కాంగోలో ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తున్న మరమనుషులు..

By Ravi

మరికొద్ది దశాబ్ధాల్లో మనుషుల్ని మరమనుషులు (రోబోలు) శాసించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో.. ఇది ఇక్కడ చూడండి, ఓ మరమనిషి ట్రాఫిక్ రద్దీని ఎలా కంట్రోల్ చేస్తుందో.. ఈ విచిత్రం ఎక్కడనుకుంటున్నారా.. కాంగో దేశంలో.

డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డిఆర్‌సి) రాజధాని కిన్షాసాలో ఈ రోబో ట్రాఫిక్ పోలీసులు అడుగడుగునా కనిపిస్తాయి. కిన్షాసా నగరం కూడా ప్రపంచంలోని ఇతర ప్రధాన నగరాల మాదిరిగా ట్రాఫిక్ ఇక్కట్లతో సతమయ్యేది. ఇందుకు పరిష్కారంగా అక్కడి ట్రాఫిక్ అధికారులు రోబో కాప్స్‌ను ప్రవేశపెట్టడంతో పరిస్థితి కొంత వరకు సద్దుమణిగింది.

మరిన్ని ఫొటోలు, వివరాలు, వీడియోను ఈ ఫొటో ఫీచర్‌లో వీక్షించండి.

కాంగోలో ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తున్న రోబోలు

ఈ రోబో ట్రాఫిక్ పోలీస్ 8 అడుగుల పొడవు ఉంటుంది, వీటిని స్థానిక ఇంజనీర్లే అభివృద్ధి చేశారు.

కాంగోలో ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తున్న రోబోలు

ఇవి సౌరశక్తి సాయంతోను అలాగే విద్యుచ్ఛక్తి సాయంతోను పనిచేస్తాయి. ఈ రోబోల తల పైభాగంలో సోలార్ ప్యానెల్ అమర్చబడి ఉంటుంది. సూర్మరశ్యి ఎక్కువగా ఉన్న సమయాల్లో సౌకరశక్తిని గ్రహించి, దానిని బ్యాటరీలలో నిక్షిప్తం చేసుకొని, రాత్రివేళల్లో వినియోగించుకుంటాయి.

కాంగోలో ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తున్న రోబోలు

ఈ రోబో కాప్స్ కేవలం లైట్లతో కూడిన రోడ్డు సంకేతాలనే కాకుండా, ధ్వనితో కూడిన సంకేతాలు కూడా అందజేస్తాయి. మోటారిస్టులు, పాదచారులు ఎప్పుడు ఆగాలి, ఎప్పుడు రోడ్డును దాటాలి తదితర అంశాలను మాటల రూపంలో తెలియజేస్తాయి.

కాంగోలో ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తున్న రోబోలు

ఇవి కేవలం మర బొమ్మలే కదా, మనల్నేం చేస్తాయిలే అని వీటి సంకేతాలను పట్టించుకోకుండా నిబంధనలు అతిక్రమిస్తే, జరిమానా తప్పదు.

కాంగోలో ట్రాఫిక్‌ని కంట్రోల్ చేస్తున్న రోబోలు

ఈ రోబోలు హై రెజల్యూషన్ సిసిటివి కెమెరాలతో అమర్చబడి ఉంటాయి. నిబంధనలు అతిక్రమించిన వాహనాన్ని గుర్తించి, సదరు వాహన యజమాని పేరుపై చలాన్ జనరేట్ చేస్తాయి. వీటిని ట్రాఫిక్ అధికారులు సదరు వాహన యజమాని ఇంటికి పంపిస్తారు.

వీడియో

కాంగోలో ఏర్పాటు చేసిన ఈ రోబో ట్రాఫిక్స్ కాప్స్ ఎలా పనిచేస్తాయో ఈ వీడియోలో వీక్షించండి.

Most Read Articles

English summary
Traffic in Triomphal and Lumumba, two of the busiest intersections in Kinshasa, is not handled by human traffic cops who would feel tired and face hardships in the sun and pollution throughout the day. Their jobs have been taken over by, what are perhaps, the world's first real life RoboCops.
Story first published: Saturday, March 1, 2014, 11:55 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X