విమాన ప్రయాణికులకు తెలియనీకుండా పైలట్లు రహస్యంగా ఉంచే సీక్రెట్స్..!!

By N Kumar

విమానం టేకాఫ్ తీసుకున్న సమయం నుండి ల్యాండ్ అయ్యేంత వరకు, పైలట్లు కీలక పాత్ర పోషిస్తారు. పైలట్లు తమ విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు కొన్ని విషయాలను మాత్రమే వెల్లడిస్తారు. మరికొన్ని ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా వెల్లడించరు. చిన్న చిన్న పక్షులు ఢీ కొట్టడం నుండి టెర్రరిస్టుల దాడుల వరకు ఎన్నో రకాల సమస్యలను పైలట్లు తమ ప్రయాణ సమయంలో ఎదుర్కొంటారు.

పైలట్లు విమానంలో ప్రయాణించే సమయంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రయాణికులకు చెప్పకుండా దాచే అత్యంత భయంకరమైన రహస్యాలను తెలుసుకుందాం రండి.

1. ఉగ్ర ముప్పు

1. ఉగ్ర ముప్పు

రెడ్డిట్ అనే సామాజిక్ మాధ్యమంలో ఒక పైలట్ తన స్నేహితుడితో జరిపిన సంభాషణలో, నేను ఐదు సంవత్సరాల క్రితం లాస్ ఏంజిల్స్ నుండి టోక్యోకు విమానాన్ని నడుపుతున్న సమయంలో నా విమానానికి మొబైల్ ఫోన్ బాంబ్ ద్వారా ప్రమాదం ఉందని సమాచారం అందింది. అప్పుడు విమానం పసిఫిక్ సముద్రం మధ్య భాగంలో ఉంది. అయితే ఆ భాద మరియు భయాన్ని మనసులో మాత్రమే ఉంచుకున్నాను, ప్రయాణికులతో పంచుకోలేదు. కాని ఏ విధమైన ప్రమాదం సంభవించలేదు అని చెప్పుకొచ్చాడు.

 2. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తప్పుడు సమాచారం

2. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ తప్పుడు సమాచారం

కొన్ని సందర్బాల్లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు ఇచ్చే సమాచారం వలన రెండు విమానాలు ఢీ కొట్టే పరిస్థితులు చోటు చేసుకుంటాయి. ఒక రన్‌వే మీద టేకాఫ్ మరియు ల్యాండింగ్ సిగ్నల్స్ ఇవ్వడం వంటి వాటి వలన ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. అయితే ఇలాంటి సమయాల్లో ప్రయాణికులకు చెప్పకుండా పైలట్లు సమస్యను అధిగమిస్తారు.

3. లైట్స్ అవుట్

3. లైట్స్ అవుట్

రెడ్డిట్ అనే వేదిక మీద ఎయిర్‌బస్ 320 విమానంలో జరగిన సంఘటన పైలట్ ఇలా పంచుకున్నాడు. ఆసియాలో సుమారుగా 23000 అడుగులో ప్రయాణిస్తున్నపుడు విమానం మొత్తం పవర్ కట్‌కు గురయ్యింది. క్యాబిన్, డ్యాష్ బోర్డ్, ఇంస్ట్రుమెంట్ కంట్రోల్, స్క్రీన్లు వంటి అన్నింటిలో పవర్ పోయింది. ఇలాంటి సందర్భాలు జరుగుతాయి అనే ఉద్దేశ్యంతో ఎయిర్‌బస్ సంస్థ మూడు జనరేటర్లు, బ్యాటరీలు మరియు ఎమర్జెన్సీ జనరేటర్ వంటివి అందించారు. రెండు ఇంజన్‌లు కూడా పాడైపోయినప్పటికీ ఇందులోని విద్యుత్ శక్తి ద్వారా సురక్షితంగా బయటపడవచ్చు. ఇలాంటివి అస్సలు జరగవని దీని గురించి పైలట్లకు శిక్షణ కూడా ఇవ్వరట. అయితే సుమారుగా 12 వార్నింగ్‌ల అనంతరం పరిస్థితి సద్దుమనిగి మొత్తానికి విమానాన్ని ల్యాండ్ చేశాడట.

4. పడిపోయిన విండో ఫ్రేమ్

4. పడిపోయిన విండో ఫ్రేమ్

రెడ్డిట్ అనే సామాజిక చర్చా వేదికలో ఎయిర్‌హోస్టెస్ కూతురు ఇలా రాసింది. "తన అమ్మ విమానంలోని కో-పైలట్ ప్రక్కన ఉన్న కిటికీ అంచులను తాకింది, ద్వారా ఫ్రేమ్‌తో సహా మొత్తం సెట్ క్రిందకు జారిపోయింది. అయితే అదృష్టవశాత్తు కో-పైలట్‌కు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు" అని పంచుకుంది.

 5. కో పైలట్ చేష్టలు

5. కో పైలట్ చేష్టలు

కమర్షియల్ ఎయిర్ లైన్ పైలట్ రెడ్డిట్ మాధ్యమంలో మాట్లాడుతూ, కొన్నేళ్ల క్రితం నేను నా కో పైలట్ తో విమానం నడుపుతుండగా అనుకోకుండా కో పైలట్ తన చైర్‌లో కుప్పకూలిపోయాడు. నేను అతన్ని కదిలించడానికి ప్రయత్నించగా అతిని చేయి నా మొహం మీదుగా దూసుకెళ్లింది. అయితే ఒక 30 సెకండ్ల పాటు నిశ్శబ్దంగా పడిపోయాడు. అయితే కాసేపటికి అంతా సద్దుమనిగింది. అయితే దీనికి కారణం భయంకరమైన తల నొప్పి మరియు సరిలేని వాతావరణ పరిస్థితిని చెప్పాడు.

 6. పిడుగు పాటు

6. పిడుగు పాటు

ఇప్పటికీ చాలా ఏవియేషన్ రంగాలు ఎదుర్కొంటున్న సమస్య పిడుగుపాటు. అవుటు ఒక పైలట్ విమానాన్ని హిత్రోయ్ విమానాశ్రయంలో ల్యాండ్ చేస్తున్న సమయంలో పిడుగుపాటు కారణంగా వచ్చిన కాంతి తన విండ్ స్క్రీన్ (ముందు వైపు అద్దం) మీద పడిందని తెలిపాడు. ఇలాంటి సందర్భాల్లో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అయితే ఇందులోని ప్యాసింజర్లు కూడా తాము గుర్తించామని చెప్పగా, అది పిడుగు కాదని వారికి నచ్చజెప్పారు. వారి భయాందళనలను దూరం చేయడానికి ఇలా చెప్తారట.

 7. క్యాబిన్‌లో మంటలు

7. క్యాబిన్‌లో మంటలు

ఒక పైలట్ దీని గురించి మాట్లాడుతూ, తాము సుమారుగా 11,000 అడుగుల ఎత్తులో ఉన్నపుడు తాను నీరు తాగుతంటే పొగ వాసనను పసిగట్టాడు. ఆ తరువాత తన కాలు మంటకు గురవుతుపన్నట్లు గ్రహించారు. అయితే తన కాలును గమనించగా ఆ వేడి తన ప్యాంటులోని వస్తున్నట్లు గుర్తించాడు.

అయితే దీనికి కారణం కూడా అతనే వెల్లడించాడు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ మీదుగా సూర్యరశ్మి సరిగ్గా ప్రసరించడం వలన అయస్కాంత కిరణాలు విడుదలయ్యాయి. తద్వారా వేడి పుట్టిందని గ్రహించాడు. ఆ తరువాచ కాక్‌పిట్‌లోని ప్లాస్టిక్ వస్తువులను తీసుకెళ్లడం మానుకున్నాడు.

 8. దగ్గరగా వెళ్లడం

8. దగ్గరగా వెళ్లడం

కాక్‌పిట్‌లో ఉన్న పైలట్ మరియు కో పైలట్ అన్ని విషయాలు ప్రయాణికులతో పంచుకోకపోవచ్చు. అయితే కొన్ని వారికి చెప్పకపోయినా వారికి తెలిసిపోతుంటాయి. అందుకు ఉదాహరణ, రెండు విమానాలు చాలా దగ్గరగా వచ్చినపుడు తప్పించుకోవడానికి అత్యంత వేగంగా విమానాలను మళ్లిస్తుంటారు. ఇలాంటి వాటిని ఎయిర్ బ్యాలెన్స్ అని కప్పిపుచ్చుతుంటారు. అయితే ఒక పైలట్ మాత్రం ఇలాంటి సమయాల్లో ఖచ్చితంగా ప్రయాణికులతో నిజాయితీగా పంచుకుంటానని తెలిపాడు.

 9. తీవ్రమైన గాలులు

9. తీవ్రమైన గాలులు

చాలా మంది పైలట్లు అనుభవిస్తున్న సమస్య తీవ్రమైన గాలులు. నిజమే విమానం గాలిలో ఎగురుతున్న సమయంలో తీవ్రమైన గాలులు విమానాన్ని గంటకు 6000 అడుగుల వేగంతో విమానాన్ని నెడుతుంటాయి. ఒక్కో సారి, రెక్కల మీద, తోక మీద మరియు ముందు మీద వీచే గాలులు ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంటాయి. ఇలాంటి సమస్యను నివారించడానికి పైలట్లు స్పాయిలర్లను వినియోగించి భూమికి సమాంతరంగా ఉండేట్లు చేస్తాడు. ఇలాంటి వాటికి వెంటనే స్పందించకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి.

 10. విమానం పేళుల్లు

10. విమానం పేళుల్లు

కొంత మంది ఇలంటి సమస్యలతో బాగా ఇబ్బందులకు గురవుతుంటారు. ఒక విమానం టేకాఫ్ తీసుకుంటున్నపుడు మరొక విమానానికి ల్యాండింగ్ ఇవ్వడం వంటి వాటి వలన వాటి రెక్కలు మరియు తోక వంటి భాగాలు రాపిడికి గురయ్యి. పేళుల్లు సంభంవించే అవకాశాలు ఉన్నాయి. ఒక సారి విమానం 50 అడుగుల ఎత్తుకు చేరుకుంటే విమానాన్ని సురక్షితంగా తప్పించే అవకాశం పైలట్లకు ఉంటుంది. కాని అంతకు లోపల ఇలాంటివి జరగితే రన్‌వేల మీద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి.

పైలట్లు ప్రయాణికులతో షేరు చేయకుండా దాచే విషయాలు

మృదువైన పక్షులు ఢీ కొంటే పతనమవుతున్న విమానాలు: అసలు దీని వెనక దానున్న మర్మమేటి

ఎలాంటి విమాన ప్రమాదాల నుండి అయినా ఇలా తప్పించుకోవచ్చు.

పైలట్లు ప్రయాణికులతో షేరు చేయకుండా దాచే విషయాలు

విమాన ప్రయానంలో పైలట్లు మరియు ఎయిర్ హోస్టెస్ వద్దన్నా చేస్తున్న పనులు

కనబడకుండా పోయిన ఆ విమానాన్ని గ్రహాంతర వాసులు కూల్చేశాయా ?

Most Read Articles

English summary
Pilots reveal 10 terrifying secrets that their passengers had no idea about
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X