హ్యార్లీ డేవిడ్సన్ కంపెనీకి షాక్ ఇచ్చిన మురికి దుస్తులు ధరించిన ముసలి వ్యక్తి !!

Written By:

ప్రపంచంలో ఏ మూలకెళ్లినా మానత్వానికన్నా డబ్బుకే ఎక్కువ విలువ. ఇది నిజం అని చెప్పే మరో ఘటన చోటు చేసుకుంది. డబ్బున్న వారి వద్ద మానవత్వం ఉండకపోవచ్చు. కానీ డబ్బులేని, మురికి దుస్తులు ధరించే వారిలో నిజమైన మానవత్వం ఖచ్చితంగా ఉంటుంది.

కోటాను కోట్లు సంపాందించినా సాటి వ్యక్తి మీద ప్రేమాభిమానాలు లేకుండా జీవిస్తుంటారు. ఇలాంటి వారు వస్త్రధారణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఇలాంటి సంఘటన ఓ హ్యార్లీ డేవిడ్‌సన్ మోటార్ సైకిల్ విక్రయ కేంద్రంలో చోటు చేసుకుంది.

లగ్జరీ కార్లు మరియు బైకులను విక్రయించే డీలర్లు తమ వద్దకు బాగా డబ్బున్న కస్టమర్లు మాత్రమే వస్తారని పొరబడుతుంటారు. చాలా మంది డీలర్లు కస్టమర్ల వస్త్రధారణ మరియు వారి నీట్‌నెస్ ఆధారంగా వీరు తమ వాహనాలను కొనగలరా అని అంచనా వేస్తున్నారు.

ఇది నిజమా... కాదా... అనే విషయం తెలుసుకోవాలంటే మీరు కూడా ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి తరహాలో పాత టీ షర్టు, చిరిగిపోయిన ఫ్యాంటు ధరించి మంచి ఖరీదైన లగ్జరీ కార్లు లేదా బైకులు విక్రయించే షోరూమ్‌ను సందర్శించండి... ఆ అనుభవం ఎలాంటిదో తెలుస్తుంది.

సాధారణ వస్త్రాలు ధరించే స్తోమత లేని వ్యక్తులు ఇంత ఖరీదైన వాహనాలు ఎలా కొనుగోలు చేస్తారని వారి భావన. అయితే వ్యక్తుల యొక్క సంపదను వేషధారణ ద్వారా అంచనా వేయడం... ఆ వ్యక్తులను అవమానించడమే అవుతుంది.

కార్ల షోరూమ్‌లలో విక్రయదారులు కస్టమర్ల వస్త్రధారణ ఆధారంగా వారి స్తోమతను నిర్దారిస్తున్నారు అని తెలిపే ఘటన ఒకటి థాయిలాండ్‌లో ఒకటి చోటుచేసుకుంది.

చిరిగిపోయి, పాతబడిన వస్త్రాలను ధరించి హ్యార్లీ డేవిడ్‌సన్ షోరూమ్‌లోకి వెళ్లిన ఓ కస్టమర్‌ను విక్రయదారుడు నానా దుర్బాషలాడాడు. స్థోమత గురించి మాట్లాడుతూ ధూషించాడు. అయితే ఆ కస్టమర్ అదిరీని షాక్‌కు గురిచేశాడు.

పొడవాటి బాగా మాసిపోయిన టీ షర్ట్ మరియు వదులుగా, అక్కడక్కడ రంధ్రాలు పడి ఉన్న ఫ్యాంటు ధరించిన లోపలికి వచ్చిన కస్టమర్‌ను షోరూమ్ నుండి బయటకు వెళ్లాలని గట్టిగా గద్దించాడు.

అయితే మరొక షోరూమ్‌కు వెళ్లడంతో అతని మీద దృష్టిసారించి అతను ఓ బైకు కొనుగోలు చేయడానికి వచ్చినట్లు తెలుసుకున్నారు షోరూమ్ నిర్వాహకులు.

తాను ఎంచుకున్న బైకు కోసం సరిపడా సొమ్ము 17,361 డాలర్లు చెల్లించి గరిష్ట ధర పలికే బైకును ఎంచుకున్నాడు.

ఈ విషయాన్ని మొత్తం ఆ వ్యక్తి సోదరి ఫోటోలతో సహా సోషల్ మాధ్యమంలో పంచుకుంది. అయితే స్వల్పకాలంలో వైరల్‌గా వ్యాపించింది.

వృత్తి పరంగా ఇతను గతంలో ఓ మోటార్ సైకిల్ మెకానిక్ షాప్ నిర్వహించే వాడు. అయితే పోగు చేసిన సొమ్ముతో తనకంటూ ఓ బైకును ఉంచుకోమని సోదరి తెలపడంతో ఈ బైకు కొనుగోలు చేశాడు.

"పుస్తకం ముఖ పేజీ చూసి దాని విలువను నిర్ణయించవద్దు" అనే నానుడిని అక్షరాలా నిజం చేసి చూపించాడు ఈ వ్యక్తి. ఇతని ఇతని పేరు ఏంటో తెలుసా.... 'లంగ్ డెచా'.
ఖరీదైన హెలికాఫ్టర్, 120 లగ్జరీ కార్లను కలిగిన గుట్కా, పాన్ మసాలా బిజినెస్‌మేన్....

English summary
Read In Telugu Shabbily Dressed Man Denied Attention At Dealerships; Buys A Harley With Ready Cash
Please Wait while comments are loading...

Latest Photos