కిమ్ జాంగ్ ఉన్ ఎక్కడికి వెళ్లినా ఈ కారు ఖచ్చితంగా వెన్నంటే ఉంటుంది

కిమ్ జాంగ్ ఉన్ ఎక్కడికెళ్లినా ఓ కారు అతడిని అనుసరిస్తూనే ఉంటుందని గుర్తించారు. నార్త్ కొరియాతో భూభాగపు సరిహద్దును పంచుకున్న సౌత్ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో చారిత్రాత్మక సమావేశానికి వచ్చినపుడు కూ

By Anil Kumar

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఏ దేశం మీద ఎప్పుడు బాంబుల వర్షం కురిపిస్తాడో అని ప్రపంచ దేశాలు బిక్కుబిక్కుమంటున్నాయి. కింమ్ జాంగ్ ఉన్ తన మూర్ఖత్వపు వైఖరితో ప్రపంచానికి ఏ నష్టం కలిగిస్తాడో అని అగ్ర దేశాలు ప్రత్యేక నిఘాతో ఎల్లప్పుడూ ఈ మానవ మృగం కదలికలను పసిగడుతూనే ఉన్నాయి.

కిమ్ జాంగ్ ఉన్ టాయిలెట్ కారు

అయితే, కిమ్ జాంగ్ ఉన్ ఎక్కడికెళ్లినా ఓ కారు అతడిని అనుసరిస్తూనే ఉంటుందని గుర్తించారు. నార్త్ కొరియాతో భూభాగపు సరిహద్దును పంచుకున్న సౌత్ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్‌తో చారిత్రాత్మక సమావేశానికి వచ్చినపుడు కూడా ఆయన వెంట ఈ కారు ఉన్నట్లు తెలిసింది.

కిమ్ జాంగ్ ఉన్ టాయిలెట్ కారు

కిమ్ విమాన ప్రయాణానికి దూరంగా ఉంటాడు. ఎక్కడికి వెళ్లాలన్నా అయితే కారు లేదా రైలును ఉపయోగిస్తాడు. ఇటీవల చైనాలోని బీజింగ్ నగరానికి కూడా అత్యంత రహస్యంగా తన వ్యక్తిగత రైలులో వెల్లొచ్చాడు.

కిమ్ జాంగ్ ఉన్ టాయిలెట్ కారు

కిమ్ జాంగ్ అన్ ఉత్తర కొరియా అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుండి విమానయాన ప్రయాణానికి దూరంగా ఉన్నాడు. చాలా వరకు తన సురక్షితమైన, ధృడమైన మరియు శక్తివంతమైన కాన్వాయ్‌నే ఉపయోగిస్తాడు.

కిమ్ జాంగ్ ఉన్ టాయిలెట్ కారు

అయితే, కిమ్ జాంగ్ ఉన్ పాలనో భాగంగా దేశ పర్యటనకు వెళ్లినపుడు తన శక్తివంతమైన కాన్వాయ్ వెంట ఓ కారు వెన్నంటే ఉంటున్నట్లు గుర్తించడం జరిగింది. గత వారంలో కిమ్ పాన్‌ముంజామ్ అనే ప్రదేశాన్ని పర్యటించినపుడు కూడా ఈ రహస్య కారు కిమ్ కాన్వాయ్ వెంటే ఉంది.

కిమ్ జాంగ్ ఉన్ టాయిలెట్ కారు

అయితే, ఆ కారు టాయిలెట్ మరియు ఇతర సౌకర్యాలను కలిగి ఉన్నట్లు తెలిసింది. దీనిని కేవలం నార్త్ కొరియా నియంత కిమ్ మాత్రమే ఉపయోగిస్తాడు. పర్యటనలో ఉన్నపుడు పబ్లిక్ మరియు ఇతరుల టాయిలెట్లు మరియు రెస్ట్ రూములను వాడకుండా తన వ్యక్తిగత అవసరాల కోసం ఈ కారు ఆయన వెన్నంటే ఉంటుంది.

కిమ్ జాంగ్ ఉన్ టాయిలెట్ కారు

ఈ విషయాన్ని నార్త్ కొరియా గార్డ్ కమాండ్ ఫోర్స్ అధికారిగా ఉన్న లీ-యున్-కియోల్ ఓ మీడియాతో పంచుకున్నాడు. నార్త్ కొరియా 2005లో సౌత్ కొరియా మీద దాడి చేసినపుడు నార్త్ కొరియా వ్యూహాత్మక సమాచార సేవా విభాగంలో పనిచేశాడు.

కిమ్ జాంగ్ ఉన్ టాయిలెట్ కారు

ఉత్తర కొరియా అధ్యక్షుడి కాన్వాయ్ వెంట వెళ్లే కారు, ఆయన వ్యక్తిగత అవసరాల కోసం అని, అందులో ఎలాంటి రహస్యం లేదనే విషయం ప్రపంచం మొత్తం తెలుసుకున్నట్లు డైలీ ఎన్‌కె సియోల్ పత్రికలో పేర్కొంది.

కిమ్ జాంగ్ ఉన్ టాయిలెట్ కారు

దేశ పర్యటనలో ఉన్నపుడు పల్లె ప్రాంతాలు మరియు అధికారిక నివాసాల్లో తన కాలకృత్యాలను తీర్చుకోవడానికి గల కారణం తన ఆడంబర మరియు విలాసవంతమైన జీవన శైలిలో భాగంగా కాదని, ఆయన భద్రత దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కారును వినియోగిస్తున్నట్లు ఆ పత్రిక చెప్పుకొచ్చింది.

కిమ్ జాంగ్ ఉన్ టాయిలెట్ కారు

అంతే కాకుండా, ఈ టాయిలెట్ కారును కిమ్ జాంగ్ ఉన్ తప్పితే మిగతా ఎవ్వరూ ఉపయోగించరు. అంతే కాకుండా, ప్రతి రోజు తన ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు ఆయన మలమూత్రాలను సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. ఇందుకొక ప్రత్యేక బృందం కూడా ఉంది.

కిమ్ జాంగ్ ఉన్ టాయిలెట్ కారు

ప్రపంచ వ్యాప్తంగా దేశాధ్యక్షుల భద్రతలో భాగంగా ఆయా దేశాల ఇంటెలిజెన్స్ విభాగాలు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాయి. కానీ, ఇలాంటి ఆరంబడమైన జీవితాన్ని పొందే అధ్యక్షులు చాలా అరుదు. ఒక దేశ అధ్యక్షుడి కాలకృత్యాల కోసం ఒక ప్రత్యేక వాహనం ఉండటం బహుశా ఇదొక్కటే కావొచ్చు.

కిమ్ జాంగ్ ఉన్ టాయిలెట్ కారు

1.మిస్టరీ రైలులో నార్త్ కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ రహస్య పర్యటన

2.ప్రపంచాన్ని వణికిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కార్ కలెక్షన్!

3.ఉత్తర కొరియాలో ఉన్న భయంకరమైన డ్రైవింగ్ రూల్స్

4.తలపాగా మ్యాచింగ్ కోసం 7 రోల్స్ రోయిస్ కార్లు కొనుగోలు చేసిన రుబెన్ సింగ్

5.అమెరికా అధ్యక్షుడి కోసం అధికారిక విమానంతో పాటు రహస్య విమానం కూడా

Most Read Articles

English summary
Read In telugu: North Korean leader Kim Jong Un's toilet car goes wherever he goes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X