గాలిలో గందరగోళం.. విమానాలలో పెరగనున్న ఎయిర్ టర్బులెన్స్, కారణం ఏంటంటే..

విమాన ప్రయాణం అందరికీ అనుకూలంగా ఉండదు. ప్రత్యేకించి బలహీనమైన గుండె కలిగిన వారికి విమానం టేకాఫ్ అయినప్పటి నుండి ల్యాండ్ అయ్యే వరకూ క్షణం ఓ యుగంలా గడుస్తుంటుంది. విమాన ప్రయాణం అనేది ఒకప్పుడు ధనవంతులకు మాత్రమే అందుబాటులో ఉండే ఓ ప్రయాణ సాధనం.

అయితే, విమానయాన కంపెనీల మధ్య పెరిగిన పోటీ కారణంగా, ఇప్పుడు అతి తక్కువ ధరకే విమాన టిక్కెట్లు లభిస్తున్నాయి. పెరిగిన విమాన ప్రయాణీకులు మరియు విమానాల కారణంగా గాలిలో ఎయిర్ ట్రాఫిక్ కూడా విపరీతంగా పెరుగుతోంది.

గాలిలో గందరగోళం.. విమానాలలో పెరగనున్న ఎయిర్ టర్బులెన్స్, కారణం ఏంటంటే..?

సాధారణంగా, విమానం గాలిలోకి ఎగిరిన తర్వాత కొన్ని సందర్భాల్లో విమానంలో కుదుపులుగా అనిపిస్తుంది. గాలిలో విమానం ఊగిపోతున్నట్లుగా ఉంటుంది. దీనినే టర్బులెన్స్ (turbulence) అంటారు. విమానంలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ భయపడే సందర్భం కూడా ఇదే. మాములుగా అన్ని సందర్భాల్లో టర్బులెన్స్ అనిపించదు. కొన్నిసార్లు ఇది తెలిసీతెలియనట్లుగా ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో చాలా ఎక్కువగా అనిపిస్తుంది.

గాలిలో గందరగోళం.. విమానాలలో పెరగనున్న ఎయిర్ టర్బులెన్స్, కారణం ఏంటంటే..?

విమానం టర్బులెన్స్‌కు గురవడానికి ప్రధాన కారణం గగనతలంలో ఉండి గాలి ప్రవాహమే. ఓ నివేదిక ప్రకారం, రానున్న సంవత్సరాలలో విమానాలలో టర్బులెన్స్ మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడైంది. అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో ఇలాంటి సమస్యలు తగ్గాల్సింది పోయి, పెరగడం ఏంటనుకుంటున్నారా..? ఆ వివరాలేంటో చూద్దాం రండి.

గాలిలో గందరగోళం.. విమానాలలో పెరగనున్న ఎయిర్ టర్బులెన్స్, కారణం ఏంటంటే..?

అసలు టర్బులెన్స్ అంటే ఏమిటి?

టర్బులెన్స్ యొక్క నిర్వచనం చాలా సూటిగా ఉంటుంది. గగనతలంలో ప్రశాంతంగా ఉండాల్సిన గాలి, వివిధ శక్తుల కారణంగా భీభత్సంగా మారడమే. భారీ విమానాలు చాలా ఎత్తులో ప్రయాణిస్తుంటాయి, సాధారణంగా అంత ఎత్తులో గాలి చాలా ప్రశాంతంగా ఉంటుంది. అది, ఇది అన్ని ప్రాంతాలలో ఒకేలా ఉండదు, గాలి ప్రవాహానికి విమానంగా ఎదురుగా వెళ్తున్నప్పుడు ఆ గాలి విమానాన్ని కుదుపులకు గురయ్యేలా చేస్తుంది. ఇది అన్ని సందర్భాలలో ప్రమాదకరమైనది కాదు. కానీ, విమానం లోపల ప్రయాణీకులను మాత్రం భయభ్రాంతులకు గురిచేస్తుంది.

గాలిలో గందరగోళం.. విమానాలలో పెరగనున్న ఎయిర్ టర్బులెన్స్, కారణం ఏంటంటే..?

మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఓ సుందరమైన హైవేపై ప్రయాణిస్తున్న కారు ఉన్నట్టుండి ఆఫ్-రోడ్ పైకి వస్తే, ఆ కారులో ప్రయాణీకులు ఎలా అయితే కుదుపులను ఎదుర్కుంటారో విమానంలో కూడా ఇంచుమించు అలానే జరుగుతుంది. గాలిలో వాతావరణం అనుకూలించనప్పుడు విమానాలలో ఈ టర్బులెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి తుఫానాలు సంభవించే సమయంలో విమానాలలో టర్బులెన్స్ తారాస్థాయిలో ఉంటుంది. కొన్నిసార్లు, విమానాలలో జరిగే టర్బులెన్స్ కారణంగా ప్రయాణీకులు గాయపడే అవకాశం ఉంటుంది.

గాలిలో గందరగోళం.. విమానాలలో పెరగనున్న ఎయిర్ టర్బులెన్స్, కారణం ఏంటంటే..?

కఠినమైన గాలి ప్రతిచోటా ఉంటుంది. కానీ విమానంలో ప్రయాణించే వారు అనుభవించే అత్యంత సాధారణ టర్బులెన్స్ మూడు సాధారణ కారణాలను కలిగి ఉంటుంది. అది విమానంలో పర్వతాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు, గాలిలో జెట్ స్ట్రీమ్స్ ఉన్నప్పుడు మరియు తుఫానులు ఏర్పడినప్పుడు. భవిష్యత్తులో విమానాలలో టర్బులెన్స్ పెరగడానికి ప్రధాన కారణం వాతావరణంలో జరగబోయే మార్పులే. వాతావరణ మార్పు మన జీవితంలోని ఇతర అంశాల మాదిరిగానే విమాన ప్రయాణ అనుభవాన్ని కూడా మార్చబోతోంది.

గాలిలో గందరగోళం.. విమానాలలో పెరగనున్న ఎయిర్ టర్బులెన్స్, కారణం ఏంటంటే..?

రానున్న సంవత్సరాలలో భారీగా పెరగనున్న టర్బులెన్స్

రానున్న కాలంలో సముద్ర మట్టాలు పెరగడం, కరువు కాటకాలతో పాటు ప్రపంచ స్థాయిలో ఏర్పడే వివిధ వాతావరణ మార్పుల కారణంగా విమానాల టర్బులెన్స్ ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. యూకేలో ఉన్న యూనివర్శిటీ ఆఫ్ రీడింగ్‌లోని వాతావరణ శాస్త్ర ప్రొఫెసర్ పాల్ విలియమ్స్, టర్బులెన్స్ యొక్క బలాన్ని కొలవడానికి ఒక స్కేల్ కూడా ఉందని సూచించారు. వ్యతిరేఖ దిశలో ఉన్న గాలికి ఎదురుగా విమానం ప్రయాణించినప్పుడు టర్బులెన్స్ ఏర్పడుతుందని ఆయన చెప్పారు.

గాలిలో గందరగోళం.. విమానాలలో పెరగనున్న ఎయిర్ టర్బులెన్స్, కారణం ఏంటంటే..?

సాధారణంగా విమానాలు టర్బులెన్స్‌కి గురైనప్పుడు పైలట్ వెంటనే క్యాబిన్ క్రూని మరియు ప్రయాణీకులను అలెర్ట్ చేస్తాడు. వెంటనే సీట్ బెల్ట్ రిమైండర్‌ను కూడా ఆన్ చేస్తాడు. టర్బులెన్స్ సమయంలో విమానం లోపల కదలికలు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి. అంటే, విమానం టర్బులెన్స్‌కి గురైనప్పుడు క్యాబిన్ లోపల ప్రయాణీకులు అటూ ఇటూ కదలడం లేదా అందరూ ఒకే చోటుకి చేరుకోవడం వంటివి చేయకూడదు. ఎవరి సీటులో వారు కూర్చుని, తప్పనిసరిగా సీట్‌బెల్ట్ ధరించాలి.

గాలిలో గందరగోళం.. విమానాలలో పెరగనున్న ఎయిర్ టర్బులెన్స్, కారణం ఏంటంటే..?

విమానంలో టర్బులెన్స్ అనుభూతి చెందినప్పుడు విమానం కొంత ఎత్తు నుండి హఠాత్తుగా క్రిందకు దిగిపోతున్నట్లుగా అనిపిస్తుంది. పైలట్ గాలి యొక్క దిశ నుండి తప్పించుకునేందుకు విమానాన్ని కంట్రోల్ చేసే ప్రక్రియలో భాగంగా మనకు అలా అనిపిస్తుంది. చిన్నపాటి టర్బులెన్స్ లను ఉపేక్షించవచ్చు, కానీ టర్బులెన్స్ తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం ప్రతి ఒక్కరూ కూడా ఎవరి సీటులో వారు కూర్చుని సీట్ బెల్ట్ ధరించాలి. లేదంటే, టర్బులెన్స్ కారణంగా వారు విమానంలో విసిరివేయబడుతారు, ఫలితంగా గాయాల పాలవుతారు. కొన్నిసందర్భాల్లో ఇది ప్రాణంతకంగా కూడా పరణమిస్తుంది.

గాలిలో గందరగోళం.. విమానాలలో పెరగనున్న ఎయిర్ టర్బులెన్స్, కారణం ఏంటంటే..?

రాబోయే కాలంలో జరగబోయే వాతావరణ మార్పులు గగనతలంలో టర్బులెన్స్‌ను మారుస్తున్నాయని ప్రొఫెసర్ విలియమ్స్ అభిప్రాయపడ్డారు. తాము కంప్యూటర్‌లో కొన్ని లెక్కలు చేసామని మరియు రాబోయే దశాబ్దాలలో టర్బులెన్స్ రెండు లేదా మూడు రెట్లు పెరుగుతుందని కనుగొన్నామని ఆయన అన్నారు. సాధారణంగా అట్లాంటిక్ సముద్రంలో మీదుగా ప్రయాణించే విమానంలో సగటున 10 నిమిషాల టర్బులెన్స్‌ ఉంటుందని, కానీ రాబోయే దశాబ్దాల్లో ఇది 20 నిమిషాలు లేదా అరగంటకు పెరిగే ప్రమాదం ఉందని విలియమ్స్ చెప్పారు.

Most Read Articles

English summary
Scientists warns airplane turbulence to increase 2 to 3 times in future
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X