ఈ నియమం జారీ అయితే పాదచారులను దేవుడే కాపాడాలి!!

Written By:

జాతీయ రోడ్ల మీద నడవడం మరియు సైకిల్ తొక్కడాన్ని బ్యాన్ చేయమంటూ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కేంద్ర రవాణా విభాగానికి ఓ ప్రతిపాదనను సిఫార్సు చేసింది. దీని ప్రకారం, ఆ సిఫార్స్ ఆమోదం పొందితే నగరాలలో ఉండే ప్రధాన రోడ్ల మీద జాతీయ రోడ్ల మీద నడవడం మరియు సైకిల్‌పై వెళ్లడం చేయకూడదు. అందుకోసం ఫుట్ పాత్ మరియు సైకిల్ ట్రాక్ వినియోగించాల్సి ఉంటుంది.

రోడ్డు మీద పాదచారులు మరియు సైక్లిస్టులను బ్యాన్ చేస్తున్న కేంద్రం

2016 మోటార్ వాహనాల సవరణ బిల్లులో మార్పులు చేసి ఈ నియమాన్ని చేర్చమని సలహానిచ్చింది. చాలా మంది పాదచారులకు వ్యక్తిగత భీమా లేదు. కాబట్టి నగరంలోని మరియు జాతీయ రహదారుల మీద నడవడం మరియు సైకిల్ తొక్కడాన్ని నిషేధించాలని కమిటీ పేర్కొంది.

రోడ్డు మీద పాదచారులు మరియు సైక్లిస్టులను బ్యాన్ చేస్తున్న కేంద్రం

ఈ రెండు నియమాలను ఉల్లఘించే వారి మీద స్వల్ప మేర ఫైన్ విధించడం ద్వారా విధిగా రోడ్ల మీదకు రాకుండా ఫుట్ పాత్ మీదనే నడుస్తారు. తద్వారా ప్రమాదాల రేటు గణనీయంగా తగ్గుతుందని కూడా ఆ ప్రతిపాదనలో పేర్కొంది.

రోడ్డు మీద పాదచారులు మరియు సైక్లిస్టులను బ్యాన్ చేస్తున్న కేంద్రం

పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీసుకున్న ఈ నిర్ణయం పాదచారులకు మరియు సైక్లిస్టులకు అంత మంచి చేకూర్చదని తెలిస్తోంది. ఈ ప్రతిపాదనపై కేంద్ర రవాణా శాఖ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

రోడ్డు మీద పాదచారులు మరియు సైక్లిస్టులను బ్యాన్ చేస్తున్న కేంద్రం

ప్రస్తుతం దేశకవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన నగరాలలో మోటార్ వాహనాల వినియోగం పెరగడం ద్వారా రద్దీ నానాటికీ పెరిగిపోతోంది. తద్వారా రహదారుల మీద వెళ్లే నాన్ మోటార్ వెహికల్స్ మరియు పాదచారులను నిషేధించాలని నిర్ణయం తీసుకుంది కమిటీ. కాని ఇది సామాన్య ప్రజానీకానికి పూర్తి వ్యతిరేకంగా ఉంది.

రోడ్డు మీద పాదచారులు మరియు సైక్లిస్టులను బ్యాన్ చేస్తున్న కేంద్రం

కాబట్టి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ప్రదిపాదనను రవాణ శాఖ ఆచరణలోకి తీసుకొస్తే, పైన తెలిపిన మేరకు సైకిల్ ఉన్న వారు సైకిల్ ట్రాక్ మీద మరియు పాద చారులు ఫుట్ పాత్ మీద మాత్రమే వెళ్లాల్సి ఉంటుంది.

రోడ్డు మీద పాదచారులు మరియు సైక్లిస్టులను బ్యాన్ చేస్తున్న కేంద్రం

అయితే అందరిలోనూ తలెత్తే ప్రశ్న ఏమిటంటే సైకిల్ ట్రాక్ మరియు ఫుట్ ఫాత్ లేని నగరాలలో ఎలా వెళ్లాలి ? కాబట్టి, కేంద్రం ఈ నియమాన్ని అమలుపరిస్తే... ఈ ప్రశ్నకు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

 
English summary
Pedestrians And Cyclists May Be Banned From Main Roads — Has The Government Gone Mad?

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark