మహీంద్రా థార్ ఎక్కిన నరేంద్ర మోడీ [వీడియో]

'మహీంద్రా అండ్ మహీంద్రా' కంపెనీ యొక్క 'థార్' (Thar) ఎస్‌యువి కి మార్కెట్లో ఉన్న డిమాండ్ అంతా.. ఇంతా కాదు. ఇప్పటికి కూడా ఈ ఎస్‌యువి డెలివరీ కోసం ఎదురుచూస్తున్నవారు చాలామందే ఉన్నారు. మార్కెట్లో మహీంద్రా థార్ విడుదలైనప్పటి నుంచి ఈ రోజుకి కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతూనే ఉంది. అయితే ఈ మహీంద్రా థార్ మీద భారతదేశ ప్రధాని 'నరేంద్ర మోదీ' కనిపించారు. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

మహీంద్రా థార్ ఎక్కిన నరేంద్ర మోడీ [వీడియో]

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల గుజరాత్‌లోని వడోదరలో జరిగిన ఒక ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీలో నరేంద్ర మోడీ మహీంద్రా థార్ ఎస్‌యువిలో కనిపించారు. సాధారణంగా మోడీ ఎప్పుడూ ర్యాలీలలో లేదా ఇతర కార్యక్రమాల్లో తన ల్యాండ్ క్రూయిజర్ ఎస్‌యూవీలో కనిపిస్తారు. అయితే ఈ సారి దానికి భిన్నంగా 'మహీంద్రా థార్' లో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు.

మహీంద్రా థార్ ఎక్కిన నరేంద్ర మోడీ [వీడియో]

మహీంద్రా థార్ లో నరేంద్ర మోడీ ప్రజలకు అభివాదం చేస్తూ వెళ్తున్న దృశ్యాలు ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి. అంతే కాకుండా దీనికి ఇరువైపులా బాడీగార్డ్స్ నడుస్తూ వెళ్లడం కూడా చూడవచ్చు. మహీంద్రా థార్ హార్డ్ టాప్, సాఫ్ట్ టాప్ మరియు ఓపెన్ రూఫ్ అనే మోడల్స్ లో అందుబాటులో ఉంది. అయితే నరేంద్ర మోడీ ప్రయాణించిన థార్ ఓపెన్ రూఫ్ మోడల్ కి చెందినది. ఇక్కడున్న మహీంద్రా థార్ గుజరాత్ రాష్ట్రంలో రిజిస్టర్ చేసినట్లు ఇక్కడ చూడవచ్చు.

మహీంద్రా థార్ ఎక్కిన నరేంద్ర మోడీ [వీడియో]

మహీంద్రా థార్‌ రెండు ఇంజిన్ ఆప్సన్లను కలియు ఉంటుంది. ఇందులో ఒకటి 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కాగా, మరొకటి 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్. ఇందులోని 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 150 బిహెచ్‌పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఇది 130 బిహెచ్‌పి పవర్ మరియు 350 ఎన్ఎమ్ టార్క్ ఇస్తుంది. ఈ ఇంజన్‌లు 6 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో వస్తాయి. రెండు ఇంజిన్లలో కూడా 4x4 ఎంపిక అందుబాటులో ఉంది.

మహీంద్రా థార్ ఎక్కిన నరేంద్ర మోడీ [వీడియో]

కొత్త మహీంద్రా థార్ మరింత శక్తివంతమైనది మరియు మెరుగైనది. అంతే కాకుండా ఇందులో అద్భుతమైన సేఫ్టీ ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి, కావున కొత్త మహీంద్రా థార్ గ్లోబల్ NCAP టెస్ట్ లో సేఫ్టీలో ఏకంగా 4-స్టార్ రేటింగ్ పొందగలిగింది.

మహీంద్రా థార్ ఎక్కిన నరేంద్ర మోడీ [వీడియో]

మహీంద్రా థార్ ఎల్ఈడీ డిఆర్ఎల్ లు, అల్లాయ్ వీల్స్, హార్డ్ రూఫ్‌టాప్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఇసోఫిక్స్ మౌంట్‌లతో ఫార్వర్డ్-ఫేసింగ్ రియర్ సీట్లు మరియు ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటో తో టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లను పొందుతుంది. దీనితో పాటు, ఫిక్స్‌డ్ సాఫ్ట్ టాప్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఎబిఎస్, రియర్ పార్కింగ్ అసిస్ట్‌లు ప్రామాణికంగా ఇవ్వబడ్డాయి.

మహీంద్రా థార్ ఎక్కిన నరేంద్ర మోడీ [వీడియో]

మహీంద్రా థార్ ప్రత్యేకంగా ఆఫ్ రోడింగ్ ప్రేమికుల కోసం రూపొందినచబడిన ఆఫ్ రోడ్ వెహికల్. ఇది షిఫ్ట్-ఆన్-ఫ్లై ట్రాన్స్‌ఫర్ కేస్‌తో 4x4 డ్రైవ్ ట్రైన్ మరియు 2హెచ్, 4హెచ్ మరియు 4ఎల్ అనే మూడు మోడ్‌లను కలిగి ఉంది. అంతే కాకూండా దీనికి మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్, ఫ్రంట్ యాక్సిల్ కోసం ఎలక్ట్రిక్ డ్రైవ్‌లైన్ డిస్‌కనెక్ట్ మరియు బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్ కూడా ఉన్నాయి.

ఇదిలా ఉండగా మహీంద్రా కంపెనీ 2023-2026 నాటికి 5 డోర్స్ థార్ ఎస్‌యువిని విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. అంతే కాకుండా కంపెనీ భారతీయ మార్కెట్లో 2026 నాటికి 9 కొత్త మోడల్స్ విడుదల చేయడానికి ఆ దిశగా అడుగులు వేస్తోంది. మొత్తం మీద మహీంద్రా కంపెనీ రాబోయే రోజుల్లో మరింత ప్రజాదరణ పొందటానికి తగిన ప్రయత్నాలను చేస్తోంది.

మహీంద్రా థార్ ఎక్కిన నరేంద్ర మోడీ [వీడియో]

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారత ప్రధాని నరేంద్ర మోడీ మహీంద్రా థార్ ఆఫ్ రోడర్ లో కనిపించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే విపరీతమైన అమ్మకాలతో మంచి డిమాండ్ పొందుతున్న ఈ ఎస్‌యువి రానున్న రోజుల్లో మరింత దూకుడు అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Prime minister narendra modi rides thar suv in gujarat details
Story first published: Monday, June 20, 2022, 17:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X