రిపబ్లిక్ డే వేడుకలకు అతిథిగా విచ్చేసిన అబుదాబి మహారాజు గారి అత్యంత ఆడంబరమైన విమానం
అబుదాబి ఆరబ్ రాజు గారు 68 వ రిపబ్లిక్ వేడుకలను ప్రత్యేక అథిగా విచ్చేసారు. అయితే ఆయన విమానం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అత్యంత ఆరంభడమైన విమానం గురించి చూద్దాం రండి...
68 వ గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా అంగరంగవైభవంగా జరిగాయి. ఢిల్లీలో జరిగిన వేడుకలకు అబుదాబి మహారాజు ప్రత్యేక అతిథిగా విచ్చేశారు. అయితే అరబ్ రాజు విమానంలో ఎవరో ఒకరు రహస్యంగా వీడియో తీసారు, ఇప్పుడది సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ఆ విమానంలో ఉన్న ఫీచర్ల సంగతేంటో చూద్దాం రండి....

అత్యంత విలాసవంతమైన లగ్జరీ విమానం యొక్క ఇంటీరియర్ ఫీచర్లను తెలిపే వీడియో ఒకటి సాంఘిక మాధ్యమాలలో తీవ్రంగా చక్కర్లు కొట్టింది, అయితే ఇది జనవరి 26, రిపబ్లిక్ డే వేడుకలకు అతిథిగా హాజరైన అబుదాబి రాజు అరబ్ షేక్ షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ కు చెందిన విమానం అని తెలిసింది.

ముందుగా వాట్సాప్ ద్వారా బయటకు వచ్చిన వీడియో కాసేపటికి యూట్యూప్ లోకి అప్‌లోడ్ అయ్యింది. రెండు నిడివి గల వీడియో విమానంలోని అన్ని సౌకర్యాలను బంధించింది.

పరిమిత సీటింగ్ సామర్థ్యం గల సీటింగ్ హాలు, పెద్ద డిస్ల్పే, చిన్న చిన్న మీటింగ్ హాళ్లు విమానానికి ఒక భాగంలో ఉన్నాయి. మరియు విమానానికి ఇంకో భాగంలో వ్యక్తిగతంగా సేదతీరడానికి ఇంటిని తలపించే ఇంటీరియర్ కలదు.

వాష్ బే, బాత్ రూమ్, విశ్రాంతి గది, డైనింగ్ హాలు, వంట గదితో పాటు వస్త్రాలను భద్రతపరిచే ప్రదేశం కలదు. చిన్న పరిమాణంలో ఉన్న ప్రతి వ్యక్తిగత క్యాబిన్ కూడా విలాసవంతమైన సోఫాలను కలిగింది.

మీటింగ్ హాలు మరియు పడక గదిలో టెలివిజన్‌లను ఏర్పాటు చేశారు. చాలా అరుదుగా ఇలాంటి ఇంటీరీయర్ హంగులతో విమానాన్ని నిర్మిస్తుంటారు. అయితే ఇది మాత్రం అబుదాబి రాజు గారి సౌకర్యార్థం నిర్మించుకున్నట్లు తెలిసింది.

ఇంటీరియర్ లో ఫీచర్లు కాకుండా నిర్మాణం గురించి చర్చించుకుంటే, ఇంటీరియర్‌లోని పై భాగం మొత్తం చిన్న చిన్న లైటింగ్స్ తో కూడిన ఆకర్షణీయమైన సీలింగ్ కలదు.

తక్కువ బరువు ఉండేదుకు గదులను మరియు హాళ్లను వేరు చేసేందుకు కలపను మరియు లైట్ వెయిట్ ఉండే విధంగా సోఫా మరియు బెడ్ లను అందివ్వడం జరిగింది.

ప్రస్తుతం అరబ్ షేక్ షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ గారి మొత్తం సంపద 23 బిలియన్ డాలర్లుగా ఉంది.
- ఒక్క బిలియన్ అనగా 100 కోట్ల రుపాయలు,
- 1 బిలయన్ డాలర్లు అనగా 6,800 కోట్లు రుపాయలు,
- మన ఇండియన్ కరెన్సీలో ఇతని సంపద మొత్తం 1,56,400 కోట్ల రుపాయలన్నమాట.
అతిథిగా విచ్చేసిన అబుదాబి రాజు గారి విమానం ఇంటీరియర్‌లోని ఫీచర్లను వీడియో ద్వారా వీక్శించగలరు....

వీరితో మీ కల తీరినట్లే...!!
పైలట్లు ప్రయాణికులతో షేరు చేయకుండా దాచే విషయాలు

బంగారపు విమానాన్ని కలిగి ఉన్న సుల్తాన్ ఆఫ్ జోహార్
ఎయిర్ ఫోర్స్ వన్ విమానం చారిత్రాత్మక విషయాలు


Click it and Unblock the Notifications








