ఎపిక్ డైరెక్టర్‌ కోసం ఎపిక్ కార్.. వోల్వో ఎక్స్‌సి40 కారును కొనుగోలు చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి

ఈగ, బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) తాజాగా, ప్రపంచంలో కెల్లా అత్యంత సురక్షితమైన కార్లను తయారు చేసే స్వీడన్ కార్ బ్రాండ్ అందిస్తున్న వోల్వో ఎక్స్‌సి40 (Volvo XC40) కారును కొనుగోలు చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఓల్వో ఇండియా తమ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో ఓ రెడ్ కలర్ వోల్వో కారును రాజమౌళి డెలివరీ తీసుకుంటున్న దృశ్యాన్ని చూడవచ్చు.

ఎపిక్ డైరెక్టర్‌ కోసం ఎపిక్ కార్.. వోల్వో ఎక్స్‌సి40 కారును కొనుగోలు చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి

ఆర్ఆర్ఆర్ (RRR) విజయాన్ని రాజమౌళి ఇలా జరుపుకున్నారని, ఎపిక్ డైరెక్టర్ కోసం ఎపిక్ కారు అని నెటిజెన్లు కామెంట్ల రూపంలో తమ అభినందనలు తెలియజేశారు. డైరెక్టర్ రాజమౌళి కొనుగోలు చేసినది ఓ రెడ్ కలర్ వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీ. స్వీడన్ లగ్జరీ కార్ బ్రాండ్ వోల్వో గడచిన 2018లో తొలిసారిగా దీనిని భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది వోల్వో ఇండియా ప్రోడక్ట్ లైనప్‌లో అందుబాటులో ఉన్న ఎంట్రీ లెవల్ లగ్జరీ ఎస్‌యూవీ. మార్కెట్లో దీని ధర సుమారు రూ.40 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకూ ఉంటుంది.

ఎపిక్ డైరెక్టర్‌ కోసం ఎపిక్ కార్.. వోల్వో ఎక్స్‌సి40 కారును కొనుగోలు చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి

గతేడాది ఇదే సమయంలో వోల్వో కార్ ఇండియా తమ బిఎస్-6 ఎక్స్‌సి40 ఎస్‌యూవీ ధరను భారీగా తగ్గించింది. వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీపై కంపెనీ రూ. 3.26 లక్షల వరకు తగ్గింపును ప్రకటించింది. ఈ డిస్కౌంట్ తర్వాత దీని ధర ఎక్స్ షోరూమ్ ధర రూ. 37.99 లక్షలకు చేరుకుంది. అయితే, తాజాగా వోల్వో తమ అన్ని కార్ల ధరలను 3 శాతం వరకూ పెంచింది. ఈ ధరల పెంపు పరిగణలోకి తీసుకుంటే, వోల్వో ఆన్-రోడ్‌కు చేరుకునే సరికి దాని ధర దాదాపు రూ.45-48 లక్షలు అయ్యే అవకాశం ఉంటుంది.

ఎపిక్ డైరెక్టర్‌ కోసం ఎపిక్ కార్.. వోల్వో ఎక్స్‌సి40 కారును కొనుగోలు చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి

వోల్వో ఎక్స్‌సి40 డిజైన్‌ను గమనిస్తే, ఇందులో వోల్వో యొక్క సిగ్నేచర్ T- ఆకారపు డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి హెడ్‌ల్యాంప్స్, గ్లోస్ బ్లాక్‌లో ఉండే సింగిల్-ఫ్రేమ్ ఫ్రంట్ గ్రిల్‌, 18 ఇంచ్ డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌ మరియు బాడీ చుట్టూ మందపాటి ప్లాస్టిక్ క్లాడింగ్‌తో ఎక్స్‌సి40 మంచి రగ్గడ్ లుక్‌ని కలిగి ఉంటుంది. ఇందులో నిలువుగా ఉండే టెయిల్ ల్యాంప్‌లు మరియు మరియు డ్యూయెల్ టోన్ ఎక్స్టీరియర్ కలర్స్‌తో ఇది మంచి రోడ్ ప్రజెన్స్‌ను కలిగి ఉంటుంది.

ఎపిక్ డైరెక్టర్‌ కోసం ఎపిక్ కార్.. వోల్వో ఎక్స్‌సి40 కారును కొనుగోలు చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి

వోల్వో ఎక్స్‌సి40 లోపలి భాగంలో పియానో ​​బ్లాక్, అల్యూమినియం పెయింట్ స్కీమ్ లో ఫినిష్ చేయబడి ఉంటుంది. దీని టచ్‌స్క్రీన్ చుట్టూ అల్యూమినియం యాక్సెంట్స్ కనిపిస్తాయి. ఈ కారులో స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లు, డాష్-మౌంటెడ్ వూఫర్, పానోరమిక్ సన్‌రూఫ్ మరియు స్మార్ట్ ఫోన్‌ ల కోసం వైర్‌లెస్ ఛార్జింగ్ కలిగిన 12.3 ఇంచెస్ వర్టికల్ టచ్‌స్క్రీన్‌ ను కలిగి ఉంది. వీటితో పాటు ఇందులో ఎమ్ఐడి టచ్‌స్క్రీన్, డిస్టెన్స్ అలెర్ట్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ అసిస్ట్ మరియు హ్యాండ్స్ ఫ్రీ ఆపరేటింగ్ టైల్ గేట్స్ వంటివి ఉన్నాయి.

ఎపిక్ డైరెక్టర్‌ కోసం ఎపిక్ కార్.. వోల్వో ఎక్స్‌సి40 కారును కొనుగోలు చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి

వోల్వో తమ భవిష్యత్ కార్ల కోసం తయారుచేసిన కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (సిఎంఎ) ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకొని ఈ కొత్త వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీని తయారు చేశారు. వోల్వో ఎక్స్‌సి40 కారులో 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ ఇంజన్ అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 187 బిహెచ్‌పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 8 స్పీడ్ గేర్‌బాక్స్‌ తో జత చేయబడి ఉంటుంది.

ఎపిక్ డైరెక్టర్‌ కోసం ఎపిక్ కార్.. వోల్వో ఎక్స్‌సి40 కారును కొనుగోలు చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి

ఇంకా ఇందులో హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, యాంబియంట్ లైటింగ్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లతో పాటుగా అడాప్టివ్ క్రూయిస్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్టెంట్, పార్క్ అసిస్ట్ కెమెరా, హిల్ స్టార్ట్ మరియు డిసెంట్ కంట్రోల్ మరియు కొల్లాజెన్ మిటిగేషన్ సపోర్ట్ వంటి అధునాతన సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. వోల్వో ఎక్స్‌సి40 కారు 2019 ప్రీమియం కార్ అవార్డును కూడా పొందింది. ఈ అవార్డును అందుకున్న మొట్టమొదటి లగ్జరీ కారుగా ఈ ఎక్స్‌సి40 నిలిచింది. భారత మార్కెట్లో వోల్వో ఎక్స్‌సి40, మెర్సిడెస్ బెంజ్ జిఎల్‌ఎ, బిఎమ్‌డబ్ల్యూ ఎక్స్1 మరియు ఆడి క్యూ3 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

ఎపిక్ డైరెక్టర్‌ కోసం ఎపిక్ కార్.. వోల్వో ఎక్స్‌సి40 కారును కొనుగోలు చేసిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి

వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్ (Volvo XC40 Recharge) ఈవీ వస్తోంది..

వోల్వో ఎక్స్‌సి40 మోడల్‌ లో కంపెనీ ఓ ఎలక్ట్రిక్ కారును కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది. భారత మార్కెట్లో కంపెనీ తమ సరికొత్త ఎలక్ట్రిక్ కారు "వోల్వో ఎక్స్‌సి40 రీచార్జ్" (Volvo XC40 Recharge) ను విడుదల చేయనుంది. వోల్వో ఎక్స్‌సి40 రీఛార్జ్ అనేది స్టాండర్డ్ పెట్రోల్ వెర్షన్ వోల్వో ఎక్స్‌సి40 ఎస్‌యూవీ ఆధారంగా తయారు చేయబడిన ఎలక్ట్రిక్ వాహనం. వోల్వో XC40 రీఛార్జ్ ఎలక్ట్రిక్ కారును కంపెనీ పూర్తిగా విదేశాలలో తయారు చేసి, కంప్లీట్లీ బిల్ట్ యూనిట్లుగా (CBU) రూట్ లో ఇండియాకు దిగుమతి చేసుకోనున్నారు. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Rrr director ss rajamouli buys new volvo xc40 suv details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X