కొత్త కారుతో పట్ట పగలు, ఢిల్లీలో, మెరుపు వేగంతో రెచ్చిపోయిన క్రికెటర్ రిషభ్ పంత్

Written By:

రిషభ్ పంత్, ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులో అద్బుతమైన ఆట తీరును ప్రదర్శించిన కుర్ర క్రికెటర్‌గా గత రెండు ఐపిఎల్ సీజన్స్ నుండి మనకు బాగా సుపరిచతం. అయితే ఐపిఎల్ ముగిసిన తరువాత మంచి ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఎస్‌యూవీ కొనుగోలు చేసి వార్తల్లోకి వచ్చిన రిషభ్, ఇప్పుడే అదే కారు గురించి మరో సారి వార్తల్లోకెక్కాడు.

To Follow DriveSpark On Facebook, Click The Like Button
క్రికెటర్ రిషభ్ పంత్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి

19 ఏళ్ల ఈ యువ క్రికెటర్ రిషభ్ కెరీర్‌ ఓ పెద్ద మలుపు తిరిగిందని చెప్పవచ్చు. వరుసగా 2016 మరియు 2017 ఐపిల్ సీజన్‌లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడి ఉత్తమ ప్రదర్శన కనబరిచి మంచి స్థానం సంపాదించుకున్నాడు.

క్రికెటర్ రిషభ్ పంత్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి

ఆట తీరుకు తగ్గట్లుగా రిషభ్ పంత్‌ను రూ. 1.9 కోట్లకు ప్రారంభంలో వేలం పాట ద్వారా దగ్గించుకుంది టీమ్ ఢిల్లీ డేర్ డెవిల్స్. వేలంతో పాటు ప్రతి మ్యాచ్‌కు కూడా మంచి పారితోషకాన్ని అందుకుంటూ వచ్చాడు.

క్రికెటర్ రిషభ్ పంత్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి

ఈ మధ్యనే తనకు అత్యంత ఇష్టమైన మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి ఎస్‌యూవీని కొనుగోలు చేసి అందరినీ ఆశ్యర్యపరిచాడు. ఈ ఎస్‌యూవీ ధర రూ. 65 లక్షల వరకు ఉంది. ఇంత వరకూ బాగానే ఉంది. అయితే తాజాగా మరోసారి వార్తల్లోకెక్కాడు.

క్రికెటర్ రిషభ్ పంత్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి

భయంకరమైన వేగంతో ఢిల్లీ రోడ్ల మీద చక్కర్లుకొడుతున్న వీడియోను రిషభ్ పంత్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకున్నాడు. ఆ వీడియోలో కారు వేగం గంటకు 120కిలోమీటర్లు దాటిపోవడం గమనార్హం.

క్రికెటర్ రిషభ్ పంత్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి

అతను ప్రయాణిస్తున్న రోడ్డు మీద టూ వీలర్ల, కార్లు, భారీ వాహనాలు కూడా వెళుతున్నాయి. కానీ, వాటన్నింటిని అధిగమించుకుంటూ మెరుపు వేగంతో దూసుకుపోతూ డ్రైవ్ చేశాడు.

క్రికెటర్ రిషభ్ పంత్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి

ఆ వీడియో చూస్తే, ఎలాంటి ప్రమాదం జరగకూడదు అని మన మనసులో అనుకుంటాం. ఇలా డ్రైవ్ చేస్తున్నపుడు వాహనం అదుపు తప్పితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.

క్రికెటర్ రిషభ్ పంత్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి

నిజానికి ఢిల్లీలో గరిష్టం వేగ పరిమితి గంటకు 120 కిలోమీటర్లుగా ఉంది. మరియు రిషభ్ స్వయంగా అప్ లోడ్ చేసిన వీడియోలో కారు వేగం గరిష్టంగా 128 కిలోమీటర్లుగా ఉంది. మరి దీనిపై ఢిల్లీ పోలీసులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనదే స్పష్టం కాలేదు.

క్రికెటర్ రిషభ్ పంత్ మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌సి

కొత్త కారు కొన్న తరువాత దానిని వీలైనంత వరకు గరిష్ట వేగంతో నడపాలనే కుతూహలం ఉంటుంది. కానీ ఇలా పబ్లిక్ రోడ్ల మీద ప్రయత్నించకూడదు. అయితే ఎలాంటి ప్రమాదం చేయకుండా సురక్షితంగా తన జర్నీ పూర్తి చేసుకున్నాడు యువ క్రికెటర్.

రిషభ్ పంత్ ఢిల్లీ రోడ్ల మీద గరిష్ట వేగంతో ప్రయాణించడాన్ని వీడియో ద్వారా వీక్షించండి, గరిష్టంగా 133కిమీల వేగాన్ని అందుకోవడం ఇక్కడ గమనించగలరు...

English summary
Read In Telugu Rishabh Pant Posted Video Driving New Mercedes Might Land Trouble
Story first published: Saturday, May 27, 2017, 14:28 [IST]
Please Wait while comments are loading...

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark