India
YouTube

బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన కండల వీరుడు 'సల్మాన్ ఖాన్': దీని వెనుక అంత కథ ఉందా..!!

బాలీవుడ్ కండల వీరుడు అంటేనే మొదట అందరికి గుర్తొచ్చేది 'సల్లూభాయ్' (సల్మాన్ ఖాన్). కావున సల్మాన్ ఖాన్ గురించి దాదాపు అందరికి తెలుసు. అయితే యితడు ఇటీవల బుల్లెట్ ప్రూఫ్ 'ల్యాండ్ క్రూయిజర్' కారులో కనిపించారు. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన కండల వీరుడు 'సల్మాన్ ఖాన్': దీని వెనుక అంత కథ ఉందా..!!

సల్మాన్ ఖాన్ బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించడం బహుశా.. ఇదే మొదటిసారి. అయితే ఉన్నట్టుండి బుల్లెట్ ప్రూఫ్ కారును ఉపయోగించాల్సిన అవసరం ఏమొచ్చిందని సామజిక వర్గాలు జుట్టుపీక్కుంటున్నాయి. అయితే దీని వెనుక బలమైన కారణం ఉన్నట్లు తెలుస్తోంది.

బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన కండల వీరుడు 'సల్మాన్ ఖాన్': దీని వెనుక అంత కథ ఉందా..!!

ప్రముఖ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య తర్వాత, లారెన్స్ బిష్ణోయ్ మరియు అతని గ్యాంగ్ నుంచి సల్మాన్ ఖాన్ కి బెదిరింపు లేఖలు రావడం వల్ల, తన సెక్యూరిటీని భారీగా పెంచడమే కాకుండా ఇలాంటి ఆధునిక ఫీచర్స్ కలిగిన ఒక బుల్లెట్ ప్రూఫ్ కారుని వినియోగిస్తున్నాడు. అంతే కాకూండా ఇటీవల తన తుపాకీకి పోలీసుల నుంచి లైసెన్స్ కూడా పొందినట్లు ఇప్పటికే తెలిసింది.

బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన కండల వీరుడు 'సల్మాన్ ఖాన్': దీని వెనుక అంత కథ ఉందా..!!

టయోటా ఇప్పటికే తన సరికొత్త ల్యాండ్ క్రూయిజర్ LC300 ను అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసింది. కానీ ఇది ఇంకా భారతీయ మార్కెట్లోకి అందుబాటులోకి రాలేదు. అయితే సల్మాన్ ఖాన్ యొక్క కొత్త బుల్లెట్ ప్రూఫ్ ల్యాండ్ క్రూయిజర్ మునుపటి తరానికి చెందినదని తెలుస్తోంది.

బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన కండల వీరుడు 'సల్మాన్ ఖాన్': దీని వెనుక అంత కథ ఉందా..!!

నిజానికి మెర్సిడెస్ బెంజ్, బిఎండబ్ల్యు మరియు ఆడి వంటి జర్మన్ తయారీదారుల మాదిరిగా కాకుండా టయోటా కంపెనీ అధికారికంగా బుల్లెట్ ప్రూఫ్ కార్లను విక్రయించదు. కావున వీటి కోసం ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ యాడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రపంచ వ్యాప్తంగా అనేక ప్రసిద్ధిచెందిన ఆర్మరింగ్ గ్యారేజీలు ఉన్నాయి. వీటి ద్వారా ఇలాంటి పటిష్టమైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను తయారు చేసుకోవచ్చు.

బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన కండల వీరుడు 'సల్మాన్ ఖాన్': దీని వెనుక అంత కథ ఉందా..!!

అయితే ఇలా తయారైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు చూసి వెంటనే అవి బుల్లెట్ ప్రూఫ్ అని నిర్దారించడం కొంచెం కష్టమైన పని అవుతుంది. కానీ కొంత నిశితంగా పరిశీలిస్తే మాత్రమే అవి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలని గుర్తించవచ్చు. అయితే ఇలాంటి వాహనాల యొక్క పనితీరు మునుపటికంటే కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది.

బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన కండల వీరుడు 'సల్మాన్ ఖాన్': దీని వెనుక అంత కథ ఉందా..!!

టయోటా కంపెనీ తన ల్యాండ్ క్రూయిజర్ SUV ని గత సంవత్సరం ప్రపంచ మార్కెట్లో ఆవిష్కరించింది. అయితే ఇప్పుడు కంపెనీ భారతీయ మార్కెట్లో LC300 SUV కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. కానీ ఊహించిన స్థాయికంటే ఎక్కువ బుకింగ్స్ రావడం వల్ల కంపెనీ బుకింగ్స్ తాత్కాలికంగా నిలిపివేసింది. మొదటి బ్యాచ్ డెలివరీలు పూర్తయిన తరువాత దీని బుకింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంటుంది.

బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన కండల వీరుడు 'సల్మాన్ ఖాన్': దీని వెనుక అంత కథ ఉందా..!!

టయోటా ల్యాండ్ క్రూయిజర్ కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, ఈ కారణంగా కొన్ని దేశాల్లో ఈ SUV కోసం గరిష్టంగా 4 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉంది.

ఇదిలా ఉండగా కంపెనీ యొక్క ఈ కారు ఇటీవల స్పాట్ టెస్ట్ లో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే కంపెనీ ఈ SUV ని త్వరలోనే భారతీయ మార్కెట్లో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త టొయోటా ల్యాండ్ క్రూయిజర్ ఎల్‌సి300 దాని మునుపటి తరం మోడళ్ల కాస్తంత పెద్దగా ఉంటుంది.

బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన కండల వీరుడు 'సల్మాన్ ఖాన్': దీని వెనుక అంత కథ ఉందా..!!

అంతే కాకూండా ఇది అనేక అప్డేటెడ్ ఫీచర్స్ మరియు పరికరాలతోపాటు, సేఫ్టీ అసిస్టెన్స్ ఫీచర్లను పొందుతుంది. ఈ లగ్జరీ ఎస్‌యూవీ కొత్త GA-F ప్లాట్‌ఫారమ్‌ పై నిర్మించబడింది. ఇందులో ఇప్పుడు కొత్త V6 ఇంజన్ ఉపయోగించినట్లు తెలుస్తోంది. కావున ఇందులో 3.5-లీటర్, టర్బోచార్జ్డ్ వి6 పెట్రోల్ ఇంజన్ ఉంటుంది.ఇది 409.32 బిహెచ్‌పి గరిష్ట పవర్ మరియు 650 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది.

అయితే రెండవ 3.3-లీటర్ టర్బోచార్జ్డ్ వి6 డీజిల్ ఇంజన్ 305 బిహెచ్‌పి పవర్ మరియు 700 ఎన్ఎమ్ టార్క్‌ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ తో జతచేయబడి ఉంటాయి. అయితే ఇందులో మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్ ఉండదు.

బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన కండల వీరుడు 'సల్మాన్ ఖాన్': దీని వెనుక అంత కథ ఉందా..!!

సల్మాన్‌ ఖాన్‌ ప్రస్తుతం 'కభీ ఈద్‌ కభీ దివాళీ' చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో 'పూజా హెగ్డే' హీరోయిన్ గా నటిస్తోంది. కాగా 'వెంకటేష్' ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు మరియు 'రామ్‌చరణ్‌' గెస్ట్ గా రానున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సల్మాన్ ఖాన్ మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ ఫాదర్‌ సినిమాలో గెస్ట్ గా కనిపించనున్నారు.

బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన కండల వీరుడు 'సల్మాన్ ఖాన్': దీని వెనుక అంత కథ ఉందా..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతదేశంలో ఇప్పటికే చాలామంది సెలబ్రెటీలు, పారిశ్రామిక వేత్తలు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఆ జాబితాలో చేరిపోయాడు. సల్మాన్ ఖాన్ యొక్క బుల్లెట్ ప్రూఫ్ కారు ధర రూ. 1.50 కోట్లు అని తెలుస్తోంది.

Most Read Articles

English summary
Salman khan seen in his bulletproof toyota land cruiser details
Story first published: Thursday, August 4, 2022, 16:16 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X