100 కు పైగా లగ్జరీ కార్లు, విమానం మరియు లగ్జరీ యాచ్ కలిగి ఉన్న ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్

Written By:

ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఉత్తర కొరియా మీద దృష్టిసారించాయంటే అది కేవలం ఆ దేశ నియంత కిమ్ జాంగ్ ఉన్ కారణంగానే. యుద్ద గురించి చర్చించాల్సిన సంధర్భం వస్తే అందులో మొదటి వ్యక్తి కిమ్ జాంగ్ ఉన్న. ఇప్పటి వరకు కిమ్ జాంగ్ ఉన్ యుద్ద కోణం చూసుంటారు... ఈయనకు చెందిన మరో యాంగిల్ చూద్దాం రండి...

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

నిజానికి కిమ్ జాంగ్ ఉన్‌ను అసహ్యించుకోవడానికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఇష్టపడతారు. అందుకు ప్రధాన కారణం, అవసరానికి మించి ఆయుధాలను సమకూర్చుకోవడం మరియు భయంకరమైన ఆయుధాలను అభివృద్ది చేస్తూ... వాటికి పరీక్షలు నిర్వహిస్తూ ఉండటం.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

కింమ్ జాంగ్ ఇల్ (ఇతని తండ్రి) మరణించాక ఉత్తర కొరియాకు 2011 నుండి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. తన క్రూరమైన మరియు విపరీతమైన నియంతృత్వం కోసం అనేక చేష్టలకు పాల్పడుతున్నాడు.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

ముఖ్యంగా కిమ్ జాంగ్ ఉన్ విపరీతమైన మరియు విభిన్న అభిరుచులకు కూడా ప్రసిద్ది అని చెప్పవచ్చు. ఇవాళ్టి కథనంలోని ఇతని జీవన శైలి మరియు వాహన శ్రేణి మీద ఓ లుక్కేసుకుందాం రండి...

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

సకల సౌకర్యాలతో విలాసవంతమైన జీవనానికి కిమ్ జాంగ్ ఉన్ తన సొంతం నిధులును కాకుండా ఉత్తర కొరియా దేశ నిధులను వినియోగించడం ఇక్కడ ఆశ్చర్యకరం.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

అతను కోరుకుంటే ఏదైనా చేయగలడు, ఏమైనా అనుభవించగలడు. ఈ రాజు జీవితాన్ని గురించి చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఉత్తర కొరియా ఆర్థికంగా అస్థిరంగా ఉంది మరియు ఆ పైన, నాయకుడు అనైతిక ఖర్చు ఉత్తర కొరియా దేశ స్థూల దేశీయ ఉత్పత్తిని మరింత ప్రభావితం చేస్తుంది.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

అందుకు ఉత్తమ ఉదాహరణ, ఉత్తర కొరియాలోని ఓ సాధారణ వ్యక్తికి కనీసం సైకిల్ కొనుక్కునే స్తోమత కూడా లేదు. కానీ కిమ్ జాంగ్ ఉన్ ఆ దేశ నిధులతో విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

కిమ్ జాంగ్ ఉన్ ప్రయాణ అవసరాలకు వినియోగించే వాహన శ్రేణి గురించి తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. సుమారుగా 100 కు పైగా లగ్జరీ కార్లు, ఓ విలాసవంతమైన నౌక (యాచ్) మరియు ప్రత్యేకంగా మోడిఫై చేయించుకున్న వ్యక్తిగత విమానం కూడా కలదు.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

కిమ్ జాంగ్ ఉన్ ఎక్కువగా మెర్సిడెస్ బెంజ్ కార్లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ వచ్చాడు. తన దేశంలోని సైనికాధికారులకు బహుమానంగా ప్రదానం చేసే దగ్గరనుండి, తన వ్యక్తిగత అవసరాల వరకు మెర్సిడెస్ కార్లకే మొగ్గు చూపుతాడు.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

కిమ్ జాంగ్ ఉన్ ప్రస్తుతం వినియోగిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారును తన తండ్రి వద్ద నుండి పొందాడు.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

ప్రస్తుతం కిమ్ జాంగ్ ఉన్ వద్ద ఉన్న 100 లగ్జరీ కార్లలో అత్యంత ప్రాధాన్యం గల కారు మెర్సిడెస్ బెంజ్ పుల్‌మ్యాన్ గార్డ్ లిమోసిన్.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

కిమ్ జాంగ్ ఉన్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ దీనిని 2009లో చైనా నుండి కొనుగోలు చేసి, దిగుమతి చేసుకున్నాడు. అయితే కిమ్ జాంగ్ ఇల్ మరణించిన తరువాత ఇప్పుడు కిమ్ జాంగ్ ఉన్ ఉపయోగిస్తున్నాడు.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

ఈ కారు కోసం కిమ్ జాంగ్ సుమారుగా 3.1 మిలియన్ అమెరికన్ డాలర్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. మన ఇండియన్ కరెన్సీలో దీని విలువ రూ. 20 కోట్లుగా ఉంది.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

ఈ మెర్సిడెస్ బెంజ్ పుల్‌మ్యాన్ గార్డ్ లిమోసిన్ కారును చైనా రిజిస్ట్రేషన్ నెంబర్‌తో కొనుగోలు చేసి, ఆ తరువాత ఉత్తర కొరియాకు దిగుమతి చేసుకున్నారు. నిజానికి ఉత్తర కొరియా నెంబర్ ప్లేటుతో దీనిని మార్చేయాల్సి ఉంది. అయితే అధ్యక్షుడి కారు కావడంతో అలాగే వినియోగిస్తున్నారు.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

