పేస్ మాస్క్ లేనందుకు పోలీసుకు సైతం జరిమానా

కరోనా మహమ్మారి దేశంలో చాల వేగంగా వ్యాపిస్తోంది. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే చాలామంది మరణించారు. అంతే కాకుండా చాలామంది ఈ వైరస్ భారినపడి నలిగిపోతున్నారు. దేశంలో అధికంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి.

పేస్ మాస్క్ లేనందుకు పోలీసుకు సైతం జరిమానా

ఇందులో భాగంగా కరోనా లాక్ డౌన్ ప్రకటించబడింది. మరికొన్ని ప్రాంతాలలో నైట్ కర్ఫ్యూ విధించబడింది. ఈ సమయంలో ప్రజలు ప్రభుత్వం విధించిన నియమాలకు కట్టుబడి ఉండాలి. ఈ నియమాలు కేవలం సామాన్య ప్రజలకు మాత్రమే కాదు, పోలీసులకు ఇతర అధికారులకు కూడా వర్తిస్తుంది.

పేస్ మాస్క్ లేనందుకు పోలీసుకు సైతం జరిమానా

కరోనా నివారణ కోసం ప్రజలు సామజిక దూరాన్ని పాటిస్తూ తప్పకుండా పేస్ మాస్క్ ధరించాలి, అత్యవసర సమయంలో తప్ప బయటకు రాకూడదు. ఒకవేళా ఈ నియమాలను ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ నియమాలను ఉల్లంఘిస్తే పోలీసులకు కూడా ఈ కఠినమైన చర్యలు వర్తిస్తాయి.

MOST READ:బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాజీనామా చేసిన రాహుల్ బజాజ్.. ఎందుకంటే?

పేస్ మాస్క్ లేనందుకు పోలీసుకు సైతం జరిమానా

నివేదికల ప్రకారం ఇటీవల ఒడిశాలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కి పేస్ మాస్క్ ధరించనందుకు జరిమానా విధించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై స్పందిస్తూ సంబంధిత అధికారులు ఆ పోలీస్ కానిస్టేబుల్ కి 2,000 రూపాయలు జరిమానా విధించినట్లు ట్వీట్ చేశారు.

పేస్ మాస్క్ లేనందుకు పోలీసుకు సైతం జరిమానా

కరోనా నివారణ కోసం ఒడిస్సా గవర్నమెంట్ 14 రోజులు పేస్ మాస్క్ ధరించాలని ఆదేశించింది. కానీ దీనికి వ్యతిరేకంగా విధుల్లో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పేస్ మాస్క్ ధరించలేదు, కావున అతడికి 2,000 రూపాయలు జరిమానా విధించినట్లు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ కన్వర్ విశాల్ సింగ్ చెప్పారు.

MOST READ:హార్లే డేవిడ్సన్‌ బైక్‌పై కనిపించిన మమతా మోహన్‌దాస్[వీడియో]

పేస్ మాస్క్ లేనందుకు పోలీసుకు సైతం జరిమానా

బాధ్యతాయుతమైన పౌరుడిగా ఉండవలసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈ విధంగా చేసినందుకు అందరికి లాగే ఇతడికి కూడా జరిమానా విధించారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం దృష్టిలో ప్రజలు, అధికారులు సమానమే అని తెలుస్తుది. కావున పోలీసులను సైతం శిక్షిస్తుతున్న ప్రభుత్వం ప్రజలను కూడా తీవ్రంగా శిక్షించడానికి వెనుకాడదు. కావున ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి.

పేస్ మాస్క్ లేనందుకు పోలీసుకు సైతం జరిమానా

పెరుగుతున్న కొరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని తప్పనిసరిగా ప్రజలందరూ పేస్ మాస్క్ ధరించాలని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు మరియు మరణాలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు మెలగాలి, లేకుంటే కరోనా కోరల్లో నలిగిపోయి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది.

MOST READ:కరోనా రోగులకోసం ఏకంగా 85 లక్షలు ఖర్చు చేసిన వ్యక్తి; వివరాలు

Most Read Articles

English summary
Traffic Constable Fined For Not Wearing Mask In Odisha. Read in Telugu.
Story first published: Friday, April 30, 2021, 19:32 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X