ఈ బుల్లి ఫోక్స్‌వ్యాగన్ బీచ్ బాంబ్ విలువ రూ.1.1 కోట్లకు పైమాటే!

హాట్ వీల్స్ కార్లంటే పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా ఇష్టం. ప్రత్యేకించి హాట్ వీల్స్ మోడళ్లను కలెక్ట్ చేసే హాబీ ఉన్న వారికి వీటిపై ఉండే ఇష్టం గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఎంత డబ్బు అయినా సరే చెల్లించి ఈ బుల్లి కార్లను కొనేస్తుంటారు హాట్ వీల్స్ కార్ కలెక్టర్లు.

ఈ బుల్లి ఫోక్స్‌వ్యాగన్ బీచ్ బాంబ్ విలువ రూ.1.1 కోట్లకు పైమాటే!

సాధారణంగా ఒక హాట్ వీల్ కారు ఖరీదు రూ.60 నుంచి ప్రారంభమవుతుంది, మహా అయితే దీని ధర రూ.1,000 వరకూ ఉంటుంది. కానీ, ఈ ఫొటోలో కనిపిస్తున్న పింక్ కలర్ ఫోక్స్‌వ్యాగన్ బీచ్ బాంబ్ హాట్ వీల్ విలువ 1,50,000 డాలర్లకు పైమాటే. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1.1 కోట్లకు పైగా ఉండొచ్చు.

ఈ బుల్లి ఫోక్స్‌వ్యాగన్ బీచ్ బాంబ్ విలువ రూ.1.1 కోట్లకు పైమాటే!

ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోక్స్‌వ్యాగన్ ప్రోటోటైప్‌గా కీర్తిని దక్కించుకుంది. ఈ కారు అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన హాట్ వీల్ కార్ కలెక్టర్ బ్రూస్ పాస్కల్ వద్ద ఉంది. ఆయన వద్దే ఇంకా 4,000 లకు పైగా హాట్ వీల్ మోడళ్లు మరియు 3,000 లకి పైగా జ్ఞాపికలు (మెమొరబిలియా) ఉన్నాయి.

MOST READ:వావ్.. ఇది నిజమేనా? మైండ్‌తో కంట్రోల్ అయ్యే హోండా మోటార్‌సైకిల్!

ఈ బుల్లి ఫోక్స్‌వ్యాగన్ బీచ్ బాంబ్ విలువ రూ.1.1 కోట్లకు పైమాటే!

ఈ చిన్న హాట్ వీల్ ప్రోటోటైప్ వెల దాని అసలు మోడల్ కంటే కూడా 64 రెట్లు ఖరీదైనది. బ్రూస్ పాస్కల్ వద్ద హాట్ వీల్ కార్ కలెక్షన్‌లోనే ఇది అత్యంత ఖరీదైనది. ఈ ప్రోటోటైప్ యొక్క అసలు మోడల్‌ని 1969 సంవత్సరంలో ఫోక్స్‌వ్యాగన్ విడుదల చేసింది. ఆ తర్వాతి సంవత్సరంలోనే హాట్ వీల్స్ కూడా తమ వ్యాపారాన్ని తొలిసారిగా ప్రారంభించింది.

ఈ ప్రోటోటైప్ హాట్ వీల్స్ కారు యొక్క ప్రత్యేకత ఏంటంటే, హాట్ వీల్స్ సంస్థ ఇలాంటి పింక కలర్ ఫోక్స్‌వ్యాగన్ బీచ్ బాంబ్ కార్లను అప్పట్లో రెండింటిని మాత్రమే తయారు చేసింది. ఇందులో ఇప్పుడు ఒక్కటి మాత్రమే ఇప్పటికే అదే కండిషన్‌లో పాస్కల్ వద్ద ఉంది.

ఈ బుల్లి ఫోక్స్‌వ్యాగన్ బీచ్ బాంబ్ విలువ రూ.1.1 కోట్లకు పైమాటే!

ఫోక్స్‌వ్యాగన్ ఈ వాహనం యొక్క మొదటి ప్రోటోటైప్‌ను బీచ్ థీమ్ కోసం తయారు చేసింది. మొదట్లో దీనిని వెనుక విండ్‌షీల్డ్ ప్రాంతాన్ని ఓపెన్‌గా ఉంచి, అందులో నుండి సర్ఫ్‌బోర్డులను బయటకు ఉండేలా డిజైన్ చేసింది. అయితే, నిటారుగా లేదా ఏటవాలుగా ఉండే రోడ్లపై సర్ఫ్ బోర్డులు జారిపోవడాన్ని గుర్తించి ఆ తర్వాత ఈ వాహనం డిజైన్‌ను మార్చివేసింది.

MOST READ:నమ్మండి ఇది నిజంగా హీరో స్ప్లెండర్ బైక్, కావాలంటే వీడియో చూడండి

ఈ బుల్లి ఫోక్స్‌వ్యాగన్ బీచ్ బాంబ్ విలువ రూ.1.1 కోట్లకు పైమాటే!

ఆ తర్వాత ఫోక్స్‌వ్యాగన్ ఈ వాహనానికి ఇరువైపులా మందపాటి ప్యానెళ్లను అమర్చి, వాటిలో ప్రతి వైపు ఒక్కొక్కటి చొప్పున రెండు సర్ఫ్ బోర్డులను ఉంచడానికి వీలుగా డిజైన్ చేసింది. ఈ మోడల్ అప్పట్లో మంచి ప్రజాదరణ పొందింది. దీంతో మొదట డిజైన్ చేసిన బీజ్ బాంబ్ ప్రోటోటైప్ కేవలం కాన్సెప్ట్‌కి మాత్రమే పరిమితమైపోయి, చరిత్రలో మిగిలిపోయింది.

ఈ బుల్లి ఫోక్స్‌వ్యాగన్ బీచ్ బాంబ్ విలువ రూ.1.1 కోట్లకు పైమాటే!

ఏదైనా వాహనాలకు సంబంధించిన ప్రోటోటైప్‌లు చాలా విలువైనవి మరియు అరుదైనవి. వీటిని ఎవ్వరికి పడితే వారికి చూపించరు, కానీ హాట్ వీల్స్ సంస్థ మాత్రం వీటిని సదరు కంపెనీలతో చర్చలు జరిపి ఇలాంటి అరుదైన కార్ల మోడళ్లను నమూనాలను సేకరించి హాట్ వీల్స్ రూపంలో తయారు చేస్తుంటుంది.

MOST READ:భారతదేశ మసాలా కింగ్ ధరంపాల్ గులాటి కార్లు.. మీరు చూసారా !

Most Read Articles

English summary
Rarest Volkswagen ‘Beach Bomb’ Prototype Sold At 1.5 Lakh Dollars Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X