సెహ్వాగ్‌కు ప్రేమతో సచిన్ టెండూల్కర్ చిరు కానుక

Written By:

టీమిండియా మాజీ ఓపెనింగ్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ సిక్సర్లకు పెట్టింది పేరు. అంతేనా, టీమిండియాలో లేకున్నప్పటికీ క్రికెట్ ఆటే ప్రాణంగా బతుకుతుంటాడు, అన్నింటికి మించి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాడు.

 సెహ్వాగ్‌కు బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారు

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారును బహుమానానికి గాను సచిన్‌కు మరియు బిఎమ్‌డబ్ల్యూ ఇండియాకు థ్యాంక్స్ చెబుతూ సెప్టెంబర్ 26, 2017 రోజున సెహ్వాగ్ తన అఫీషియల్ ట్విటర్ ఖాతా ద్వారా ట్వీట్ చేశాడు.

సెహ్వాగ్‌కు బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారు

వీరేంద్ర సెహ్వాగ్ సరికొత్త బిమ్‌డబ్ల్యూ 7-సిరీస్ 730ఎల్‌డి వేరియంట్‌ను ఇంటికితీసుకెళ్లాడు. దీని ధర రూ. 1.16 కోట్లు ఎక్స్-షోరూమ్‌గా ఉంది. సెలూన్ టైప్ కార్లలో 7-సిరీస్ 730 ఎల్‌డి అత్యంత పాపులర్ వెర్షన్.

సెహ్వాగ్‌కు బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారు

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ 730ఎల్‌డి సెలూన్ కారులో 3-లీటర్ల ఆరు సిలిండర్ల డీజల్ ఇంజన్ కలదు. 8-స్పీడ్ స్టెప్‌ట్రోనిక్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల ఇది 261బిహెచ్‌పి పవర్ మరియు 620ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

Recommended Video - Watch Now!
Jeep Compass Launched In India | In Telugu - DriveSpark తెలుగు
సెహ్వాగ్‌కు బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారు

బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ డీజల్ కారు, కేవలం 6.2 సెకండ్ల వ్యవధిలోనే గంటకు 0 నుండి 100కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.బిఎమ్‌డబ్ల్యూ లైనప్‌లోని లగ్జరీ కార్లలో అత్యంత సౌకర్యవంతమైన కార్లలో 7-సిరీస్ సరికొత్త క్రా మోడ్యులర్ ఆర్కిటెక్చర్ మీద నిర్మించబడింది.

సెహ్వాగ్‌కు బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారు

ఫీచర్ల పరంగా ఇందులో గెస్చర్ కంట్రోల్, రిమోట్ పార్క్ అసిస్ట్, త్రీడి గ్రాఫిక్స్ ఇంటర్‌ఫేస్, హెడ్స్ అప్ డిస్ల్పే యూనిట్ ఇంకా ఎన్నో ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 7-సిరీస్‌లో ఇంట్రికేటివ్ టచ్ స్క్రీన్ కీ ఫాబ్ కలదు. దీనిని ఆపరేట్ చేసి, కారును నడపడానికి ముందే కారులో అన్నింటిని ఇదే సిద్దం చేస్తుంది. మరియు ఆటోమేటిక్‌గా పార్కింగ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది.

సెహ్వాగ్‌కు బిఎమ్‌డబ్ల్యూ 7-సిరీస్ కారు

డ్రైవ్‌స్పార్క్ తెలుగు అభిప్రాయం!

టీమిండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ ఫీల్డులో లేనప్పటికీ దేశవ్యాప్తంగా తనకున్న అభిమానుల సంఖ్య అద్వితీయం. సెహ్వాగ్‌కు సచిన్ రహస్యంగా ఇచ్చిన కానుకను, సెహ్వాగ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులందరీ తెలియజేశాడు. ఏదేమైనా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ గ్రేట్...

English summary
Read In Telugu: Cricketer Sehwag Thanks Sachin Tendulkar For BMW 7 Series Gift
Story first published: Thursday, September 28, 2017, 17:16 [IST]

Latest Photos

డ్రైవ్స్పార్క్ నుండి తాజా ఆటో అప్డేట్స్ పొందండి
Telugu Drivespark