అత్యంత విలాసవంతమైన లగ్జరీ కారు కొనుగోలు చేసిన ఐపిఎల్ స్టార్ రిషభ్ పంత్

Written By:

ఐపిల్ ప్రారంభానికి ముందే వివిధ జట్ల యాజమాన్యం క్రికెటర్లను వేలం ద్వారా దక్కించుకుంటారు. అందులో భాగంగానే రిషభ్ పంత్‌ను క్రికెటర్‌ను వేలంలో రూ. 1.9 కోట్లు వెచ్చించి ఢిల్లీ డేర్ డెవిల్స్ యాజమాన్యం కొనుగోలు చేసింది.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన ఐపిఎల్ స్టార్ రిషభ్ పంత్

ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడి అద్బుత ఆట తీరును ప్రదర్శించిన రిషభ్ పంత్ ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి లగ్జరీ ఎస్‌యూవీని కొనుగోలు చేశాడు.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన ఐపిఎల్ స్టార్ రిషభ్ పంత్

తన ఆట తీరుతో జట్టు మొత్తాన్ని ఆకట్టుకున్న రిషభ్ పంత్ తనకు తానుగా ఓ లగ్జరీ కారును బహుమానంగా ఇచ్చుకున్నట్లు పంత్ అభిమాన బృందం ఫేస్‌బుక్‌లో కొన్ని ఫోటోలను అప్‌లోడ్ చేసింది. .

లగ్జరీ కారు కొనుగోలు చేసిన ఐపిఎల్ స్టార్ రిషభ్ పంత్

మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ శక్తివంతమైన ఎస్‌యూవీ. దీని ఎక్ట్సీరియర్ డిజైన్ శైలి మరియు ఇంటీరియర్ ఫీచర్లు దీని ఆఫ్ రోడ్ లక్షణాలను స్పష్టం చేస్తాయి.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన ఐపిఎల్ స్టార్ రిషభ్ పంత్

విలాసవంతమైన ఈ మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్‌లో సౌకర్యవంతమైన లగ్జరీ సీట్లు, ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్టు చేసుకునే సదుపాయం ఉన్న సీట్లు, ఆటోమేటిక్ ప్యానరోమిక్ సన్ రూఫ్ మరియు ఇతర ప్రధానమైన ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన ఐపిఎల్ స్టార్ రిషభ్ పంత్

భద్రత పరంగా మెర్సిడెస్ బెంజ్ ఈ జిఎల్‌సిలో బ్రేకింగ్ పనితీరును పెంచేందుకు ఇందులో ఇంటెలిజెంట్ ఇంటర్వెన్షన్ పరిజ్ఞానాన్ని అందించడం జరిగింది. ఒక వేళ నీటిలో డ్రైవ్ చేస్తున్నపుడు డిస్క్ బ్రేకులకు తమే తగలకుండా చేస్తుంది.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన ఐపిఎల్ స్టార్ రిషభ్ పంత్

సాంకేతికంగా మెర్సిడెస్ బెంజ్ ఈ జిఎల్‌సి లగ్జరీ ఎస్‌యూవీ రెండు విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి, జిఎల్‌సి 300 4మ్యాటిక్ మరియు జిఎల్‌సి 220డి 4మ్యాటిక్.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన ఐపిఎల్ స్టార్ రిషభ్ పంత్

జిఎల్‌సి 300 4మ్యాటిక్ వేరియంట్లో 2.0-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా బిహెచ్‌పి పవర్ మరియు ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును, ఈ శక్తివంతమైన ఇంజన్‌కు 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన ఐపిఎల్ స్టార్ రిషభ్ పంత్

జిఎల్‌సి 220డి 4మ్యాటిక్ వేరియంట్లో 2.2-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 168బిహెచ్‌పి పవర్ మరియు 400ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. దీనికి కూడా 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

లగ్జరీ కారు కొనుగోలు చేసిన ఐపిఎల్ స్టార్ రిషభ్ పంత్

ఐపిఎల్ సీజన్ ముగిసిన తరువాత రిషభ్ పంత్ కొనుగోలు చేసిన ఈ మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి లగ్జరీ ఎస్‌‌యూవీని సుమారుగా 65 లక్షల వరకు వెచ్చించి కొనుగోలు చేసినట్లు తెలిసింది.

English summary
Read In Telugu IPL Star Rishabh Pant Treats Himself To A Mercedes-Benz GLC
Story first published: Thursday, May 25, 2017, 15:10 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark