ప్రియాంక చోప్రా లగ్జరీ కార్ కలెక్షన్: హీరోలు సైతం అసూయపడుతున్నారు

Written By:

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానుల హృదయాల్ని గెలుచుకుంది. బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ ఉన్న నటీమణిగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రియాంక ఎంచుకునే చిత్రాలే కాదు, తను ఎంచుకునే కార్లు కూడా విభిన్నంగా ఉంటాయి. నిజమే మరి, ఓ రేంజ్‌లో ఉన్న పెద్ద పెద్ద బాలీవుడ్ హీరోల వద్ద సైతం ఇలాంటి కార్లు ఉండవు.

ప్రతి రోజు కార్లు మరియు బైకుల గురించి చదివి విసుగ్గా అనిపిస్తోందా....? అందుకోసం సెలబ్రిటీ కార్ కథనంలో ప్రియాంక చోప్రా కార్ కలెక్షన్ గురించి డ్రైవ్‌స్పార్క్ తెలుగు స్పెషల్ స్టోరీ...

ప్రియాంక చోప్రా కార్ కలెక్షన్

రోల్స్ రాయిస్ ఘోస్ట్

ప్రియాకం చోప్రా కస్టమైజ్డ్ రోల్స్ రాయిస్ ఘోస్ట్ కలిగి ఉంది. రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు గల ఏకైక బాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా. అయితే, ఇప్పటికీ ఎంతో మంది బాలీవుడ్ హీరోలకు ఇదొక డ్రీమ్ కారుగా మాత్రమే ఉందంటే నమ్మండి. దీని ధర సుమారుగా రూ. 5 కోట్లుగా ఉంది.

ప్రియాంక చోప్రా కార్ కలెక్షన్

సాంకేతికంగా రోల్స్ రాయిస్ ఘోస్ట్ లగ్జరీ కారులో 6.6-లీటర్ సామర్థ్యం ఉన్న ట్విన్ టుర్బో వి12 ఇంజన్ కలదు. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల ఇది గరిష్టంగా 563బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేస్తుంది.

ప్రియాంక చోప్రా కార్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్

ప్రియాంక చోప్రా కార్ల కలెక్షన్‌లో మెర్సిడెస్ బెంజ్ వారి ఎస్-క్లాస్ ప్రీమియమ్ లగ్జరీ సెడాన్ స్థానం సంపాదించుకుంది. దీని ప్రారంభ ధర సుమారుగా రూ. 1.1 కోట్లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

ప్రియాంక చోప్రా కార్ కలెక్షన్

ఎస్-క్రాస్ క్లాసీ లుక్‌తో లగ్జరీ సెడాన్‌ను కలిగి ఉంది. సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ట్రావెల్ మెర్సిడెస్ ఎస్-క్లాస్‌తో సాధ్యమవుతుంది. వెహికల్ సేఫ్టీ విషయంలో మెర్సిడెస్ ఎస్-క్లాస్ కు ఎంతో మంది సెలబ్రిటీలు ఓటు వేశారు.

ప్రియాంక చోప్రా కార్ కలెక్షన్

పోర్షే కయీన్

పోర్షే అంటే ముందుగా గుర్తొచ్చేది సూపర్ మరియు స్పోర్ట్స్ కార్లు. మరి ఇది చూడటానికి ఎస్‌యూవీలా ఉందే అనుకుంటున్నారా...? ఇది నిజంగానే పోర్షే రూపొందించిన ఎస్‌యూవీ. అత్యంత ఖరీదైన లగ్జరీ ఎస్‌యూవీలలో కయీన్ ఒకటి. ఇలాంటి అరుదైన కారు ప్రియాంక కార్ల కలెక్షన్‌లో చేరింది.

ప్రియాంక చోప్రా కార్ కలెక్షన్

పోర్షే తమ కయీన్ లగ్జరీ ఎస్‌యూవీలో 300బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగల 3.6-లీటర్ల సామర్థ్యం గల ఇంజన్ కలదు. గరిష్టంగా గంటకు 260కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఇందులో విశాలమైన క్యాబిన్ మరియు ఎన్నో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీచర్లు ఉన్నాయి.

ప్రియాంక చోప్రా కార్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ ఇ-క్లాస్

మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ సెడాన్ రేంజ్‌లో మరో వెర్షన్ ఇ-క్లాస్. విశాలమైన ఇంటీరియర్‌లో ఇ-క్లాస్‌ ప్రియాంక వద్ద ఉంది. డబ్బుకు తగ్గ విలువలతో మెర్సిడెస్ దీనిని రూ. 50 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరతో అందుబాటులో ఉంచింది.

ప్రియాంక చోప్రా కార్ కలెక్షన్

పొడవాటి మెర్సిడెస్ ఇ-క్లాస్ ఇంటీరియర్‌లో అత్యుత్తమ నాణ్యత గల లెథర్ సీట్లు, సేఫ్టీ ఎయిర్ బ్యాగులు, ఏ/సి అత్యాధునిక సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఎక్ట్సీరియర్‌లో ఆకర్షణీయమైన ఫ్రంట్ గ్రిల్, ఎల్ఇడి హెడ్ ల్యాంప్స్, పగటి పూట వెలిగే ఎల్ఇడి లైట్లు టెయిల్ ల్యాంప్స్ మరియు 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

ప్రియాంక చోప్రా కార్ కలెక్షన్

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్

బిఎమ్‌డబ్ల్యూ సెడాన్ శ్రేణి కార్లలో 7-సిరీస్ ఖరీదైన మోడల్. ప్రియాంక ఎంచుకున్న బిఎమ్‍‌డబ్ల్యూ కార్లలో 7-సిరీస్ అంటే తనకు ఎంతో ఇష్టం. బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ ధరల శ్రేణి రూ. 1.1 నుండి 1.95 కోట్ల మధ్య ఎక్స్-షోరూమ్‌గా ఉంది.

ప్రియాంక చోప్రా కార్ కలెక్షన్

బిఎమ్‌డబ్ల్యూ ఈ 7-సిరీస్‌ను భద్రత మరియు సౌకర్యానికి పెద్ద పీట వేస్తూ నిర్మించింది. సౌకర్యవంతమైన ఇంటీరియర్, లెథర్ సీట్లు, ఇన్ఫోటైన్‌మెంట్ టచ్ స్క్రీన్, పూర్తి స్థాయి భద్రత ఫీచర్లు దీని సొంతం. అంతే కాకుండా డిజైన్ పరంగా కూడా 7-సిరీస్‌గా ఇండియాలో మంచి క్రేజ్ ఉంది.

ప్రియాంక చోప్రా కార్ కలెక్షన్

ప్రియాంక చోప్రా వద్ద మరిన్ని లగ్జరీ కార్లతో పాటు పింక్ కలర్‌లో ఉన్న హ్యార్లీ డేవిడ్‌సన్ బైకు కూడా ఉంది. దీని ధర సుమారుగా రూ. 6 లక్షల రుపాయలుగా ఉంది. తనకు ఎంతో ఇష్టమైన పింక్‌ కలర్‌లోకి మార్పించుకుంది.

English summary
Read In Telugu: Priyanka chopra luxury car collection
Story first published: Saturday, September 16, 2017, 16:09 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark