

జీ20 సదస్సులో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ'కి ప్రత్యేకమైన కారు - దాని విశేషాలు ఏమిటంటే?

ఇదిలా ఉండగా భారతీయ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ యొక్క ఐయోనిక్ 5 ఎలక్ట్రిక్ కారు 2023 ప్రారభంభంలో విడుదలయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు దేశీయ విఫణిలో ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ పొందుతోంది. ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 354 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుందని ధృవీకరించబడింది.

జీ20 సదస్సులో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ'కి ప్రత్యేకమైన కారు - దాని విశేషాలు ఏమిటంటే?

ఇటీవల జరిగిన జీ20 సమ్మిట్‌లో నరేంద్ర మోదీ మొదటిసారి యుకె ప్రధాన మంత్రి రిషి సునక్ ను కలిశారు. సమ్మిట్ ప్రారంభానికి ముందు మోదీ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ లను కూడా కలిశారు. అయితే రిషి సునాక్ ప్రధానమంత్రి అయిన తరువాత మోదీని కలవడం ఇదే మొదటిసారి.

జీ20 సదస్సులో భారత ప్రధాని 'నరేంద్ర మోదీ'కి ప్రత్యేకమైన కారు - దాని విశేషాలు ఏమిటంటే?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

సాధారణంగా ప్రతి దేశం ఆ దేశం యొక్క ప్రధాన మంత్రికి కట్టుదిట్టమైన భద్రతలను కల్పిస్తాయి. ఇతర దేశాల్లో కూడా ఈ భద్రత అలాగే సాగుతుంది. ఇందులో భాగంగానే నరేంద్ర మోదీకి ఒక పటిష్టమైన భద్రతలు కలిగి ఉన్న ఆధునిక లగ్జరీ కారుని కేటాయించారు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడంతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Narendra modi attending g20 in hyundai genesis details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X