వేలానికి అమెరికా అధ్యక్షుడి సూపర్ కారు

Written By:

ఒకప్పటి డొనాల్డ్ ట్రంప్ గురించి చూస్తే అతనో పెద్ద వ్యాపార, పారిశ్రామిక మరియు రాజకీయవేత్త. మరి ఇప్పుడు, అమెరికా అధ్యక్షుడు. డొనాల్డ్ ట్రంపుకు కార్లంటే భలే ఇష్టం. అందుకోసం నచ్చిన కార్లన్నీ కొనేసుకుంటూ పోయాడు. అయితే అందులో నచ్చని వాటిని అమ్మేయడానికి ప్రయత్నించాడు. అప్పట్లో కుదరలేదు. కానీ ట్రంప్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు కదా... కాబట్టి తన కార్లను సులభంగా అమ్మేయగలడు.

వేలానికి అమెరికా అధ్యక్షుడి సూపర్ కారు

అమెరికా అధ్యక్షపీఠాన్ని అధిరోహించిన తరువాత డొనాల్డ్ ట్రంప్‌కు పట్టిందల్లా బంగారం అవుతోంది. అందుకే తాను అమ్మేయాలనుకున్న కార్లకు వేలం నిర్వహించడానికి సిద్దం అయ్యాడు. అందులో ఒకటి ఫెరారి ఎఫ్430 సూపర్ కారు.

వేలానికి అమెరికా అధ్యక్షుడి సూపర్ కారు

2007లో డొనాల్డ్ ట్రంప్ కొనుగోలు చేసిన ఈ ఫెరారి ఎఫ్430 కారుకు వేలం నిర్వహిస్తున్నారు. న్యూయార్క్ నగరంలో డొనాల్డ్ పేరు మీదుగా దీని రిజిస్ట్రేషన్ కలదు.

వేలానికి అమెరికా అధ్యక్షుడి సూపర్ కారు

ఈ మధ్యనే ట్రంప్ ఉపయోగించిన పాత క్యాడిల్లాక్ లిమో కారును కూడా వేలంలో అమ్మేశారు. కేవలం 2,400 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన ఈ కారును వేలం నిర్వాహకులు సుమారుగా3,50,000 అమెరికా డాలర్లకు అంటే రూ. 2.32 కోట్ల ధరతో విక్రయించనున్నారు.

వేలానికి అమెరికా అధ్యక్షుడి సూపర్ కారు

2007 లో కొనుగోలు చేసిన ఈ కారును ట్రంప్ 2011 మాత్రమే వినియోగించాడు. ఇప్పుడు దీనిని భద్రచపరిచినట్లు తెలిసింది.

వేలానికి అమెరికా అధ్యక్షుడి సూపర్ కారు

ఆక్షన్స్ అమెరికా వేలం నిర్వాహకులు మాట్లాడుతూ, ఇది డొనాల్డ్ ట్రంప్ వినియోగించిన కారు అని మాత్రమే కాకుండా, దీనిని ఆవిష్కరించిన సమయంలో అప్పట్లో ఇది అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కారుగా తెలుసని తెలిపారు.

వేలానికి అమెరికా అధ్యక్షుడి సూపర్ కారు

నూతన అమెరికా అధ్యక్షుడి కార్యాలయంలో రాష్ట్రపతిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. ఇతనికి కార్లంటే భలే పిచ్చి. కార్లను ఎంచుకునే విషయంలో కూడా ఇతనిది ప్రత్యేకమైన శైలి. ట్రంప్ వద్ద ఉన్న కార్ల వివరాల కోసం... డొనాల్డ్ ట్రంప్ కార్ కలెక్షన్

 
English summary
President Donald Trump’s Ferrari F430 Up For Grabs
Story first published: Tuesday, March 14, 2017, 12:34 [IST]
Please Wait while comments are loading...

Latest Photos