స్వీటికి ప్రేమతో ప్రభాస్ చిరుకానుక

Written By:

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ జోడీగా పేరు తెచ్చుకున్న జంట ప్రభాస్-అనుష్క. వీరి కాంబినేషన్‌లో ఏ సినిమా వచ్చినా సక్సెస్ గ్యారంటీ అనేది డైరక్టర్ల, అభిమానుల నమ్మకం. నిజమే, వీరిద్దరి కాంబినేషన్లలో వచ్చిన ప్రతి చిత్రం దేనికదే ప్రత్యేకం.

ప్రభాస్ బిఎమ్‌డబ్ల్యూ కారు అనుష్క

సినిమా గురించి అటుంచితే రియల్ లైఫ్‌లో కూడా వీరిద్దరి మధ్య స్నేహం ఉంది. తాజాగా స్వీటికి అత్యంత ఖరీదైన బిఎమ్‌డబ్ల్యూ కారును ప్రభాసం గిఫ్టుగా ఇచ్చాడు.

Recommended Video - Watch Now!
[Telugu] Skoda kodiaq Launched In India - DriveSpark
ప్రభాస్ బిఎమ్‌డబ్ల్యూ కారు అనుష్క

సినిమా రంగాన్ని పీడిస్తున్న రెండు అతి పెద్ద సమస్యలలో ఒకటి పైరసీ అయితే, మరొకటి రూమర్. నిజమే, క్యారెక్టర్ ఆర్టిస్టులు, హీరో, హీరోయిన్స్ నుండి డైరక్టర్లు, ప్రొడ్యూసర్ల వరకు అందరినీ వేధించే అంశాలు ఈ రెండే.

ప్రభాస్ బిఎమ్‌డబ్ల్యూ కారు అనుష్క

భారత చిత్ర పరిశ్రమలో సంచలనాత్మక విజయాన్ని అందుకున్న బాహుబలి సినిమా... తెలుగు సినీ పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచం మొత్తానికి విస్తరించింది. చివరికి ఈ చిత్రంలో నటించిన ప్రభాస్, అనుష్కలకు కూడా రూమర్ల తాకిడి తగ్గలేదు.

ప్రభాస్ బిఎమ్‌డబ్ల్యూ కారు అనుష్క

బాహుబలి సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుండి వారు కలిసి పనిచేసినన్ని రోజులు మీడియాలో ఏదో ఒక పుకారు పుట్టుకొచ్చేది. ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ... త్వరలో రహస్యంగా పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలో ఇంటర్నెట్లో ఎప్పుడూ చక్కర్లుకొడుతుండేవి.

ప్రభాస్ బిఎమ్‌డబ్ల్యూ కారు అనుష్క

మంచి గుర్తింపు తెచ్చుకున్న నటీనటులకు ఇలాంటి రూమర్స్ రావడం ఇండస్ట్రీలో సర్వసాధారణమైపోయింది. మీడియా ప్రతినిధులు సూటిగా అడిగినపుడు మేము మంచి స్నేహితులం, ఇలాంటి పుకార్లన్నీ అబద్దం అని ప్రభాస్ అనుష్క మీడియాతో చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

ప్రభాస్ బిఎమ్‌డబ్ల్యూ కారు అనుష్క

తాజాగా ప్రభాస్ అనుష్కకు పుట్టిన రోజు కానుకగా బిఎమ్‌డబ్ల్యూ కారును బహుమానంగా ఇచ్చాడనే న్యూస్ ఇటు మీడియాలో... అటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. సోషల్ మీడియా మరియు ఇంటర్నెట్లో ఇదే న్యూస్ వైరల్‌గా మారింది.

ప్రభాస్ బిఎమ్‌డబ్ల్యూ కారు అనుష్క

నవంబర్ 7, 2017 వ తేదీన జన్మదిన వేడుకలు జరుపుకున్న టాలీవుడ్ అభిమాన తార అనుష్క శెట్టికి ప్రభాస్ బిఎమ్‌డబ్ల్యూ కారును బహుకరించినట్లు తెలిసింది. స్వీటికి కానుకిచ్చిన కారు గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.

ప్రభాస్ బిఎమ్‌డబ్ల్యూ కారు అనుష్క

వీరిద్దరి మధ్య కానుకలిచ్చుకునే స్నేహం ఎప్పుడో మొదలైంది. ప్రభాస్‌కు వాచీలంటే ఇష్టమని అనుష్క స్వయంగా ఒక వాచ్‌ను ప్రభాస్‌కు బహుకరించింది. ఇప్పుడు తాజాగా ప్రభాస్ స్వీటికి బిఎమ్‌డబ్ల్యూ కారును ఇచ్చాడు. మొత్తానికి ఇది ఎంత వరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

తన పుట్టిన రోజు సందర్భంగా డ్రైవర్‌కు ఖరీదైన గిఫ్ట్ ఇచ్చిన అనుష్క

English summary
Read In Telugu: Prabhas gifted bmw car to anushka shetty on birthday

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark