300 టన్నుల బంగారు రైలును చేజిక్కించుకోవాలనే వారి కోరిక తీరుతుందా ?

Written By:

రెండవ ప్రపంచ యుద్దం కాలంలో నాజీయుల నేత హిట్లర్ పోలాండ్ మీద దండెత్తిన అనంతరం ఆ దేశంలో కొల్లగొట్టిన సంపదను ఒక రైలులో భద్రపరిచి జర్మన్ తరలించాలని సైన్యానికి ఆజ్ఞాపించాడు. అయితే, ఆ రైలు అనుమానస్పదంగా కనిపించకుండా పోయింది. గుప్త నిధుల వేటలో బాగా చేయి తిరిగిన ఓ ఇద్దరు వేటగాళ్లు, ఈ రైలు ఉన్న ప్రదేశం మాకు తెలిసింది, త్వరలో దానిని వెలికి తీస్తామని తెలిపారు. ఈ సందర్బంలో దీని గురించి ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన వార్తలు వెలువడ్డాయి. ఈ నాటి మన రైలు సెక్షన్‌లో నాజీయుల బంగారపు రైలు గురించి తెలుసుకుందాం రండి.

300 టన్నుల బంగారు రైలు

మానవ ప్రపంచంలో అత్యంత ఘోరమైన దాడులు జరిగిన కాలం అది. సుమారుగా 1945 సంవత్సరం కాలంలో ప్రపంచం మొత్తం భయానక దాడులతో అట్టుడికిపోయింది. ఇందులో లక్షల మంది చనిపోతే కొన్ని లక్షల కోట్ల సంపదను కొలగొట్టారు. అందుకు ఉదాహరణ నాజీయుల దోపిడీ.

300 టన్నుల బంగారు రైలు

జర్మనీకి చెందిన నాజీయుల సైన్యం రెండవ ప్రపంచ యుద్దంలో భాగంగా పోలాండ్ దేశానికి వచ్చి పోలాడ్ సంతతి ప్రజల మీద దాడులు చేసారు.

300 టన్నుల బంగారు రైలు

నాజీయుల తిరుగు ప్రయాణంలో పోలాండ్‌లోని బంగారం, వజ్రాలు, వైఢుర్యాలు, ధనం మరియు ఆయుధాలను దోచుకుని ఒక రైలులో నింపారు.

300 టన్నుల బంగారు రైలు

నాజీయుల మొత్తం సంపదతో పోలాండ్‌ నుండి జర్మనీ వెళుతున్న సమయంలో పోలాడ్ వాసులు ఈ రైలు మీద వ్రోక్లావ్ మరియు వాల్‌బ్రిజిక్ అనే నగరాల మధ్య అడ్డగించి దాడి చేశారు.

300 టన్నుల బంగారు రైలు

ఆ దాడుల్లో ఈ రైలు అక్కడి భూబాగంలో కూరుకుపోయింది. అయితే అప్పట్లో ప్రాణాలు దక్కితే చాలు అనుకుని ఈ రైలు గురించి పట్టించుకోవడం మానేసారు.

300 టన్నుల బంగారు రైలు

ఇప్పడు గుప్తనిధులను వేటాడటం కూడా ఒక వృత్తిగా భావించే ఇద్దరు గుప్త నిధుల వేటగాళ్లు పాయిటర్ కోపర్ (పోలాండ్) మరియు ఆండ్రియాస్ రిక్టర్ (జర్మనీ) తమ 35 మంది బృందంతో కలిసి గత ఏడాదిలో ఈ బంగారు రైలు ఉన్న ప్రదేశాన్ని చేరుకుని కొన్ని ప్రాథమిక పరీక్షలు చేశారు.

300 టన్నుల బంగారు రైలు

ముందు చెప్పిన రెండు నగరాల మధ్య ఉన్న రైల్వే ట్రాక్‌ దారిలో లోపల నాజీయులు నిధులతో నింపిన రైలును తాము అత్యాధునిక గ్రౌండ్-పెనెట్రేటింగ్ రాడార్ సాయంతో గుర్తించినట్లు గత ఏడాది ఆగష్టులో ఈ ఇద్దరూ వెల్లడించారు.

300 టన్నుల బంగారు రైలు

సరిగ్గా ఆ ప్రాంతంలో సుమారుగా 100 మీటర్లు దూరంతో 9 మీటర్లు లోతుతో వరుసగా మూడు పెద్ద రంద్రాలు చేయనున్నట్లు తెలిపారు.

300 టన్నుల బంగారు రైలు

భూమి లోపల ఉన్న ఈ రైలులో సుమారుగా 300 టన్నుల వరకు బంగారం, వజ్ర వైఢుర్యాలు ఉన్నట్లు అంచనా...

300 టన్నుల బంగారు రైలు

1945 కాలంలో భూమి లోపల టన్నెల్‌లో ఉండిపోయిన ఈ 300 టన్నుల బంగారపు నిధిని మరి చేజిక్కించుకుంటారా లేదా అన్నది తెలుసుకోవాలంటే వీరి ప్రయోగం ఫలించే వరకు వేచి చూడాలి మరి.

300 టన్నుల బంగారు రైలు

  
English summary
Zazi's Gold Train Could Be Discovered This Week

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark