మానవరహిత గగన విహంగ వాహనాలతో మాట్లాడే రష్యా హెలికాప్టర్

ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అభివృద్దికి హద్దు, అదుపు ఉండదు అంటే ఇదేనేమో. గగన తలంలో విహరించే మానవ రహిత వాహనాలతో సంప్రదించే హెలికాఫ్టర్‌ను రష్యా సృష్టించింది.

By Anil

సైనిక మరియు యుద్ద రంగానికి ఎంతగానో ఉపయోగపడే అత్యాధునిక, భవిష్యత్, శక్తివంతమైన మిలిటరీ యుద్ద విమానాన్ని అభివృద్ది చేసింది. ఇది ఏకంగా గాలిలో విహరించే మానవ రహిత డ్రోన్లు మరియు విహంగ వాహనాలతో సంప్రదించే పరిజ్ఞాన్ని కలిగి ఉంది. నైట్ హంటర్ హెలికాఫ్టర్ గన్‌షిప్‌గా అభివర్ణించిన దీని పేరు ఎమ్ఐ-28ఎన్ఎమ్.

రష్యా ఎమ్ఐ-28ఎన్ఎమ్ హెలికాప్టర్

రష్యా ప్రాంతీయ వార్తా వేదికలు తెలిపిన కథనం మేరకు, ఈ అధునాతన హెలికాఫ్టర్ ఎమ్ఐ-28ఎన్ఎమ్ కు అప్ గ్రేడెడ్ వర్షెన్‌గా రూపొందించబడింది. ఇది భారీ బాంబులను తీసుకెళ్లగలదు. మరియు గాలిలో మానవ రహిత డ్రోన్లు, గగన విహంగ వాహనాలతో సంప్రదించగలదు.

రష్యా ఎమ్ఐ-28ఎన్ఎమ్ హెలికాప్టర్

ఎమ్‌ఐఎల్ ప్రయోగ మరియు అభివృద్ది బ్యూరో అధికారి యెవ్జెని పులుయనోవ్ మాట్లాడుతూ, ఇది గగన తలంలో ఉండే మానవ రహిత యుద్ద విమానాలు, హెలికాఫ్టర్లు, డ్రోన్లు మరియు వాటి వద్ద ఉన్న ఆయుధ వివరాలను స్పేస్ నుండి నేల మీద ఉన్న అధికారులకు చేరవేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపాడు.

రష్యా ఎమ్ఐ-28ఎన్ఎమ్ హెలికాప్టర్

అధునాతన ఎమ్ఐ-28ఎన్ఎమ్ హెలికాఫ్టర్‌లో విభిన్న రకాల ఆయుధాలను మరియు మిస్సైళ్లను నింపినట్లు ఆయన తెలిపాడు.

రష్యా ఎమ్ఐ-28ఎన్ఎమ్ హెలికాప్టర్

ఈ హెలికాఫ్టర్‌లో యాంటి జామింగ్ వ్యవస్థ గల పరిజ్ఞాన్ని ప్రవేశపెట్టారు మరియు లేజర్ కాంతి ద్వారా మిస్సైళ్లకు కావాల్సిన వేడి మరియు యుద్ద క్షేత్రంలో ఉన్న సాద్యాసాధ్యాలను పరిశీలించే అవకాశం ఉంది.

రష్యా ఎమ్ఐ-28ఎన్ఎమ్ హెలికాప్టర్

పులియనోయ్ కథనం ప్రకారం, అమెరికాకు చెందిన ఏహెచ్‌-64-డి అపాచే హెలికాఫ్టర్‌తో పోల్చితే గణనీయమైన పనితీరును కనబరుస్తుంది మరియు అన్ని అంశాల పరంగా తలదన్నగలదని చెప్పుకొచ్చాడు.

రష్యా ఎమ్ఐ-28ఎన్ఎమ్ హెలికాప్టర్

ఈ అధునాతన అప్‌గ్రేడెడ్ ఎమ్ఐ-28ఎన్ఎమ్ హెలికాఫ్టర్‌లో అటాకా మరియు క్రిజంటెమా ఎయిర్ టు ఎయిర్ గైడెడ్ మిస్సైల్ ను అందివ్వడం వలన శత్రువులకు ఇది మరింత శక్తివంతమైన హెలికాఫ్టర్‌గా నిలిచింది.

రష్యా ఎమ్ఐ-28ఎన్ఎమ్ హెలికాప్టర్

ప్రస్తుతం ఉన్న ఎమ్ఐ-28ఎన్ఎమ్ ను మరింత అభివృద్ది చేసి అప్‌గ్రేడెడ్ హెలికాఫ్టర్‌గా అభివృద్ది చేసి ఐదవ తరానికి చెందిన గన్‌షిప్ యుద్ద విమానంగా పూర్తి స్థాయిలో రూపొందించి వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకురానున్నారు.

రష్యా ఎమ్ఐ-28ఎన్ఎమ్ హెలికాప్టర్

ఆధునిక ఆయిధాలకు మార్గదర్శకం చేసే వ్యవస్థను ఇందులో ప్రవేశపెట్టారు మరియు 360 డిగ్రీల కోణంలో రాడార్ ద్వారా పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఈ రెండు నూతన పరిజ్ఞానాల ద్వారా శత్రు స్థావరాలను అతి తక్కువ కాలంలో నాశనం చేయవచ్చు.

రష్యా ఎమ్ఐ-28ఎన్ఎమ్ హెలికాప్టర్

రష్యా రక్షణ రంగం తాజాగ ఆర్ఎస్-28 సర్మట్ అనే మిస్సైల్‌ను ప్రదర్శించింది. దీనిని నాటో అభివృద్ది చేసిన సతన్ 2 ప్రేరణతో అభివృద్ది చేసింది రష్యా.

రష్యా ఎమ్ఐ-28ఎన్ఎమ్ హెలికాప్టర్

ఈ సతన్-2 ఖండాతర బాలిస్టిక్ యుద్ద క్షిపణి అణుఉష్ట శక్తిని కిలిగి ఉంది. దీనికి సంభందించిన చిత్రాలను మరియు పూర్తి వివరాలను మేక్‌యేవ్ రాకెట్ డిజైన్ బ్యూరో తమ అధికారిక వెబ్‌సైట్లో పొందుపరిచింది. డ్రైవ్‌ స్పార్క్ తెలుగు సతన్-2 మిస్సైల్ గురించి ప్రత్యేక కథనం

రష్యా ఎమ్ఐ-28ఎన్ఎమ్ హెలికాప్టర్

  • పాక్ అంతం తద్యం అంటున్న ఇండియా-రష్యా భారీ ఒప్పందం
  • కార్లు మరియు బైకుల మీద దిమ్మతిరిగే ఆఫర్లు మరియు డిస్కౌంట్లు

Most Read Articles

English summary
Russias super Helicopter Mi28nm Can Shoot Missiles With Lasers
Story first published: Friday, November 4, 2016, 12:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X