అయ్యయ్యో.. కోట్ల రూపాయల కారుతో ఇలా చేస్తున్నాడేంటి?

Written By:

సాధారణంగా మనలో ఎవరైనా నాలుగైదు లక్షల రూపాయల ఖరీదు చేసే కారునే ఎంతో అపురూపంగా చూసుకుంటూ ఉంటాం. కారుపై చిన్న గీత పడినా అల్లల్లాడిపోతుంటాంది. అలాంటిది నాలుగైద కోట్ల రూపాయల ఖరీదు చేసే కారును ఇంకెంత అపురూపంగా చూసుకోవాలి.

కానీ, ఈ ప్రబుద్ధుడు మాత్రం ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన, అరుదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారుతో డర్ట్ ర్యాలీ ట్రాక్‌పై చేసే ఫీట్ చూస్తే, అతనికి డబ్బు ఎక్కువైనా ఉండాలి లేదా పిచ్చి ముదిరైనా ఉండాలి అనిపిస్తుంది. వాస్తవానికి రోల్స్ రాయిస్ తయారు చేసే కార్లు ఎంత ధృడంగా ఉన్నప్పటికీ, వీటిని స్మూత్‌గా ఉండే టార్‌మ్యాక్ రోడ్లపై నడిపితేనే అందులోని విలాసాన్ని ఆస్వాధించడం సాధ్యమవుతుంది. అంతేకానీ, ఇలా పిచ్చి పిచ్చిగా డ్రైవ్ చేస్తే, రిపేరుకయ్యే ఖర్చు తడిసి మోపెడు అవుతుంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారులో 6749సీసీ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 460 బిహెచ్‌పిల శక్తిని, 720 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ ఆప్షన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారుతో ఈ ఘనుడు చేసిన ఫీట్‌ను మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి.

<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/I-pzol0sxro?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

కార్లను పోల్చు

రోల్స్ రాయిస్ ఫాంటమ్
రోల్స్ రాయిస్ ఫాంటమ్ వేరియంట్‌ను ఎంచుకోండి
-- పోల్చడానికి కారును ఎంచుకోండి --
English summary
Today in our video of the day we have a Rolls-Royce Phantom, which is doing duty on the rally track. You have to see it to believe it—a Rolls-Royce getting dirty in the mud and sliding all over the place. In our honest opinion, we would never do this to such a beautiful vehicle, however, we are taken aback by the person driving this vehicle in the video.&#13;
Story first published: Wednesday, January 21, 2015, 9:24 [IST]
Please Wait while comments are loading...

Latest Photos