కారు బోనెట్‌లో చేరిన భారీ కొండ చిలువ.. మీరు ఎప్పుడూ ఇలాంటిది చూసుండకపోవచ్చు

వాతావరణం చల్లగా ఉందంటే పాములు, తేళ్లు వంటి విష జీవులు కార్లు మరియు బైకుల్లో చేరిపోతాయి. ఇలాంటి సంఘటనలు గతంలో చాలా చదువుకున్నాం.

ఇటీవల ఒక ఫోక్స్‌వ్యాగన్ కారులో ఒక భారీ కొండా చిలువ చేరి అక్కడే ఉండిపోయింది, అయితే ఆ కారు ఓనర్ ఆ కారుని సర్వీస్ స్టేషన్ కి తీసుకెళ్లినప్పుడు అసలు విషయం బయటపడింది.

కారు బోనెట్‌లో చేరిన భారీ కొండ చిలువ

నివేదికల ప్రకారం, ఫోక్స్‌వ్యాగన్ పోలో కారుని యజమాని సర్వీస్ కోసం సర్వీస్ సెంటర్ కి తీసుకెళ్లాడు. అయితే ఈ కారుని మెకానిక్ రెండు రోజులు తరువాత ఓపెన్ చేసాడు. బోనెట్ ఓపెన్ చేయగానే ఈ భారీ కొండ చిలువ కంటపడింది. ఇది చూడగానే ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ కొండ చిలువను చూడటానికి చాలామంది జనం గుమికూడారు.

ఆ కొండ చిలువను చూస్తూ చాలామంది అక్కడే ఉండిపోయారు, ఆ సమయంలో గోవాకి చెందిన ఒక ఎమ్మెల్యే అక్కడికి వచ్చి ఆ కొండ చిలువను రక్షించారు. నిజానికి ఆ కారుని రెండు రోజులు ఒకే దగ్గర నిలిపి ఉంచినప్పుడు కొండ చిలువ లోపలికి చేరి ఉండే అవకాశం ఉంటుంది. అంతే కాకూండా లోపల వెచ్చగా ఉండటం వల్ల విశ్రాంతి తీసుకుంటూ ఉండిపోయింది.

ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మొదట ఆ మెకానిక్ కారులోని కొండ చిలువను బలంగా బయటకు లాగడానికి ప్రయత్నించాడు. కానీ ప్రయత్నం మొత్తం వృధా అయిపోయింది. అయితే ఇంక చేసేది లేక కర్రలను ఉపయోగించాలనుకున్నాడు. అయితే చివరికి పాములు పట్టే వ్యక్తిని పిలిపించి దానిని పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

ఫోక్స్‌వ్యాగన్ పోలో కారులో పట్టుబడిన కొండ చిలువ ఇండియన్ రాక్ పైథాన్ జాతికి చెందినది. కావున ఇది విషపూరితమైనది కాదు, ఇలాంటి పాముల వల్ల పెద్దగా ప్రాణహాని ఉండే అవకాశం లేదు. కానీ పాము ఏదైనా (విష పూర్తితమైన & విషరహితమైన) చూడగానే భయపడటం మానవ సహజం కాబట్టి, ఇలాంటి సంఘటనలు తప్పకుండా చూసే వారికి భయాన్ని కలిగిస్తాయి.

కారు బోనెట్‌లో చేరిన భారీ కొండ చిలువ

ఇదిలా ఉండగా గత కొన్ని రోజులకు ముందు ముంబైలో ఒక ఒక భారీ కొండ చిలువ కారణంగా ఎక్కువ ట్రాఫిక్ ఏర్పడింది. కొచ్చిలో ఓడరేవు మరియు ఎయిర్ పోర్టుని కలిపే రెండు మార్గాల రోడ్డుపైన కొండ చిలువ పాకుతూ కనిపించింది. ఈ పాము చాలా పొడవుగా ఉన్న కారణంగా రోడ్డు దాటటానికి కొంత సమయం పట్టింది.

పాములు వాహనాల్లో చేరటంపై మా అభిప్రాయం:

పాముల వంటి సరీసృపాలు చల్లని రక్తం కలిగిన జీవులు, ఈ కారణంగానే అవి ఎప్పటికప్పుడు అవి వెచ్చని వాతావరణంలో చేరటానికి ప్రయత్నిస్తాయి. ఈ సమయంలో ఏ చిన్న పాటి దారులు వాటికి కనిపించిన అక్కడికి చేరి వెచ్చగా అక్కడే ఉండిపోతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడంతోపాటు, కొత్త కార్లు మరియు కొత్త బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Python found resting inside volkswagen polo
Story first published: Saturday, November 19, 2022, 17:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X