ఇది సల్మాన్ ఖాన్ కోసం తయారు చేసిన 'ఆల్ట్రా లగ్జరీ బస్'

By Ravi

వెహికల్ కస్టమైజేషన్ గురు.. దిలీప్ ఛాబ్రియాకు చెందిన డిసి డిజైన్స్.. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా వాహనాల ఇంటీరియర్, ఎక్స్టీరియర్లను కస్టమైజ్ చేసి ఇస్తుంది. సాధారణ వాహనాలను తీసుకొని వాటికి సరికొత్త లుక్ అండ్ ఫీల్‌ను కల్పించడంతో పాటు, అందులో ప్రపంచస్థాయి ఫీచర్లను జోడించడంలో దిలీప్ ఛాబ్రియాకు చెందిన డిసి డిజైన్స్ మంచి పాపులారిటీ సంపాధించుకుంది.

డిసి డిజైన్స్ ఇప్పటికే అనేక మంది బాలీవుడ్, టాలీవుడ్ సెలబ్రిటీలకు, ప్రముఖులకు, రాజకీయ నాయకులకు వాహనాలను (ప్రత్యేకించి వ్యానిటీ బస్సులను) వారి అభిరుచికి అనుగుణంగా కస్టమైజ్ చేసి పెట్టింది. బాలీవుడ్ దబాంగ్ సల్మాన్ ఖాన్ కోసం కూడా డిసి డిజైన్స్ ఓ వ్యానిటీ బస్‌ను కస్టమైజ్ చేసింది. సల్మాన్ ఖాన్ టేస్ట్‌కు తగినట్లుగా డిసి డిజైన్స్ ఈ బస్సులోని ఇంటీరియర్లను కస్టమైజ్ చేసింది.

మరి సల్మాన్ ఖాన్ వ్యానిటీ బస్సులో ఏమేమున్నాయో మనం కూడా ఓ లుక్కేద్దాం రండి..!

సల్మాన్ ఖాన్ 'లగ్జరీ బస్'

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఉపయోగించే ఈ ఆల్ట్రా లగ్జరీ వ్యానిటీ బస్సులోని వింతలు, విశేషాలను తర్వాతి స్లైడ్‌లలో పరిశీలించండి.

సల్మాన్ ఖాన్ 'లగ్జరీ బస్'

ఈ బస్సులో సల్మాన్ ఖాన్ కోసం పర్సనలైడ్జ్ ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌ను అమర్చారు. ఇందులో ఓ పెద్ద ఎల్‌సిడి టెలివిజన్, ఖాన్ కోసం ఓ కింగ్ సైజ్ లగ్జరీ సీట్, విఐపిలు, ప్రముఖులు కూర్చునేందుకు లగ్జరీ సోఫాను ఇందులో చూడొచ్చు.

సల్మాన్ ఖాన్ 'లగ్జరీ బస్'

ఇది హ్యాండ్/ఫేస్‌వాష్ ఏరియా. బ్రష్ చేసుకోవటానికి లేదా హ్యాండ్ వాష్ చేసుకోవటానికి వీలుగా ఇందులో ఓ ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేశారు. స్నానాల గదితో పాటుగా ఇందులో పూర్తిస్థాయి బాత్/రెస్ట్ రూమ్ సౌకర్యం ఉంటుంది.

సల్మాన్ ఖాన్ 'లగ్జరీ బస్'

ఈ ఫొటోలో మీరు చూస్తున్నది బస్సులో ఏర్పాటు చేసిన పడక గది. డోరుకు పక్కనే ఈ బెడ్‌రూమ్‌ను డిజైన్ చేశారు. టెలిఫోన్, ఎసి కంట్రోల్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్‌లను ఇందులో చూడొచ్చు.

సల్మాన్ ఖాన్ 'లగ్జరీ బస్'

పడక గదిలో కూడా సల్మాన్ ఖాన్ కోసం ఓ ప్రత్యేకమైన ఎంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో కూడా ఓ పెద్ద ఫ్లాట్‌స్క్రీన్ టెలివిజన్ ఉంటుంది.

సల్మాన్ ఖాన్ 'లగ్జరీ బస్'

సల్మాన్ ఖాన్ తన మిత్రులు, ప్రముఖలతో మాట్లాడాలనుకున్నప్పుడు ఈ లివింగ్ స్పేస్‌‌ను ఉపయోగిస్తాడు. సోఫాలకు మధ్యలో ఉండే ఈ టేబుల్‌ను అటు, ఇటు జరుపుకోవచ్చు.

సల్మాన్ ఖాన్ 'లగ్జరీ బస్'

సల్మాన్ ఖాన్‌కు మేకప్ వేసేందుకు కూడా ఈ లివింగ్ స్పేస్‌ను ఉపయోగిస్తారు. ఇందులో పెద్ద అద్దం, మేకప్ కిట్స్ ఉంటాయి.

సల్మాన్ ఖాన్ 'లగ్జరీ బస్'

ఫుల్లీ సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషనింగ్ కలిగిన ఈ బస్సులో అత్యవస పరిస్థితులో తప్పించుకునేందుకు అత్యవసర ద్వారాలతో పాటుగా, సేఫ్టీ ఫీచర్లను కూడా అందుబాటులో ఉంచారు.

సల్మాన్ ఖాన్ 'లగ్జరీ బస్'

సల్మాన్ ఖాన్ వానిటీ బస్సుకు మొత్తం మూడు ద్వారాలు ఉంటాయి. అందులో ప్రథమ ద్వారం డ్రైవర్ కోసం ఉంటుంది. మిగిలిన రెండు ద్వారాల్లో ఒకటి బెడ్‍‌‌రూమ్‌కు, మరొకటి లివింగ్ రూమ్‌కు ఉంటాయి.

సల్మాన్ ఖాన్ 'లగ్జరీ బస్'

సల్మాన్ ఖాన్ వ్యానిటీ బస్ ఎక్స్టీరియర్ లుక్.

సల్మాన్ ఖాన్ 'లగ్జరీ బస్'

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ లగ్జరీ వ్యానిటీ బస్సుకు సంబంధించిన వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
DC Design the well known India custom automobile designer is commonly commissioned to build vanity vans for Bollywood celebrities. This includes Salman Khan's vanity van, custom built by DC Design. Take a look.
Story first published: Monday, December 2, 2013, 15:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X