ఈ సారి డీజల్‌ పై బాధుడు

Written By:

డీజల్ వినియోగ వాహనదారులకు పెద్ద చేదు వార్త, అయితే పెట్రోల్ ను కూడా వదల్లేదు. ఆదివారం రాత్రి (జనవరి 15, 2017) ప్రభుత్వ చమురు రంగ సంస్థల సమావేశంలో పెట్రోల్ మీద 42 పైసలు మరియు డీజల్ మీద రూ. 1.03 ల మేర పెంపును ప్రకటించాయి.

అయితే ఈ పెంపుకు రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పన్నును కలుపలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు పన్నును కలుపుకుంటే ఇంధన ధరల్లో పెంపు ఇంకా ఎక్కువగా ఉంటుంది.

ఢిల్లీలో వ్యాట్ కలుపుకుంటే లీటర్ పెట్రోల్ మీద 53 పైసలు ధర పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 71.13 లుగా ఉంది. పెంపునకు ముందు దీని ధర రూ. 70.60 లుగా ఉండేది. డీజల్ మీద అన్ని పన్నులతో కలుపుని పెంపు రూ. 1.20 లుగా ఉంది. పెంపు అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 59.02 లుగా ఉంది. పెంపుకు ముందు దీని ధర రూ. 57.82 లుగా ఉంది.

అంతర్జాతీయ విపణిలో పెట్రోల్ మరియు డీజల్ ధరల్లో పెరుగుదల మరియు అంతర్జాతీయంగా ఇంధన కొనుగోళ్ల మీద డాలరుతో రుపాయి మారకం రేటు విలువ తక్కువ కావడంతో దేశీయంగా ఇంధన ధరల పెంపును చేపట్టినట్లు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.

 

హ్యాచ్‌బ్యాక్ ధరలో ఆరు మరియు ఏడు మంది సీటింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్న డాట్సన్ గో ప్లస్ కారు ఎక్ట్సీరియర్ మరియు ఇంటీరియర్ ఫోటోలు
 

English summary
Petrol Price Raised By 42 Paise; Diesel Hiked By Rs 1.03 Per Litre
Story first published: Monday, January 16, 2017, 11:25 [IST]
Please Wait while comments are loading...

Latest Photos