సాంకేతికంగా పుల్‌మ్యాన్ గార్డ్ లిమోసిన్ కారులో 5.5-లీటర్ సామర్థ్యం ఉన్న వి12 టుర్బో ఛార్జ్‌డ్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 515బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

నిజానికి కిమ్ జాంగ్ ఉన్ హాలిడే ట్రిప్స్ మీద దృష్టి సారిస్తే, ఈ కారు విలువ ఎక్కువ అనిపించకపోవచ్చు.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

ఉత్తర కొరియాలోని సైనికులకు మరియు సైనికాధికారులకు కిమ్ జాంగ్ ఉన్ తరచూ బహుమానాలు ఇస్తుంటాడు. అందుకోసం ఎక్కువగా మెర్సిడెస్ బెంజ్ కార్లను ప్రధానం చేస్తుండటం మరింత ఆశ్చర్యకరమైన విషయం.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

నివేదికల ప్రకారం, కిమ్ జాంగ్ ఉన్ ప్రధాని అయినప్పటి నుండి 2012 వరకు సుమారుగా 160కి పైగా మెర్సిడెస్ బెంజ్ కార్లను సైన్యాధికారులకు బహుమానంగా ప్రధానం చేసినట్లు తెలిసింది.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

ఉత్తర కొరియా దేశాధ్యక్షుడి నుండి కార్లను బహుమానంగా పొందిన వారిలో ఖండాతర బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ది చేసిన ఇంజనీర్లే ఎక్కువగా ఉన్నారు.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

లగ్జరీ కార్లు మరియు విమానం తరువాత మిగిలింది సౌకర్యంవతమైన లగ్జరీ యాచ్. 100 అడుగులు పొడవున్న ఈ యాచ్‌ను ప్రిన్సెస్ అనే సంస్థ తయారు చేసింది.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

నిజానికి ప్రిన్సెస్ యాచ్ మ్యానుఫాక్చరింగ్ సంస్థ ఫ్రెంచ్‌కు చెందిన దిగ్గజ లగ్జరీ ఉత్పత్తుల తయారీ సంస్థ ఎల్‌విఎమ్‌హెచ్(LVMH) గ్రూపునకు చెందినది. LVMH అనగా Louis Vuitton Moet Hennessy.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

లగ్జరీ ఉత్పత్తుల తయారీ బ్రాండ్ LVMH కు చెందిన ప్రిన్సెస్ సంస్థ తయారు చేసిన ఈ లగ్జరీ యాచ్ ధర సుమారుగా 5.6 మిలియన్ యూరోలుగా ఉంది.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

ఉత్తర కొరియాకు చెందిన కొరియన్ న్యూస్ ఏజెన్సీ (KCNA) సంస్థ ఆ దేశ ఆధ్యక్షుడు ఈ యాచ్‌లో ట్రిప్‌కు వెళ్లినపుడు, దాని తాలుకు ఫోటోలను రివీల్ చేసింది.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

కిమ్ జాంగ్ ఉన్ విలాసవంతమైన లైఫ్ స్టైల్‌లో ఓ విమానం కూడా ఉంది. ఇతను అత్యవసరం సమయంలో దేశంలో ఎక్కడికైనా చేరుకోవడానికి ఉత్తర కొరియా మొత్తం అనేక రన్ వే లను నిర్మించారు.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ రాజధానికి నగరం ప్యోంగ్యాంగ్‌లో ఆ దేశ అభివృద్ది పనులను తన వ్యక్తిగత విమానంలో నుండే పర్యవేక్షిస్తున్నపుడు సేకరించిన ఫోటోలను కెసిఎన్ఎ న్యూస్ ఏజెన్సీ విడుదల చేసింది.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

సోవియట్ల కాలానికి చెందిన ఇల్యూషన్ ఐఎల్-62 అనే వ్యక్తిగత విమానానికి కస్టమైజషన్స్ చేయించి వినియోగిస్తున్నాడు కిమ్ జాంగ్ ఉన్. ఈ కస్టమైజ్డ్ ఇల్యూషన్ ఐఎల్-62 విమానానికి చామ్‌మే - 1 అనే పేరును పెట్టారు.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

కిమ్ జాంగ్ ఉన్ అభీష్టం మేరకు చామ్‌మే - 1 వ్యక్తిగత విమానంలోని ఇంటీరియర్ మొత్తాన్ని లెథర్‌తో మోడిఫై చేశారు. ఇందులో సకల సదుపాయాలను కల్పించేందుకు అనుగుణంగా మోడిఫై చేయించారు.

ప్రపంచాన్ని వణికిస్తోన్న కిమ్ జాంగ్ ఉన్ వాహన శ్రేణి!

చామ్‌మే - 1 విమానంలోని లగ్జరీ వసతుల కోసం నిర్వహించిన మోడిఫికేషన్స్‌కు ఉత్తర కొరియా సుమారుగా 1.5 మిలియన్ అమెరికన్ డాలర్లను ఖర్చు చేసింది.

English summary
Read In Telugu North Korean Leader Kim Jong Un Motor World

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark